E-Paper
Advertisement

గ్రీన్ టీ పవర్ పెరగాలా? పరిశోధనల ప్రకారం ఈ 3 సప్లిమెంట్లను మిక్స్ చేయండి!

గ్రీన్ టీ పవర్ పెరగాలా? పరిశోధనల ప్రకారం ఈ 3 సప్లిమెంట్లను మిక్స్ చేయండి!
Advertisement

Green Tea Supplements: ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా తాగే ఆరోగ్యకరమైన డ్రింక్ లో గ్రీన్‌టీ ఒకటి. ఇందులో ఉండే EGCG అనే సమ్మేళనం క్యాన్సర్ నివారణకు, బరువు తగ్గడానికి అంతే కాకుండా గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే.. తాజా శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం.. మనం తాగే గ్రీన్ టీలో కేవలం 20% యాంటీ ఆక్సిడెంట్లు మాత్రమే మన రక్తంలోకి చేరుతున్నాయి. మిగిలిన 80% వృథాగా పోతున్నాయి. ఈ శోషణ సామర్థ్యాన్ని పెంచడానికి , గ్రీన్ టీని ఒక ‘సూపర్ డ్రింక్’గా మార్చడానికి కొన్ని ప్రత్యేక సప్లిమెంట్లను చేర్చాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

గ్రీన్ టీతో కలిపి తీసుకోవాల్సిన 3 బెస్ట్ సప్లిమెంట్లు:

Advertisement

1. విటమిన్ సి లేదా సిట్రస్:
పరిశోధనల ప్రకారం గ్రీన్ టీతో.. కలిపి తీసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన సప్లిమెంట్ విటమిన్ సి.

ఎందుకు?: గ్రీన్ టీలోని కాటెచిన్స్ మన పొట్టలోని జీర్ణ రసాల వల్ల త్వరగా విచ్ఛిన్నం అయిపోతాయి. విటమిన్ సి వీటిని స్థిరీకరించి, శరీరం ఎక్కువ మొత్తంలో గ్రహించేలా చేస్తుంది.

Advertisement

ఎలా కలపాలి?: గ్రీన్ టీలో సగం నిమ్మకాయ జ్యూస్  పిండడం లేదా 500mg విటమిన్ సి ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల యాంటీ ఆక్సిడెంట్ల లభ్యత 5 రెట్లు పెరుగుతుందని ‘జర్నల్ ఆఫ్ మాలిక్యులర్ న్యూట్రిషన్’ అధ్యయనం వెల్లడించింది.

2. పైపెరిన్ -నల్ల మిరియాల సారం:
నల్ల మిరియాల్లో ఉండే పైపెరిన్ అనే మూలకం పోషకాల శోషణను పెంచడంలో దిట్ట.

ఎందుకు?: ‘రిసెర్చ్ గేట్’లో ప్రచురించిన  ఒక అధ్యయనం ప్రకారం, గ్రీన్ టీలోని EGCGతో పాటు పైపెరిన్ తీసుకున్నప్పుడు, రక్తంలో EGCG స్థాయిలు గణనీయంగా పెరిగాయి. పైపెరిన్ మన కాలేయంలోని కొన్ని ఎంజైమ్‌లను నియంత్రించి.. గ్రీన్ టీ పోషకాలు బయటకు పోకుండా ఆపుతుంది.

ఎలా వాడాలి?: మీరు గ్రీన్ టీ తయారు చేసేటప్పుడు చిటికెడు నల్ల మిరియాల పొడిని వేయండి. ఇది కేవలం రుచినే కాదు.. మీ మెటబాలిజంను కూడా వేగవంతం చేస్తుంది.

Also Read: శొంఠి నీటితో ఆరోగ్య ప్రయోజనాలు.. 5 సమస్యలకు ఇది దివ్యౌషధం!

3. క్వెర్సెటిన్ :
క్వెర్సెటిన్ అనేది ఉల్లిపాయలు, యాపిల్స్ , బెర్రీలలో లభించే ఒక శక్తివంతమైన ఫ్లేవనాయిడ్.

ఎందుకు?: క్వెర్సెటిన్ , గ్రీన్ టీ కలిసి పనిచేసినప్పుడు ‘సినర్జిస్టిక్ ఎఫెక్ట్’కనిపిస్తుంది. అంటే ఇవి విడివిడిగా ఇచ్చే ఫలితం కంటే.. కలిసి ఇచ్చినప్పుడు ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయి. ముఖ్యంగా క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకోవడంలో , ఇన్ఫ్లమేషన్ (వాపు) తగ్గించడంలో ఈ కాంబినేషన్ అద్భుతంగా పని చేస్తుందని ఎలుకలపై చేసిన ప్రయోగాల్లో తేలింది.

ఎలా  వాడాలి?: మీరు క్వెర్సెటిన్ సప్లిమెంట్ తీసుకుంటున్నట్లయితే.. దానిని గ్రీన్ టీ తాగే సమయంలోనే తీసుకోండి. లేదా గ్రీన్ టీ తాగినప్పుడు ఒక యాపిల్ తినడం వల్ల కూడా ఈ ప్రయోజనం పొందవచ్చు.

గ్రీన్ టీ తాగడం ఒక మంచి అలవాటే.. కానీ దాన్ని సరైన పద్ధతిలో తాగితేనే పూర్తి లాభం చేకూరుతుంది. కేవలం వేడి నీటిలో గ్రీన్ టీ బ్యాగ్ వేసి తాగేయకుండా.. పైన పేర్కొన్న నిమ్మరసం, చిటికెడు మిరియాల పొడి వంటివి చేర్చుకోవడం వల్ల మీ ఆరోగ్యం రెట్టింపు అవుతుంది. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు.. రోగనిరోధక శక్తి పెంచుకోవాలనుకునే వారు ఈ టిప్స్ పాటిస్తే ఫలితం త్వరగా కనిపిస్తుంది.

Related News

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

పెన్, డైరీ లాంటివి వద్దు.. టీచర్స్ డే రోజు రూ.500 లోపు బడ్జెట్‌లో స్పెషల్ గిఫ్ట్స్

చిన్న చిన్న విషయాలకే కోపం వస్తోందా? ప్రశాంతంగా ఉండడానికి రోజూ ఈ 5 టిప్స్ పాటించండి

మామిడి ఆకులు కేవలం ఇంట్లో తోరణాలు కట్టడానికి కాదు.. స్కిన్ కేర్ నుంచి ఎరువు తయారీ వరకు ఎన్ని ప్రయోజనాలు

అదృష్టాన్ని కాదు కష్టాన్ని నమ్ముకుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎన్ని కష్టాలొచ్చినా వెనకడుగు వేయరు

ఈ వీకెండ్‌ అలవాట్లు ఉన్నవారిలో క్యాన్సర్ ముప్పు.. అతిగా ఎంజాయ్ చేస్తే యమ డేంజర్

హెవీ ఇయర్‌రింగ్స్‌తో చెవి నొప్పి వస్తుందా? చెవి రంధ్రాలు సాగకుండా ఈ సింపుల్ ట్రిక్ పాటించండి

Big Stories

Advertisement
×