OTT Movie : క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ మూవీ లవర్స్ ని బాగా ఎంటర్టైన్ చేస్తాయి. ఈ మూవీలలో వచ్చే సస్పెన్స్ సీన్స్ చాలా థ్రిల్లింగ్ గా ఉంటాయి. థియేటర్లలో రిలీజ్ అయిన ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ప్రస్తుతం ఓటీటిలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం పదండి.
హాట్ స్టార్ (Hotstar)
ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ పేరు “నో ఎగ్జిట్” (No exit). మత్తు పదార్థాలకు బానిసైన ఒక అమ్మాయి ఒక కిడ్నాపర్ ని ఎదుర్కునే క్రమంలో మూవీ స్టోరీ నడుస్తుంది. ఈ మూవీ ప్రస్తుతం ఓటిటి ప్లాట్ ఫామ్ హాట్ స్టార్ (Hotstar) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
హీరోయిన్ మత్తు పదార్థాలకు బానిసై ఒక రిహాబ్బిటేషన్ సెంటర్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటుంది. అక్కడికి ఒక హాస్పిటల్ నుంచి కాల్ చేసి మీ తల్లికి సీరియస్ గా ఉంది అని చెప్తారు. అయితే హీరోయిన్ తన తల్లి దగ్గరికి వెళ్లాలి అని వార్డెన్ కు చెప్తుంది. డాక్టర్ పర్మిషన్ లేనిదే వెళ్లడానికి కుదరదు అని చెప్తాడు. ఇదివరకే నువ్వు మీ తల్లికి బాగాలేదని అబద్ధం చెప్పి వెళ్లావు. ఇప్పుడు అలా కుదరదు అనడంతో, చేసేదేం లేక అక్కడ నుంచి తన కారు తీసుకొని పారిపోతుంది. కారులో ప్రయాణం చేస్తూ ఒకచోట తన చెల్లికి ఫోన్ చేసి నేను వస్తున్నాను అని చెప్తుంది. నీ అవసరం మాకు లేదని నువ్వు ఎప్పటికీ మారవు అని చెప్పి ఆమె ఫోన్ కట్ చేస్తుంది. చెల్లి అన్న మాటలకు హీరోయిన్ బాధపడుతూ కారులోనే ఉంటుంది. అక్కడికి ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి ఈ దారి లో మంచు ఎక్కువగా ఉంది. ఇక్కడ దగ్గరలో ఒక హోటల్ ఉంది అక్కడ స్టే చేయమని పోలీస్ ఆఫీసర్ చెప్తాడు.
అక్కడికి హీరోయిన్ వెళ్ళగా కొంతమంది కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఆ హోటల్ కి పక్కనే కారులో ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి ఉంటారు. ఈ విషయాన్ని కనిపెట్టిన హీరోయిన్ ఇక్కడ ఉన్నవాళ్లే ఎవరో ఈ అమ్మాయిని కిడ్నాప్ చేశారని గ్రహిస్తుంది. హోటల్ లో ఒక వ్యక్తిపై అనుమానం వచ్చి పోలీసులకు మెసేజ్ పెడుతుంది. అయితే సిగ్నల్ లేకపోవడంతో ఆ మెసేజ్ పోలీసులకు వెళ్ళదు. ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసిన విషయం హీరోయిన్ కి తెలిసిపోయిందని కిడ్నాపర్ కి అర్థమవుతుంది. హీరోయిన్ ను చంపటానికి కిడ్నాపర్ ట్రై చేస్తాడు. హీరోయిన్ ఆ కిడ్నాపర్ నుంచి అమ్మాయిని కాపాడుతుందా? కిడ్నాపర్ ని హీరోయిన్ ఎలా ఎదుర్కొంటుంది? చివరికి హాస్పిటల్ లో ఉన్నతన తల్లిని చూడగలుగుతుందా? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే ఓటిటి ప్లాట్ ఫామ్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న “నో ఎగ్జిట్” (No exit) మూవీని తప్పకుండా చూడండి. ఈ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీలో క్లైమాక్స్ అదిరిపోతుంది.