BigTV English

Smartphones: రాత్రిళ్లు ఫోన్ చూస్తున్నారా? ఇక ‘అది’ కష్టమే.. మరిచిపోండి, ఎవరు చెప్పినా వినరు కదా!

Smartphones: రాత్రిళ్లు ఫోన్ చూస్తున్నారా? ఇక ‘అది’ కష్టమే.. మరిచిపోండి, ఎవరు చెప్పినా వినరు కదా!

Smartphones Blue Light: స్మార్ట్ ఫోన్ అనేది మనిషి బాడీలో ఓ ముఖ్యమైన భాగంగా మారిపోయింది. చేతిలో ఫోన్ లేకపోతే ఏదో పోగొట్టుకున్న ఫీలింగ్ కలుగుతుంది. ప్రతి పనిని ఫోన్ ద్వారా చక్కదిద్దుకునే పరిస్థితి నెలకొన్నది. స్మార్ట్ ఫోన్ అతిగా వాడటం మంచిది కాదని చాలా పరిశోధనలు చెప్తూనే ఉన్నాయి. అయినా, జనాలు పద్దతి మార్చుకోలేకపోతున్నారు. తాజాగా నివేదిక ప్రకారం నిద్రకు ముందు స్మార్ట్ ఫోన్ చూడ్డం చాలా డేంజర్ అని తేలింది.


స్మార్ట్ ఫోన్ బ్లూ లైట్ తో ముప్పు తప్పదా?

చాలా మందికి నిద్రపోయే ముందు ఫోన్ చూడటం వ్యసనంగా మారింది. బెడ్ మీద పడుకున్నా చేతివేలు స్మార్ట్ ఫోన్ మీద ఆడుతూనే ఉంటుంది. కానీ, రాత్రి పూట స్మార్ట్ ఫోన్ నుంచి వచ్చే బ్లూ లైట్ చాలా ప్రమాదం అంటున్నారు నిపుణులు. బ్లూ లైట్ లేదంటే షార్ట్ వేవ్ లెన్త్ లైట్ సిర్కాడియన్ రిథమ్‌ను ప్రభావితం చేస్తుందన్నారు ఆక్స్‌ ఫర్డ్ విశ్వవిద్యాలయంలో సిర్కాడియన్ న్యూరోసైన్స్ ప్రొఫెసర్ స్టువర్ట్ పీర్సన్. “మన కళ్ళలోని గ్రాహకాలు మెదడుకు ఎప్పుడు మెలకువగా ఉండాలో చెప్పే సమయంలో బ్లూ లైట్ ను గ్రహించే కణాల ద్వారా ప్రేరేపించబడుతాయి. అవి ఎక్కువ వేవ్ లెన్త్ లైట్ ను గ్రహించే వాటి పైనా ప్రభావం చూపిస్తాయి. స్మార్ట్ ఫోన్ నుంచి విడుదలయ్యే బ్లూ లైట్ కంటి చూపు మీద తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది” అన్నారు.


నిద్ర మీద బ్లూ లైట్ ఎఫెక్ట్

స్మార్ట్ ఫోన్ విడుదల చేసే సగటు కాంతి కంటే డే లైట్ 1,000 రెట్లు ఎక్కువ ప్రకాశవంతంగా ఉంటుంది. గది లైటింగ్, సగటున 10 రెట్లు ప్రకాశవంతంగా ఉంటుంది. అయితే, సాంకేతికంగా స్మార్ట్‌ ఫోన్ల నుండి వచ్చే బ్లూ లైట్ నిద్రను గణనీయంగా ప్రభావింతం చేస్తుందని పీర్సన్ చెప్పారు. “మీ ఫోన్‌ను ఎక్కువ బ్రైట్ నెస్ స్క్రీన్‌ తో గంటల తరబడి ఉపయోగించడం, ఇప్పటికే నిద్ర సమస్యలు ఉంటే మరింత తీవ్రం అయ్యే అవకాశం ఉంది. పడుకునే ముందుకు స్మార్ట్ ఫోన్ చూడ్డం వల్ల నిద్ర ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. నిద్రలేమి సహా పలు రకాల ఇబ్బందులు ఎదురవుతాయి” అని చెప్పుకొచ్చారు.

Read Also: ఆ జపాన్ విలేజ్‌లో మనుషుల కంటే బొమ్మలే ఎక్కువ.. ఏ వీధిలో చూసినా అవే కనిపిస్తాయ్, ఎందుకంటే?

వీలైనంత వరకు నైట్ ఫోన్ చూడకండి!

బ్లూ లైట్ బ్లాకింగ్ కోసం ప్రత్యేక మైన కళ్లజోడు వాడటం కంటే కాస్త స్మార్ట్ ఫోన్ చూడటం తగ్గిస్తే సరిపోతుందంటున్నారు నిపుణులు. అలా చేయడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు చక్కటి నిద్రను పొందే అవకాశం ఉందంటున్నారు. అవసరం అయితే తప్ప, రాత్రి పూట స్మార్ట్ ఫోన్ చూడటం మానుకోవాలని సూచిస్తున్నారు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితులలో ఫోన్ చూడాల్సి వస్తే, లైటింగ్ పూర్తి స్థాయిలో తగ్గించాలంటున్నారు.

Read Also:  మీ హనీమూన్‌.. ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే ఈ ప్లేసెస్‌కు వెళ్లాల్సిందే!

Related News

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Weight Loss: ఈ యోగాసనాలతో.. 10 రోజుల్లోనే వెయిట్ లాస్

Sugar: చక్కెర తినడం 30 రోజులు ఆపేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా ?

Big Stories

×