E-Paper
Advertisement

ఫంక్షన్లకు బెస్ట్ రిటర్న్ గిఫ్ట్స్.. ఈ జర్మన్ సిల్వర్ ఐటమ్స్ ఇస్తే.. గెస్టులు ఫిదా అవ్వాల్సిందే!

ఫంక్షన్లకు బెస్ట్ రిటర్న్ గిఫ్ట్స్.. ఈ జర్మన్ సిల్వర్ ఐటమ్స్ ఇస్తే.. గెస్టులు ఫిదా అవ్వాల్సిందే!

German silver return gifts: మన ఇంట్లో పెళ్లి, గృహప్రవేశం, లేదా వరలక్ష్మి వ్రతం లాంటి ఏ చిన్న శుభకార్యం జరిగినా.. వచ్చిన అతిథులకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ చాలా స్పెషల్‌గా ఉండాలని కోరుకుంటాం. ఎందుకంటే మనం ఇచ్చే గిఫ్ట్ మన టేస్ట్‌ని చెప్తుంది. ఈ రోజుల్లో సాంప్రదాయ రొటీన్ గిఫ్ట్స్ కంటే.. రాయల్ లుక్ ఇచ్చే జర్మన్ సిల్వర్ ఐటమ్స్ తెగ ట్రెండ్ అవుతున్నాయి. చూడటానికి అచ్చం వెండిలా మెరిసిపోతూ, బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండే టాప్ 5 జర్మన్ సిల్వర్ రిటర్న్ గిఫ్ట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

1. జర్మన్ సిల్వర్ కుంకుమ భరిణెలు :
ఏ శుభకార్యానికైనా ముత్తైదువులకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్స్‌లో తాంబూలంతో పాటు కుంకుమ భరిణె పెట్టడం మన సాంప్రదాయం. జర్మన్ సిల్వర్‌తో చేసిన నెమలి డిజైన్, ఏనుగు డిజైన్ లేదా క్లాసిక్ రౌండ్ షేప్ భరిణెలు చాలా అందంగా ఉంటాయి. ఇవి చూడటానికి ఎంతో కాస్ట్‌లీగా కనిపిస్తాయి. వీటి ధరలు చాలా రీజనబుల్‌గా ఉంటాయి. మీ ఇంటికి వచ్చిన గెస్టులు పూజ గదిలో దీనిని పెట్టుకున్న ప్రతిసారీ మీ ఫంక్షన్‌ను గుర్తుచేసుకుంటారు.

2. డిజైనర్ దీపాలు,సమయలు:
పండుగల సీజన్ లేదా గృహప్రవేశం లాంటి వేడుకలకు జర్మన్ సిల్వర్ దీపాలు బెస్ట్ ఛాయిస్. చిన్న సైజ్ కామాక్షి దీపాలు, నెమలి ప్రమిదలు లేదా వత్తులు వేసుకునే చిన్న సమయలు గిఫ్ట్‌గా ఇవ్వడానికి చాలా క్లాస్‌గా ఉంటాయి. పండగల సమయంలో ఇళ్లను అలంకరించుకోవడానికి ఇవి చక్కగా ఉపయోగపడతాయి. వెండి దీపాల లాంటి లుక్ తక్కువ బడ్జెట్ లోనే రావడం దీని స్పెషాలిటీ.

3. జర్మన్ సిల్వర్ గ్లాసెస్,బౌల్స్:
మీరు కాస్త యూనిక్‌గా, యూస్‌ఫుల్‌గా ఉండే గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే.. జర్మన్ సిల్వర్ గ్లాస్ సెట్ లేదా చిన్న బౌల్స్ (గిన్నెలు) సెలెక్ట్ చేసుకోవచ్చు. వీటిపై వచ్చే మీనాకారి వర్క్ లేదా ఆంటిక్ చెక్కడాలు రాయల్ టచ్ ఇస్తాయి. పూజలో నైవేద్యం పెట్టడానికి లేదా గెస్టులు వచ్చినప్పుడు డ్రై ఫ్రూట్స్ సర్వ్ చేయడానికి ఈ బౌల్స్ చాలా బాగుంటాయి.

Also Read: మొటిమల సమస్యతో విసిగిపోయారా? అరటిపండు తొక్కతో 10 నిమిషాల్లో మ్యాజిక్ గ్లో!

4. హారతి పళ్లెము లేదా పూజ ప్లేట్స్:
చిన్న సైజ్ పూజ ప్లేట్స్ కూడా ఇప్పుడు మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఒక చిన్న జర్మన్ సిల్వర్ పళ్లెంలో హారతి కప్పు, అగరబత్తి స్టాండ్, చిన్న గిన్నె అటాచ్ అయ్యి ఉండే కాంబో సెట్స్ దొరుకుతున్నాయి. డైలీ పూజ చేసుకునే వారికి ఇది ఒక పర్ఫెక్ట్ అండ్ యూస్‌ఫుల్ గిఫ్ట్ ఆప్షన్.

5. జర్మన్ సిల్వర్ ఆవు-దూడ విగ్రహం:
మన సంస్కృతిలో కామధేనువు (ఆవు-దూడ) విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుంటే ఐశ్వర్యం, ప్రశాంతత వస్తాయని నమ్ముతారు. జర్మన్ సిల్వర్‌తో చేసిన చిన్న కామధేనువు విగ్రహాలు గృహప్రవేశాలు, బారసాల లేదా పెళ్లిళ్లకు ఇవ్వడానికి ఎంతో పవిత్రమైన గిఫ్ట్‌గా నిలుస్తాయి. షోపీస్‌గా లివింగ్ రూమ్‌లో పెట్టుకోవడానికి కూడా ఇది చాలా ట్రెండీగా ఉంటుంది.

ప్లాస్టిక్ లేదా రొటీన్ స్టీల్ గిఫ్ట్స్ కంటే ‘ఎత్నిక్ అండ్ అస్థెటిక్’ లుక్ ఉన్న హోమ్ యుటిలిటీ ఐటమ్స్ వైపు జనం మొగ్గుచూపుతున్నారు. ఈ జర్మన్ సిల్వర్ గిఫ్ట్స్ కేవలం రూ.50 నుంచి ప్రారంభమై రూ.500 లోపే అద్భుతమైన డిజైన్లలో హోల్‌సేల్ మార్కెట్లలో దొరుకుతున్నాయి.

పెళ్లి ఖర్చులు ఎలాగూ ఎక్కువగా ఉంటాయి. అలాంటప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ కోసం మరీ అంత బడ్జెట్ పెట్టలేం. కానీ ఇచ్చే గిఫ్ట్ తక్కువ రానివ్వకూడదు. ఈ విషయంలో జర్మన్ సిల్వర్ ఐటమ్స్ వన్-స్టాప్ సొల్యూషన్. అలాగే తీసుకునే వారికి గొప్ప సంతోషాన్ని ఇస్తాయి. కాబట్టి.. మీ ఇంట్లో జరగబోయే నెక్స్ట్ స్పెషల్ అకేషన్‌కి ఈ 5 ఆప్షన్స్‌లో ఒకదాన్ని లాక్ చేసేయండి.

Tags

Related News

సర్‌ప్రైజ్ అంటే ఇది కదా! అమ్మ లైఫ్‌ని ఈజీ చేసే 5 మోస్ట్ యూస్‌ఫుల్ గిఫ్ట్స్!

షుగర్ వ్యాధి ఉంటే పాలు తాగవచ్చా? డాక్టర్లు చెబుతున్న జాగ్రత్తలు ఇవే

వేసవిలో కూడా చర్మం ఉంటుంది కూల్ కూల్.. ఈ స్కిన్‌కేర్ జాగ్రత్తలే ఉపాయం

ఆడపిల్లలు ఉన్న ప్రతి ఇంట్లో ఉండాల్సిన మ్యాజికల్ ఫుడ్.. కొబ్బరి పువ్వుతో ఇన్ని లాభాలా?

సలాడ్లు, మొలకలు అందరికీ పడవా? మీ పొట్టను ఇబ్బంది పెట్టే ‘ఆరోగ్యకరమైన’ ఆహారాలు ఇవే!

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన వారు పెళ్లి తరువాత ఎప్పుడూ గొడవ పడుతూనే ఉంటారు

మీ మనసే మీకు అతిపెద్ద శత్రువు.. మీ తప్పుడు నిర్ణయాలకు కారణాలు అదే

Big Stories

×