Big Stories

Kartika Masam : కార్తీక మాసంలో ఆ పని చేస్తే చాలా పుణ్యం

- Advertisement -

Kartika Masam : తెలుగు మాసాల్లో కార్తీక మాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది. చాలా విశిష్టమైంది. హిందూ క్యాలెండర్ ప్రకారం కార్తీక మాసం అక్టోబర్ 26 నుంచి ప్రారంభమవుతుంది. నవంబర్ 23న ముగుస్తుంది. కార్తీక మాసాన్ని విష్ణువును పూజించే నెలగా పరిగణిస్తారు. అలాగే ఈ నెలను ఉపవాసం, పండుగల నెల గా భావిస్తారు.

- Advertisement -

కార్తీక మాసం ఆచరించాల్సిన పద్ధతులు

కార్తీక మాసంలో పరమశివుడికి అత్యంత్ర ప్రీతిపాత్రమైంది. ఆధ్యాత్మికంగా ఆరోగ్య ప్రదమైన మాసం. ఈ మాసంలో సోమవారం నాడు పూజ చేసి ఉపవాసం చేసి రాత్రి నక్షత్ర దర్శనం చేసి భోజనం చేస్తే అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుందని ‘ధర్మసింధువు’ గ్రంథం చెబుతోంది.

ప్రతీ ఏటా దీపావళి వెళ్లిన మరుసటి రోజు పవిత్రమైన కార్తీక మాసం మొదలవుతుంది. ఈ మాసంలో భక్తులంతా భోళాశంకరుడి నామాన్ని స్మరిస్తూ ఉంటారు. హరిహరాదులకు ఈ ప్రీతిపాత్రమైన మాసంలో భక్త కోటి కఠిన నిష్ఠతో చేసే నోములకు ఎంతో ప్రాముఖ్యం ఉంటుంది.పంచలింగాల దర్శనం, జ్యోతిర్లింగాల దర్శనం మేలు చేస్తుంది. దేశం నలుమూలలా ఉన్న వివిధ ఆలయాల్లో రుద్రాభిషేకాలు, రుద్రపూజ, లక్ష బిల్వదళాలతో పూజలు, అమ్మవారికి లక్ష కుంకుమార్చనలు విశేషంగా జరుపుతూ ఉంటారు. అలా విశేషార్చనలు జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై కొంగుబంగారంలా సంతోషం కలిగిస్తాడు.

ఉపవాసం, దానం మామూలు రోజుల్లో చేసేటప్పుడు కంటే కార్తీకమాసంలో ఎన్నో రెట్ల ఫలితాన్ని ఇస్తుందని భక్తుల నమ్మకం. విష్ణువును తులసి దళాలు, మల్లె ,కమలం,జాజి, గరిక, దర్బలను శివుని బిల్వ దళాలు, జిల్లేడు పూలతోనూ అర్చించిన వారికి ఇహపర సౌఖ్యాలతో పాటు ఉత్తమగతులు ప్రాప్తిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. కార్తీకమాసంలో చేసే దీపారాధనతో గతజన్మ పాపాలతో సహా ఈ జన్మ పాపాలు కూడా తొలగిపోతాయని విశ్వాసం.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News