
Fenugreeks Benefits : మెంతుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అందుకే వీటిని మన ఆహారంలో భాగం చేశారు పెద్దలు. అధిక బరువు ఉన్నవారు ఈ మెంతులను నీటిలో రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఈ నీటిని తాగితే కొద్దిరోజుల్లోనే బరువు తగ్గడం ఖాయమని నిపుణులు అంటున్నారు. ఇందులోని ఫ్లేవనాయిడ్స్ మన పొట్టచుట్టూ పేరుకున్న కొవ్వును కరిగిస్తుంది. విరేచనాలతో బాధపడుతుంటే మజ్జిగలో మెంతుల పౌడర్ వేసుకుని తాగితే తగ్గిపోతాయి.
రాత్రి నానబెట్టిన మెంతులను ఉదయం తింటే గ్యాస్, అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఉండవు. గర్భాశయ సమస్యలు ఉన్న స్త్రీలు మెంతులు తింటే చక్కని ఔషధంగా ఇవి పనిచేస్తాయి. నానబెట్టిన మెంతుల్ని తగిన మోతాదులో తీసుకుంటే నెలసరి క్రమం తప్పకుండా వస్తుంది. అంతేకాకుండా ఆ సమయంలో వచ్చే నొప్పికూడా తగ్గుతుంది.
అలాగే నీళ్లలో మెంతుల పొడి కలుపుకొని తాగితే నెలసరి సమయంలో వచ్చే వికారం, తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. మెంతుల పొడిని పాలను కలిపి ముఖంపై రాసి మసాజ్ చేసి అరగంట తర్వాత గోరు వెచ్చని నీటితో కడుకుంటే మీ ముఖం కాంతివంతంగా మారుతుంది.
మెంతులను నానబెట్టి ఉడికించి వడకట్టాలి. తర్వాత ఆ నీటిలో దూదినిముంచి ముఖంపై రాసుకుంటే మొటిమలు, నల్లని మచ్చలు పోతాయి. నానబెట్టిన మెంతులను పేస్ట్‌గా చేసి ముఖానికి ప్యాక్‌లా వేసుకుంటే ముఖం మృదువుగా మారుతుంది. అలాగే కొబ్బరి నూనెలో మెంతి పొడి వేసి తలకు పెట్టుకుంటే చుండ్రు సమస్య నుండి బయటపడవచ్చు. ఇలా మెంతులు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి.