E-Paper
Advertisement

Korean Habits: కొరియన్ల లాగా స్లిమ్‌గా మారాలా ? బెల్లీ ఫ్యాట్ తగ్గించే 7 అద్భుతమైన మార్గాలు

Korean Habits: కొరియన్ల లాగా స్లిమ్‌గా మారాలా ? బెల్లీ ఫ్యాట్ తగ్గించే 7 అద్భుతమైన మార్గాలు
Advertisement

Korean Habits: పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వు కేవలం చూడటానికి ఇబ్బందికరంగా ఉండటమే కాకుండా.. అనేక ఆరోగ్య సమస్యలకు (గుండె జబ్బులు, మధుమేహం) దారితీస్తుంది. కొరియన్లు ఫిట్‌నెస్, స్లిమ్ బాడీ వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందారు. సహజ సిద్ధంగా.. కఠినమైన డైట్లు లేకుండా బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి కొరియన్లు పాటించే కొన్ని ముఖ్యమైన అలవాట్లు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

1. కూరగాయలు:

కొరియన్ భోజనంలో సగం కంటే ఎక్కువ భాగం కూరగాయలే ఉంటాయి. వీటిలో ఫైబర్ (పీచు పదార్థం) ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. వీటిని తినడం వల్ల ఎక్కువ సేపు ఆకలి వేయకుండా చేస్తుంది. ముఖ్యంగా ఆకుకూరలు, మొలకలు, కాలానుగుణంగా దొరికే కూరగాయలను వారు ఎక్కువగా తీసుకుంటారు.

Advertisement

2. కిమ్చీ , పులియబెట్టిన పదార్థాలు:

కొరియన్ల ఆహారంలో ‘కిమ్చీ’ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇది క్యాబేజీ, ఇతర కూరగాయలతో చేసిన పులియబెట్టిన వంటకం. ఇందులో ఉండే ప్రోబయోటిక్స్ పొట్టలోని మంచి బ్యాక్టీరియాను పెంచుతాయి. ఇది మెటబాలిజంను వేగవంతం చేసి.. బెల్లీ ఫ్యాట్ కరగడానికి అద్భుతంగా సహాయ పడుతుంది.

3. ఉడికించిన ఆహారం:

కొరియన్లు ఆహారాన్ని వేయించడం కంటే ఉడకబెట్టడం, ఆవిరిపై ఉడికించడం లేదా గ్రిల్ చేయడం వంటి పద్ధతులను పాటిస్తారు. దీని వల్ల క్యాలరీలు తక్కువగా ఉండి.. పోషకాలు పోకుండా అందుతాయి. నూనె వాడకం తగ్గించడం వల్ల పొట్ట పెరగకుండా ఉంటుంది.

4. పంచదార, జంక్ ఫుడ్‌కు దూరం:

పాశ్చాత్య దేశాలతో పోలిస్తే కొరియన్లు సోడా, స్వీట్లు.. మైదాతో చేసిన పదార్థాలను తక్కువగా తీసుకుంటారు. వారు భోజనం తర్వాత డెజర్ట్‌లకు బదులుగా తాజా పండ్లను తినడానికి ఇష్టపడతారు. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు.

5. వాకింగ్- లైఫ్ స్టైల్ :

కొరియన్లు కేవలం జిమ్ లకే పరిమితం కాకుండా.. రోజువారీ పనుల్లో నడకను భాగం చేసుకుంటారు. ఆఫీసులకు వెళ్లడానికి మెట్లు ఎక్కడం, చిన్న చిన్న దూరాలకు నడిచి వెళ్లడం వారి సంస్కృతిలో భాగం. ప్రతి రోజూ భోజనం తర్వాత కనీసం 15 నిమిషాల నడక జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తుంది.

Also Read: అన్నం వండిన వెంటనే తింటున్నారా? అయితే ఈ షాకింగ్ హెల్త్ ఫ్యాక్ట్స్ తెలుసుకోండి !

6. నీరు, గ్రీన్ టీ :

కొరియన్లు రోజంతా తగినంత నీరు తాగుతారు. అలాగే వారు ‘బోరిచా’ లేదా గ్రీన్ టీ వంటి డ్రింక్ప్ ఎక్కువగా తీసుకుంటారు. ఇవి శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపి.. కొవ్వును కరిగించడంలో తోడ్పడతాయి.

7. ఇంటి భోజనానికే ప్రాధాన్యత:

బయట దొరికే ప్రాసెస్ చేసిన ఆహారం కంటే ఇంట్లో తయారు చేసుకున్న తాజా ఆహారాన్నే వారు ఇష్టపడతారు. ఇంట్లో వండుకోవడం వల్ల మనం తీసుకునే ఉప్పు, కారం, నూనెపై మనకు నియంత్రణ ఉంటుంది.

Related News

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

పిల్లల్లో డిప్రెషన్ ముప్పును తగ్గించే చిన్ననాటి అనుభవాలు ఇవే.. పేరెంట్స్ ఇవి తప్పక తెలుసుకోవాలి!

సాయంత్రం పూట వేడి వేడిగా ఇలా చేసి పెట్టండి ఇంటిల్లిపాదీ ఇష్టంగా తింటారు!

హోటల్ స్టైల్ క్రిస్పీ ఇన్‌స్టంట్ రవ్వ దోశ.. 15 నిమిషాల్లో ఇలా తయారు చేసుకోండి!

Big Stories

Advertisement
×