E-Paper
Advertisement

అడ్వాన్స్‌డ్ ఏఐ ఫీచర్లు, 200MP కెమెరాతో వివో కొత్త ఫోల్డబుల్ ఫోన్.. లాంచ్ ఎప్పుడంటే!

అడ్వాన్స్‌డ్ ఏఐ ఫీచర్లు, 200MP కెమెరాతో వివో కొత్త ఫోల్డబుల్ ఫోన్.. లాంచ్ ఎప్పుడంటే!
Advertisement

Vivo X Fold 6: చైనాకు చెందిన ప్రముఖ టెక్ సంస్థ వివో నుంచి త్వరలోనే Vivo X Fold 6 లాంచ్‌ కానుంది. ఖచ్చితమైన తేదీని కంపెనీ ఇంకా ప్రకటించనప్పటికీ.. ఈ నెలాఖరులోనే ఇది చైనా మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మునుపటి మోడల్స్‌తో పోలిస్తే ఇందులో భారీ మార్పులు ఉండబోతున్నట్లు సంస్థ టీజర్ ద్వారా స్పష్టంచేసింది.

సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్:

వివో తమ సరికొత్త OriginOS 6 ఫోల్డ్ స్కిన్‌తో ఈ ఫోన్‌ను తీసుకొస్తోంది. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారంగా పనిచేసే అవకాశం ఉంది. గతంలో వచ్చిన వివో X ఫోల్డ్ 5 మోడల్ ఆండ్రాయిడ్ 15 (OriginOS 5)తో రాగా.. కొత్త ఫోన్‌లో యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను మరింత మెరుగుపరచనున్నారు. ముఖ్యంగా దీనిలోని ‘అటామిక్ వర్క్‌బెంచ్’ ఫీచర్ ద్వారా స్క్రీన్‌పై ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ యాప్స్‌ను చాలా సులభంగా వాడుకోవచ్చు.

అడ్వాన్స్‌డ్ ఏఐ ఫీచర్లు:

Advertisement

ఈ సరికొత్త ఫోల్డబుల్ డివైజ్ ద్వారా బెస్ట్ ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) అనుభవాన్ని అందించడమే తమ లక్ష్యమని వివో ప్రొడక్ట్ మేనేజర్ హాన్ బోక్సియావో తెలిపారు. ఇందులో అప్‌గ్రేడెడ్ ఏఐ అసిస్టెంట్, డ్యూయల్ డివైజ్ బడ్డీ సిస్టమ్‌తో పాటు ఎడ్జ్ ఏఐ సామర్థ్యాలను జోడించారు. ఇవి యూజర్లకు సరికొత్త స్మార్ట్‌ఫోన్ ఇంటరాక్షన్ అనుభూతిని ఇస్తాయి.

Also Read: సరికొత్త ‘మింట్’ కలర్‌లో Samsung Galaxy A27.. లాంచ్‌కు ముందే లీకైన వివరాలు!

పవర్‌ఫుల్ బ్యాటరీ, ప్రాసెసర్:

Advertisement

తాజాగా లీకైన వివరాల ప్రకారం చూస్తే.. ఈ ఫోన్ భారీ బ్యాటరీ బ్యాకప్‌తో రానుంది. వివో X ఫోల్డ్ 5లో ఉన్న 6000mAh బ్యాటరీ స్థానంలో, కొత్త వివో X ఫోల్డ్ 6లో ఏకంగా 6900mAh బ్యాటరీని అమర్చినట్లు తెలుస్తోంది. దీనికి తోడు ఫోన్ పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉండేందుకు ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 9500 ప్రాసెసర్‌ను ఉపయోగించబోతున్నట్లు సమాచారం.

200 మెగాపిక్సల్ కెమెరా:

ఇక ఫొటోగ్రఫీ ఇష్టపడే వారి కోసం వివో ఈసారి కెమెరా విభాగంలో పెద్ద అప్‌గ్రేడ్ చేసింది. ఈ ఫోన్ వెనుక భాగంలో 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు, మరో 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌ను అందించే అవకాశం ఉంది. దీనివల్ల ఫోల్డబుల్ ఫోన్లలోనే ఇది అత్యుత్తమ కెమెరా ఫోన్‌గా నిలిచేలా కనిపిస్తోంది.

Also Read: పూర్తిగా డిజైన్ మార్చేసిన శాంసంగ్.. కొత్త Galaxy S26 FE లుక్ చూస్తే ఐఫోన్‌ను మర్చిపోతారు!

Related News

ఇంటి పైకప్పుపై వాటర్ బాటిల్ ట్రిక్.. 30 దేశాల్లో సూపర్ సక్సెస్.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే?

యాపిల్ నుంచి మొదటి ఫోల్డబుల్ ఫోన్ iPhone Duo.. ధర రూ.3 లక్షలా? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే!

లాగ్ ప్రాబ్లం ఉండదు.. సూపర్‌ఫాస్ట్ రెస్పాన్స్ ఇచ్చే బెస్ట్ వైర్‌లెస్ కీబోర్డ్ కాంబోస్ ఇవే!

ఫోన్ మార్చాలనుకుంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో భారీగా ధర తగ్గిన Vivo V40e 5Gపై ఓ లుక్కేయండి!

బడ్జెట్ ధరలో సోనీ కొత్త హెడ్‌ఫోన్స్ లాంచ్.. బ్లూటూత్ 6.0, ఏఐ కాల్స్ ప్రత్యేకత!

నుదుటిపై ఈ డివైజ్‌ను పెట్టుకుంటే చాలు.. బ్రెయిన్ సీక్రెట్స్ అన్నీ బయటపడతాయట?!

ఏటీఎం కీప్యాడ్ ప్లాస్టిక్‌తో కాకుండా.. మెటల్‌‌ తోనే ఎందుకు? దీని వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటి?

రూ. 349 vs రూ. 379.. Airtel చౌకైన ప్లాన్ల మధ్య పోటీ.. బెనిఫిట్స్ పరంగా విజేత ఎవరంటే?

Big Stories

Advertisement
×