E-Paper
Advertisement

ఏసీ ఆయుష్షు పెంచే.. అద్భుతమైన చిట్కాలు.. లైఫ్‌లో ఇంకోటి కొనే అవసరమే రాదు!

ఏసీ ఆయుష్షు పెంచే.. అద్భుతమైన చిట్కాలు.. లైఫ్‌లో ఇంకోటి కొనే అవసరమే రాదు!
Advertisement

AC Maintenance Tips 2026: ప్రస్తుత రోజుల్లో ఏసీ అనేది అత్యవసర వస్తువుగా మారిపోయింది. ఒకప్పుడు ధనికుల ఇళ్లల్లో మాత్రమే కనిపించిన ఎయిర్ కండీషనర్లు.. ప్రస్తుతం సామాన్యుల ఇళ్లలోనూ కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుత రోజుల్లో తరుచూ ఏసీలు రిపేర్ రావడం అందరినీ ఇబ్బందులకు గురిచేస్తోంది. అయితే వాటి నుంచి బయటపడేందుకు కొన్ని తేలికైన చిట్కాలను ఈ కథనంలో అందించడం జరుగుతోంది. ఈ టిప్స్ పాటిస్తే ఏసీ ఆయుష్షు పెరగడంతో పాటు.. భవిష్యత్తులో కొత్తది కొనే అవసరమే రాదని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ చిట్కాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

రెగ్యులర్‌గా ఫిల్టర్ల క్లీనింగ్..

ఏసీలకు ఫిల్టర్లు అనేవి గుండెకాయ వంటిది. ఇవి సమర్థవంతంగా పనిచేస్తేనే గదంతా చల్లదనంతో నిండిపోతుంది. అయితే నిరంతరాయంగా పనిచేయడం వల్ల ఒక్కోసారి ఫిల్టర్లు దుమ్ము, దూళితో నిండిపోతుంటాయి. కాబట్టి వీటిని రెగ్యులర్ గా క్లీనింగ్ చేయాల్సి ఉంటుంది. ప్రతి 15 రోజులకు ఒకసారి ఫిల్టర్లను బయటకు తీసి నీటితో శుభ్రం చేయడం వల్ల ఏసీ లైఫ్ పెరుగుతుంది.

కండెన్సర్ కాయిల్స్ భద్రత

Advertisement

సాధారణంగా బయటి వైపు ఉండే అవుట్ డోర్ యునిట్ లో కండెన్సర్ కాయిల్స్ సైతం దుమ్ము, దూళి కారణంగా త్వరగా పాడయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి సంవత్సరానికి కనీసం రెండుసార్లు సర్వీసింగ్ చేయించి శుభ్రపరచడం ద్వారా ఏసీ పనితీరు దెబ్బతినకుండా సుదీర్ఘ కాలం కాపాడుకోవచ్చు.

సరైన టెంపరేచర్

కొందరు బయటి నుంచి రాగానే ఏసీ టెంపరేచర్ ను అమాంతం తగ్గించేస్తుంటారు. అధిక కూలింగ్ కోసం 16 – 18 డిగ్రీల మధ్య ఏసీని సెట్ చేస్తుంటారు. ఇలా చేయడం సరైనది కాదని నిపుణులు సూచిస్తున్నారు. ఏసీని ఎల్లప్పుడు 24-26 డిగ్రీల మధ్య ఉంచడం ఉత్తమమని స్పష్టం చేస్తున్నారు. అలా చేస్తే కంప్రెషర్ పై ఒత్తిడి తగ్గి.. ఎక్కువ కాలం పనిచేసేందుకు వీలు ఉంటుందని వివరిస్తున్నారు. ఈ టిప్ పాటించడం ద్వారా కరెంటు బిల్లును సైతం 20 శాతం మేర తగ్గించుకోవచ్చని సలహా ఇస్తున్నారు.

గదిని సీల్ చేయడం

Advertisement

కొందరు కిటికీలు, తలుపులు తెరిచి ఉండగానే ఏసీని ఆన్ చేస్తుంటారు. దీని వల్ల ఏసీపై అధిక ఒత్తిడి పడే ఛాన్స్ ఉంది. కాబట్టి ఏసీ ఆన్ చేసే ముందే గది తలుపులు, కిటికీలు మూసిఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. గదిని పూర్తిగా సీల్ చేసిన కండిషన్ లో ఉంచడం వల్ల గదిలోకి వేడిగాలి రాదు. కాబట్టి ఏసీ తక్కువ ఒత్తిడితోనే గదిని తేలిగ్గా చల్లబరుస్తుంది. తద్వారా మెషీన్ పని గంటలు చాలా వరకు తగ్గించుకోవచ్చు.

Also Read: కొత్త ఏసీ కావాలా? డైకిన్ వెరీ రీజనబుల్ ఏసీలు.. ధర తక్కువ కూలింగ్ ఎక్కువ!

ప్రొఫెషనల్ సర్వీసింగ్

వేసవి కాలంలోనే పెద్ద ఎత్తున ఏసీల అవసరం ఉంటుంది. కాబట్టి సమ్మర్ రావడానికి ముందే ప్రొఫెషనల్స్ తో ఇంట్లోని ఏసీని సర్వీసింగ్ చేయించడం బెటర్. గ్యాస్ లీకేజీలు, వైరింగ్ సమస్యలు ఉంటే వాటిని ప్రొఫెషనల్స్ వెంటనే సెట్ చేస్తారు. తద్వారా ఏసీలు సమ్మర్ లో ఎక్కువ ఒత్తిడి లేకుండా సమర్థవంతంగా పనిచేసేందుకు వీలు ఉంటుంది.

Also Read: Air Conditioner Tips: అమ్మబాబోయ్.. ఏసీ గదిలో బకెట్ వాటర్ పెడితే.. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×