E-Paper
Advertisement

Siddipet News: సిద్ధిపేటలో రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

Siddipet News: సిద్ధిపేటలో రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
Advertisement

Siddipet News: సిద్ధిపేట జిల్లా కేంద్రం శివారులోని ప్రసిద్ధ ఎల్లమ్మ గుడి సమీపంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది. వేగంగా వెళ్తున్న ఒక ఆర్టీసీ బస్సు, ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాద సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.

ప్రమాద తీవ్రతకు బస్సు ముందు భాగం కొంతమేర దెబ్బతిన్నప్పటికీ.. ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బస్సులో ఉన్న ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు.

Advertisement

ప్రమాదం జరిగిన సమయంలో రహదారిపై ట్రాఫిక్‌కు కొంత అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ALSO READ: Bihar Politics: పురుషుల అకౌంట్లలోకి రూ.10 వేలు.. లబోదిబో అంటున్న ప్రభుత్వం, తిరిగి ఇవ్వరట!

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×