BigTV English

Belly Fat: పొట్ట పెరిగి ముడతలు పడ్డాయా ? ఈ పొడిని రోజా రాత్రి తీసుకుంటే మొత్తం కరిగిపోద్ది

Belly Fat: పొట్ట పెరిగి ముడతలు పడ్డాయా ? ఈ పొడిని రోజా రాత్రి తీసుకుంటే మొత్తం కరిగిపోద్ది

Belly Fat Reduce Powder: ఒకప్పుడు పెళ్లైన మగవాళ్లకు పొట్టవచ్చేది. అంటే భార్య చేతి వంట తినీ తినీ అలా వచ్చింది అనేవారు. కానీ ఇప్పుడు.. మూడు పదుల వయసుదాటినా పెళ్లిళ్లు కావడం లేదు కానీ.. పొట్టలు మాత్రం పెరిగిపోతున్నాయి. ఈ సమస్య ఒక్క ఐటీ ఉద్యోగుల్లోనే కాదు.. శరీరం కదలకుండా.. నెలజీతం కోసం.. గంటలతరబడి కుర్చీలకు పరిమవుతున్న ప్రతీ ఉద్యోగికి ఉంది.


హాస్టల్స్ లో పెట్టే ఫుడ్ నచ్చక కొందరు, రూమ్ లో ఫుడ్ వండుకోలేక మరికొందరు.. బయటి ఫుడ్ కు బాగా అలవాటు పడుతున్నారు. మెట్రో సిటీల్లో అయితే ఇంకా దారుణంగా ఉంది పరిస్థితి. సమయం, సందర్భం లేకుండా బిర్యానీలు, ఫాస్ట్ ఫుడ్లు తినడం, వాటిని అరిగించుకోలేక నానాతంటాలు పడటం పరిపాటిగా మారింది. ఐస్ క్రీమ్ లు, కేక్ లు, కూల్ డ్రింక్స్ వంటి వాటిలో కేలరీలు ఎక్కువుంటాయని తెలిసినా వాటినే ఇష్టపడుతున్నారు. ఫలితంగా బానపొట్టల్ని కరిగించుకోలేక ఇబ్బంది పడుతున్నారు.

Also Read: 610 కేజీల బరువుతో చనిపోతాడనుకున్న బాలుడు బతికాడు.. అంతా ‘రాజు’గారి దయ..


తిన్న వెంటనే కుర్చీలకు అతుక్కుపోవడం వల్ల కూడా పొట్ట పెరుగుతుంది. మరి అంతలా పెరిగిన పొట్ట.. ముడతలు పడకుండా కరిగించుకునేందుకు ఒక చిట్కా ఉంది. కానీ.. దీనిని క్రమం తప్పకుండా పాటించాలి.

250 గ్రాములు మెంతులు, 100 గ్రాములు వాము, 50 గ్రాములు నల్ల జీలకర్రను తీసుకోవాలి. వీటిని శుభ్రం చేసుకుని వేర్వేరుగా సన్నని మంటపై వేయించుకోవాలి. చల్లారిన తర్వాత మూడింటినీ కలిపి పొడి చేసుకుని.. ఒక గాజు కంటైనర్ లో స్టోర్ చేసుకోవాలి.

ఎలా వాడాలి ?

ప్రతిరోజూ రాత్రి భోజనం చేసిన తర్వాత 1 గ్లాస్ గోరువెచ్చని నీటిలో 1 స్పూన్ పొడి కలిపి తాగాలి. ఈ డ్రింక్ తాగిన తర్వాత మరే ఇతర ఆహారాన్ని తినకూడదు తాగకూడదు. మంచినీళ్లు మాత్రం తాగవచ్చు. దీనిని 80 నుంచి 90 రోజులపాటు క్రమం తప్పకుండా వాడితే.. మంచి ఫలితం కనిపిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం.. ట్రై చేసి.. మీ పొట్టను కరిగించుకోండి.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనికి ఎలాంటి బాధ్యత వహించదు.)

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×