E-Paper
Advertisement

Side Effects of AC: చల్లని గాలి.. బోలెడన్ని రోగాలు! ఏసీ వల్ల కలిగే ఈ 10 నష్టాల గురించి మీకు తెలుసా?

Side Effects of AC: చల్లని గాలి.. బోలెడన్ని రోగాలు! ఏసీ వల్ల కలిగే ఈ 10 నష్టాల గురించి మీకు తెలుసా?
Advertisement

Side Effects Of AC: ఎండల నుంచి ఉపశమనం పొందడానికి మనందరం ఏసీలపై ఎక్కువగా ఆధారపడుతుంటాం. ఆఫీసులు, ఇళ్ల.. ప్రస్తుతం ఏసీ లేనిదే గడవని పరిస్థితి నెలకొంది. అయితే.. గంటల తరబడి ఏసీ గదుల్లో గడపడం వల్ల మన ఆరోగ్యానికి తెలియకుండానే కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. చల్లని గాలి హాయినిచ్చినప్పటికీ.. అది మన చర్మం, కళ్లు , శ్వాసకోశ వ్యవస్థపై చూపే ప్రభావం గురించి అవగాహన ఉండాలి. ఏసీ వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్, నివారణ మార్గాలను గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఎయిర్ కండీషనర్ వల్ల కలిగే 10 ఆరోగ్య సమస్యలు:

Advertisement

1. చర్మం పొడిబారడం:
ఏసీ గదిలోని గాలిలో ఉన్న తేమను పూర్తిగా పీల్చేస్తుంది. దీని వల్ల మన చర్మం సహజమైన మెరుపును కోల్పోయి.. పొడి బారిపోతుంది. ఎక్కువ సమయం ఏసీ కింద ఉండటం వల్ల ఇది దురద, చర్మ వ్యాధులకు దారితీసే ప్రమాదం కూడా ఉంటుంది.

2. కంటి సమస్యలు:
కళ్లలోని తేమ ఆవిరైపోవడం వల్ల కళ్లు మంటలు పుట్టడం, ఎర్రబడటం జరుగుతుంది. ముఖ్యంగా.. కాంటాక్ట్ లెన్సులు వాడే వారికి ఏసీ గాలి వల్ల ‘డ్రై ఐ సిండ్రోమ్’వచ్చే అవకాశం ఎక్కువ.

Advertisement

3. డీహైడ్రేషన్:
ఏసీ గదిలో ఉన్నప్పుడు మనకు దాహం తక్కువగా అనిపిస్తుంది. పైగా ఏసీ గాలి శరీరంలోని నీటిని పీల్చేస్తుంది. దీని వల్ల తెలియకుండానే శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది.

4. శ్వాసకోశ ఇబ్బందులు:
ఏసీ ఫిల్టర్లను క్రమంగా శుభ్రం చేయకపోతే.. అందులో పేరుకుపోయిన ధూళి, బ్యాక్టీరియా గాలి ద్వారా మన ఊపిరితిత్తుల్లోకి చేరుతాయి. దీని వల్ల సైనస్, జలుబు, దగ్గు వంటి సమస్యలు తలెత్తుతాయి.

5. అలసట , తలనొప్పి:
ఏసీ గదుల్లో గాలి ప్రసరణ తక్కువగా ఉంటుంది. దీనివల్ల ఆక్సిజన్ స్థాయిలు స్వల్పంగా తగ్గి.. తలనొప్పి లేదా నీరసంగా అనిపించవచ్చు. దీనినే ‘సిక్ బిల్డింగ్ సిండ్రోమ్’ అని కూడా పిలుస్తారు.

6. కీళ్ల నొప్పులు:
అతి చల్లని గాలి నేరుగా కీళ్లపై పడటం వల్ల రక్త ప్రసరణ తగ్గి నొప్పులు మొదలవుతాయి. ముఖ్యంగా ఆర్థరైటిస్ సమస్య ఉన్నవారికి ఏసీ వల్ల నొప్పులు తీవ్రమవుతాయి.

7. రోగనిరోధక శక్తి తగ్గడం:
ఎప్పుడూ ఏసీ ఉష్ణోగ్రతలో ఉండటం వల్ల మన శరీరం బయట ఉండే సహజ ఉష్ణోగ్రతలకు తట్టుకునే శక్తిని కోల్పోతుంది. దీని వల్ల చిన్నపాటి వాతావరణ మార్పులకే త్వరగా జబ్బు పడతారు.

8. ఆస్తమా, అలర్జీలు:
ఏసీ డక్టులలో పేరుకుపోయే బూజు, ఫంగస్ వల్ల ఆస్తమా రోగులకు ఊపిరి ఆడకపోవడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి.

9. జీవక్రియ మందగించడం:
శరీరం సహజంగా వేడిని తట్టుకోవడానికి చేసే ప్రయత్నం ఏసీలో ఉండదు. దీని వల్ల జీవక్రియ మందగించి, కొందరిలో బరువు పెరిగే అవకాశం కూడా ఉంటుంది.

Also Read: యంగ్ ఏజ్‌లోనే హై బీపీనా? మీ లైఫ్ స్టైల్‌లో ఈ 5 తప్పులు చేస్తున్నారేమో !

10. రక్తపోటుపై ప్రభావం:
అకస్మాత్తుగా ఎండలో నుంచి ఏసీలోకి రావడం లేదా ఏసీ నుండి ఎండలోకి వెళ్లడం వల్ల రక్తనాళాలు వేగంగా సంకోచించి, వ్యాకోచిస్తాయి. బీపీ పెరగడానికి అంతే కాకుండా తగ్గడానికి కూడా కారణం అవుతుంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
ఏసీ ఉష్ణోగ్రతను ఎప్పుడూ 24°C నుంచి 26°C మధ్య ఉంచండి.

ఏసీ ఫిల్టర్లను నెలకు ఒకసారి ఖచ్చితంగా శుభ్రం చేయండి.

గదిలో ఒక మూల నీటి గిన్నెను ఉంచడం ద్వారా గాలిలో తేమను కాపాడుకోవచ్చు.

ఏసీలో ఉన్నప్పుడు నీరు ఎక్కువగా తాగుతూ ఉండాలి.

Related News

హెవీ ఇయర్‌రింగ్స్‌తో చెవి నొప్పి వస్తుందా? చెవి రంధ్రాలు సాగకుండా ఈ సింపుల్ ట్రిక్ పాటించండి

ఒక్క పన్ను పీకడానికి రూ.2.25 లక్షలా.. అదే ఇండియాలో అయితే?

డెస్క్ జాబ్ చేస్తున్నారా? ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వచ్చే సమస్యలు ఇవే

తగ్గేదెలే.. ఈ తేదీల్లో పుట్టినవారు ఆత్మగౌరవం విషయంలో అసలు రాజీపడరు

స్కూల్‌కు వెళ్లే సమయం అయినా పిల్లలు నిద్రలేవడం లేదా? ఈ 5 టిప్స్‌తో మార్నింగ్ రొటీన్ మార్చండి

గుండెపోటు ముప్పును 30 శాతం తగ్గించగల పిల్.. తాజా అధ్యయనంలో అద్భుత ఫలితాలు

వర్షాకాలంలో తరచూ అనారోగ్యానికి గురవుతున్నారా? రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి ఈ పుడ్స్

రక్తంలో చక్కెర పెరగకుండా ఉండాలంటే ఆపిల్ తినాలా? పియర్ తినాలా?

Big Stories

Advertisement
×