E-Paper
Advertisement

Ghee For Heart Health: గుండె ఆరోగ్యానికి నెయ్యి మంచిదా? కాదా? అసలు నిజం వెంటే షాక్ అవుతారు !

Ghee For Heart Health: గుండె ఆరోగ్యానికి నెయ్యి మంచిదా? కాదా? అసలు నిజం వెంటే షాక్ అవుతారు !

Ghee For Heart Health: నెయ్యిని ఆహార పదార్థాల తయారీలో వాడని వారుండరంటే అతిషయోక్తి కాదు. ఇది కేవలం రుచిని పెంచడమే కాక.. మన సంస్కృతిలో, ఆయుర్వేదంలో దీనికి గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అయితే.. ఇటీవల కాలంలో నెయ్యిలో కొవ్వు ఎక్కువగా ఉండటం వల్ల ఇది గుండె ఆరోగ్యానికి.. మంచిదా? కాదా? అనే సందేహం చాలా మందిలో ఉంది.

అసలు నిజం ఏమిటి ?

నెయ్యిని కేవలం ‘మంచిది’ లేదా ‘చెడ్డది’ అని తేల్చి చెప్పలేము. నెయ్యి యొక్క ప్రభావం మీరు ఎంత మొత్తంలో తీసుకుంటున్నారు. దాని నాణ్యత , మీ మొత్తం ఆహారపు అలవాట్లపై ఆధారపడి ఉంటుంది.

నెయ్యిలోని ప్రయోజనాలు:

నెయ్యిని మితంగా తీసుకున్నప్పుడు గుండెకు మేలు చేసే అంశాలు ఉన్నాయి.

ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు: నెయ్యిలో ఆరోగ్యకరమైన ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, కాంజుగేటెడ్ లినోలెయిక్ యాసిడ్ వంటివి స్వల్పంగా ఉంటాయి. ఈ కొవ్వు ఆమ్లాలు గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి. ఇది ముఖ్యంగా.. ధమనుల్లోని అడ్డంకులను తగ్గించడంలో సహాయపడుతుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

విటమిన్లు : నెయ్యిలో కొవ్వులో కరిగే విటమిన్లు అయిన A, D, E, K అధికంగా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ K2 ధమనులలో కాల్షియం పేరుకుపోకుండా నిరోధించడం ద్వారా గుండె, రక్తనాళాల ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయ పడుతుంది.

అధిక స్మోక్ పాయింట్ : నెయ్యికి ‘స్మోక్ పాయింట్’ చాలా ఎక్కువ. అంటే.. దీనిని వేడి చేసినప్పుడు అది హానికరమైన ఫ్రీ రాడికల్స్ లేదా ఆక్సిడైజ్డ్ కొలెస్ట్రాల్‌గా త్వరగా మారదు. ఇది వంటకు సురక్షితమైన కొవ్వుగా చెబుతారు.

మంచి కొలెస్ట్రాల్ పెరుగుదల : కొన్ని పరిశోధనల ప్రకారం.. నెయ్యిని మితంగా తీసుకున్నప్పుడు ఇది మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడానికి సహాయపడుతుంది. ఇది గుండెకు రక్షణ కల్పిస్తుంది.

జాగ్రత్తలు, హెచ్చరికలు:

నెయ్యిని అధికంగా తీసుకుంటే.. గుండెకు ఇబ్బంది కలిగించే అంశాలు ఇవి

శాచురేటెడ్ ఫ్యాట్ : నెయ్యిలో దాదాపు 60% వరకు శాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వంటి ఆరోగ్య సంస్థలు శాచురేటెడ్ ఫ్యాట్ ను రోజువారీ కేలరీలలో 5-6% కంటే తక్కువగా పరిమితం చేయాలని సిఫార్సు చేస్తున్నాయి. అధికంగా తీసుకునే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచి, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచవచ్చు.

ఎవరికి జాగ్రత్త అవసరం: ఇప్పటికే అధిక కొలెస్ట్రాల్ లేదా గుండె జబ్బుల చరిత్ర ఉన్నవారు నెయ్యి వినియోగాన్ని పరిమితం చేయాలి. అధికంగా.. నెయ్యి తీసుకునేవారు దానితో పాటు శారీరక శ్రమ తక్కువగా ఉంటే కొవ్వు పేరుకుపోయే ప్రమాదం ఉంటుంది.

Also Read: ఈ ఆయిల్‌తో మ్యాజిక్ ఒక్క సారి వాడితే.. జుట్టు వద్దన్నా పెరుగుతుంది తెలుసా ? 

ఎంత పరిమాణంలో తీసుకోవాలి ?

నిపుణులు, ఆయుర్వేదం ప్రకారం.. ఆరోగ్యవంతమైన వ్యక్తి రోజుకు 1-2 టీస్పూన్ల (5-10 గ్రాములు) స్వచ్ఛమైన ఆవు నెయ్యిని తీసుకోవడం సురక్షితం, ప్రయోజనకరం. ఇది మీ మొత్తం ఆహారంలో భాగంగా ఉండాలి. అదనంగా కాదు.

నెయ్యి అనేది సంప్రదాయకంగా ఆరోగ్యకరమైన కొవ్వుగా చెబుతారు. ప్రత్యేకించి ఇతర అనారోగ్యకరమైన వనస్పతి లేదా రిఫైన్డ్ ఆయిల్స్‌కు బదులుగా ఉపయోగించినప్పుడు. నెయ్యి గుండెకు విషం కాదు. కానీ అది ఎక్కువగా తీసుకుంటే మంచిది కాదు. నాణ్యమైన నెయ్యిని మితంగా.. సమతుల్య ఆహారంలో భాగంగా తీసుకుంటే గుండె ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది.

Related News

గుడ్డు తింటే జరిగే మ్యాజిక్ ఇదే.. కానీ ఆ ఒక్క తప్పు అస్సలు చేయొద్దు!

నెల రోజులు చాయ్‌కి ‘టాటా’ చెబితే.. మీ బాడీలో జరిగే వింతలు ఇవే!

ఐటీ ఉద్యోగుల కోసం.. అదిరిపోయే ఆఫీస్ డెస్క్ వర్కవుట్స్

నరాల బలహీనతకు బై-బై! నరాలను ఇనుములా మార్చే 5 సూపర్ ఫుడ్స్..

మీ మూడ్ బాలేదా? అయితే ఈ ఫుడ్స్ తినండి

నాన్-స్టిక్ పాన్లకు గుడ్‌బై చెప్పి.. ఈ 3 రకాల పాత్రలను వాడండి!

ఏసీ గదిలో ఉంటే చర్మం పొడిబారుతోందా? ఈ చిన్న చిట్కాతో మీ చర్మాన్ని కాపాడుకోండి

బతికినంత కాలం రోగాల్లేకుండా ఉండాలా?.. ఈ అలవాట్లను మార్చుకోండి!

Big Stories

×