E-Paper
Advertisement

Wall Sitting Benefits: డైలీ 2 నిమిషాలు వాల్ సిట్టింగ్ చేస్తే.. నమ్మలేనన్ని ప్రయోజనాలు

Wall Sitting Benefits: డైలీ 2 నిమిషాలు వాల్ సిట్టింగ్ చేస్తే.. నమ్మలేనన్ని ప్రయోజనాలు
Advertisement

Wall Sitting Benefits: గోడకు ఆనుకుని, కుర్చీలో కూర్చున్నట్లుగా మోకాళ్లను 90 డిగ్రీల కోణంలో వంచి చేసే ఐసోమెట్రిక్ వ్యాయామమే వాల్ సిట్. ఇందులో శరీరం కదలదు. కానీ కండరాలు ఒత్తిడికి లోనవుతాయి. దీని వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రతిరోజూ 2 నిమిషాల వాల్ సిట్టింగ్ వల్ల కలిగే 6 ప్రయోజనాలు:

Advertisement

1. రక్తపోటు నియంత్రణ:
ఇటీవల నిర్వహించిన పరిశోధనల ప్రకారం.. అధిక రక్తపోటును తగ్గించడంలో రన్నింగ్ లేదా సైక్లింగ్ కంటే వాల్ సిట్స్ వంటి ఐసోమెట్రిక్ వ్యాయామాలు ఎక్కువ ప్రభావ వంతంగా పనిచేస్తున్నాయని తేలింది. వాల్ సిట్ పొజిషన్‌లో ఉన్నప్పుడు కండరాలు సంకోచించి.. ఆ తర్వాత విశ్రాంతి తీసుకున్నప్పుడు రక్త ప్రసరణ వేగంగా జరుగుతుంది. ఇది రక్త నాళాల ఆరోగ్యాన్ని మెరుగు పరిచి, బీపీని సహజంగా తగ్గిస్తుంది.

2. కండరాల దృఢత్వం:
ఈ వ్యాయామం ప్రధానంగా మీ కాళ్లు, తుంటి , పొత్తికడుపు కండరాలపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా క్వాడ్రిసెప్స్, హామ్ స్ట్రింగ్స్, గ్లూట్స్ కండరాలు బలోపేతం అవుతాయి. ప్రతి రోజూ వాల్ సిట్టింగ్ చేయడం వల్ల కాళ్లు దృఢంగా మారి,వాకింగ్‌లో లేదా రన్నింగ్‌లో శక్తి పెరుగుతుంది.

Advertisement

3. వెన్నునొప్పి నివారణ, భంగిమ మెరుగుదల:
వాల్ సిటింగ్ చేసేటప్పుడు వెన్నుపూస నేరుగా గోడకు ఆనుకుని ఉంటుంది. ఇది మీ వెన్నెముకను సరైన స్థితిలో ఉంచడానికి శిక్షణ ఇస్తుంది. రోజంతా కంప్యూటర్ల ముందు కూర్చుని పని చేసేవారికి వచ్చే వెన్నునొప్పిని ఇది తగ్గిస్తుంది. మీ భుజాలు, నడుము సరైన ఆకృతిలోకి రావడానికి ఇది తోడ్పడుతుంది.

4. కోర్ స్ట్రెంత్ పెరుగుదల:
వాల్ సిట్ చేసేటప్పుడు కేవలం కాళ్లే కాదు, మీ పొత్తికడుపు కండరాలు కూడా నిమగ్నమై ఉంటాయి. స్థిరంగా ఉండటానికి మీ కోర్ కండరాలను బిగబట్టాల్సి ఉంటుంది. ఇది పొట్ట దగ్గరి కండరాలను గట్టిపరుస్తుంది. శరీర సమతుల్యతను పెంచుతుంది.

5. కీళ్ల ఆరోగ్యం, ఏకాగ్రత:
పరుగు వంటి వ్యాయామాల్లో కీళ్లపై ఒత్తిడి పడుతుంది. కానీ వాల్ సిట్స్‌లో కీళ్ల కదలిక ఉండదు కాబట్టి మోకాళ్ల నొప్పులు ఉన్నవారు కూడా దీనిని చేయవచ్చు. ఇది మోకాళ్ల చుట్టూ ఉన్న కండరాలను బలపరిచి కీళ్లకు రక్షణ ఇస్తుంది. అలాగే.. 2 నిమిషాల పాటు ఆ మంటను తట్టుకుని స్థిరంగా ఉండటం వల్ల మీ మానసిక ఏకాగ్రత, పట్టుదల పెరుగుతాయి.

6.కేలరీల దహనం:
వాల్ సిట్ అనేది ఒక శక్తివంతమైన వ్యాయామం. తక్కువ సమయంలోనే ఎక్కువ కండరాలను ఇది ఉత్తేజపరుస్తుంది. దీని వల్ల జీవ క్రియ వేగవంతమై, శరీరంలోని అదనపు కేలరీలు ఖర్చవుతాయి. శరీర ఆకృతిని మెరుగు పరుచు కోవాలనుకునే వారికి ఇది సులభమైన మార్గం.

Also Read: చలికాలంలో బెల్లం తింటే.. ఏం జరుగుతుందో తెలుసా ?

ఎలా చేయాలి ?
గోడకు ఆనుకుని నిలబడండి.

నెమ్మదిగా పాదాలను ముందుకు జరుపుతూ.. మోకాళ్లను వంచండి.

గాలిలో ఒక కుర్చీలో కూర్చున్నట్లుగా మీ తొడలు నేలకు సమాంతరంగా ఉండాలి.

చేతులను పక్కకు గానీ.. చాచి గానీ ఉంచండి.

ప్రారంభంలో 30 సెకన్ల నుంచి మొదలుపెట్టి.. క్రమంగా 2 నిమిషాలకు పెంచండి.

Related News

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

పిల్లలు రాత్రి ఏ సమయం కల్లా నిద్రపోవాలి? టైమ్‌కు నిద్రపోకపోతే మెదడుపై ప్రభావం

రక్తపోటు పెరగడానికి మౌత్ వాష్ కూడా ఒక కారణమేనా.. తాజా రీసెర్చ్ ఏం చెబుతోంది?

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

మీ బంధువులు, స్నేహితులను ఈ 4 ప్రశ్నలు ఎప్పుడూ అడగకూడదు.. రిలేషన్ దెబ్బతింటుంది

ఛార్జింగ్ అవసరం లేని.. ఈ మ్యాజికల్ వేరబుల్ డివైస్ విశేషాలివే!

Big Stories

Advertisement
×