BigTV English

Actress Nidhi Birthday: నటి నిధి అగర్వాల్‌కి ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చిన రాజాసాబ్ టీమ్

Actress Nidhi Birthday: నటి నిధి అగర్వాల్‌కి ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చిన రాజాసాబ్ టీమ్

Actress Nidhi Aggarwal Shocked The Team Of Rajasaab: హైదరాబాద్‌లో పుట్టి, బెంగళూరులో పెరిగిన హీరోయిన్ నిధి అగర్వా్ల్. ఈ నటి గురించి టాలీవుడ్ ఆడియెన్స్‌కి స్పెషల్‌ ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన పనిలేదు. ఎందుకంటే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి తనదైన శైలిలో ఫ్యాన్స్ ఫాలోయింగ్‌ని సంపాదించుకుంది ఈ భామ. అంతేకాకుండా అగ్రహీరోలతో యాక్ట్ చేస్తూ తిరుగులేని హీరోయిన్‌గా రాణిస్తోంది. అయితే అసలు మ్యాటర్ ఏంటంటే ఈరోజు తన బర్త్‌డే. ఈ బర్త్‌డే ఈవెంట్‌ని చాలా గ్రాండ్‌గా ప్లాన్ చేశారు రాజాసాబ్ మూవీ యూనిట్. ఈ కార్యక్రమంలో దర్శకుడితో మారుతితో పాటు ఆ మూవీ యూనిట్ టీమ్ అంతా హాజరయ్యారు. ఇక ఇది చూసిన ఆమె ఒకింత ఆశ్చర్యానికి గురి అయింది. అంతేకాదు ఆమె బర్త్‌డేకి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అంతేకాదు ఈ సెలబ్రేషన్స్‌ని ప్లాన్ చేసిన టీమ్ సభ్యులందరికి చాలా చాలా థ్యాంక్స్‌ అంటూ ట్విట్టర్ వేదికగా తెలిపింది. అంతేకాదు ఈ టీమ్‌లో తాను భాగస్వామ్యం అయినందుకు చాలా ఆనందంగా ఉందంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది.


ఇక తాను పోస్ట్ చేసిన న్యూస్ చూసిన నెటిజన్లు తనకి బర్త్‌డే విషెస్ చెబుతున్నారు. ఇక ఈ భామ విషయానికి వస్తే.. నార్త్‌ ఇండియా భామలా అచ్చం అలానే కనిపిస్తుంది. కానీ హైదరాబాద్‌లో పుట్టిన ఈ భామకి తెలుగు, కన్నడ, తమిళ భాషలు వస్తాయి. అంతేకాదు ఈ భామ 2017 ఏడాదిలోనే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. కానీ తనకి ఆ అదృష్టం అనుకున్న టైమ్‌కి రాలేకపోయింది. గతంలో బాలీవుడ్‌లో మున్నా మైఖేల్ అనే మూవీలో నటించి హీరోయిన్‌గా అరంగేట్రం చేసింది.

Also Read: పిఠాపురానికి మహర్థశ, పవన్ కల్యాణ్‌కు రామ్‌చరణ్‌ బిగ్‌ గిఫ్ట్‌..


ఇక తెలుగు విషయానికొస్తే… సవ్యసాచి మజ్ను ఇస్మార్ట్ శంకర్ వంటి మూవీస్‌లో యాక్ట్ చేసింది.ఇక వీటన్నింటిలో హీరో రామ్ హీరోగా నటించిన ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. కానీ అది రామ్ పూరీ క్రెడిట్‌లోకి వెళ్లింది. ఈ భామకి మాత్రం అనుకున్నంత ఐడెంటీటీ మాత్రం రాలేదు. ప్రస్తుతం ప్రభాస్‌తో రాజాసాబ్ మూవీ, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు వంటి మూవీస్‌లో యాక్ట్ చేస్తుంది ఈ భామ. అంతేకాదు ఈ భామ కెరీర్ స్ట్రాంగ్‌గా నిలబడాలంటే ఈ రెండు సినిమాలు హిట్ కావాల్సిన పరిస్థితి నెలకొంది. తన ఆశలన్నీ పవన్ కల్యాణ్, ప్రభాస్ మూవీస్‌పైనే ఉన్నాయి. మరి ఈ రెండు సినిమాలతోనైనా హిట్ హీరోయిన్‌గా రాణిస్తుందో లేదో తెలియాలంటే తన మూవీస్ రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయకతప్పదు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×