E-Paper
Advertisement

Blood Pressure: బీపీ తగ్గాలంటే.. ఈ చిట్కాలు పాటించాల్సిందే

Blood Pressure: బీపీ తగ్గాలంటే.. ఈ చిట్కాలు పాటించాల్సిందే
Advertisement

Blood Pressure: నేటి కాలంలో ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, మారుతున్న జీవనశైలి కారణంగా హైబీపీ సర్వసాధారణమైపోయింది. రక్తపోటును నియంత్రణలో ఉంచుకోకపోతే అది గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. మందులతో పాటు కొన్ని సహజ సిద్ధమైన పద్ధతుల ద్వారా ఇంట్లోనే రక్తపోటును ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

1. శవాసనం, ప్రాణాయామం:

యోగాసనాల్లో అత్యంత విశ్రాంతినిచ్చేది శవాసనం. వెల్లకిలా పడుకుని.. శరీరాన్ని పూర్తిగా వదిలేయడం ద్వారా నాడీ వ్యవస్థ శాంతిస్తుంది. ఇది రక్త నాళాల మీద ఒత్తిడిని తగ్గించి.. రక్త ప్రసరణను క్రమబద్ధీకరిస్తుంది. దీంతో పాటు ‘భ్రమరి‘ లేదా ‘అనులోమ విలోమ’ ప్రాణాయామం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇది నేరుగా రక్తపోటును తగ్గించడంలో సహాయ పడుతుంది.

Advertisement

2. ఉపవాసం :

అడపాదడపా ఉపవాసం చేయడం వల్ల శరీరంలోని విషతుల్యాలు బయటకు పోతాయి. ఉపవాసం ఉన్నప్పుడు ఇన్సులిన్ స్థాయిలు తగ్గి, రక్తనాళాలు వ్యాకోచిస్తాయి. ఇది రక్తపోటును సహజంగా తగ్గిస్తుంది. అయితే.. ఉపవాసం ఉన్న సమయంలో అధికంగా నీరు తీసుకోవడం, జ్యూస్ లు తాగడం ముఖ్యం. దీనివల్ల శరీరానికి శక్తి అందడమే కాకుండా రక్తం పలుచగా ఉంటుంది.

3. సోడియం తగ్గించి, పొటాషియం పెంచడం:

రక్తపోటు పెరగడానికి ప్రధాన కారణం ఉప్పు (సోడియం). రోజువారీ ఆహారంలో ఉప్పును తగ్గించడం వల్ల కిడ్నీలపై ఒత్తిడి తగ్గుతుంది. అదే సమయంలో పొటాషియం ఎక్కువగా ఉండే అరటిపండ్లు, ఆకుకూరలు, చిలగడదుంపలు, కొబ్బరి నీళ్లు తీసుకోవాలి. పొటాషియం శరీరంలోని అదనపు సోడియంను బయటకు పంపి, రక్తనాళాల గోడలను సడలిస్తుంది.4. వెల్లుల్లి, మందార టీ:

వెల్లుల్లిలో ఉండే ‘అల్లిసిన్‘ అనే సమ్మేళనం రక్తనాళాలను వెడల్పు చేయడంలో సహాయ పడుతుంది. దీని వల్ల రక్తం సులభంగా ప్రవహిస్తుంది. ప్రతి రోజూ ఉదయం పరగడుపున ఒక రెబ్బ వెల్లుల్లి తినడం అలవాటు చేసుకోవాలి. అలాగే.. చక్కెర లేని మందార టీ తాగడం వల్ల కూడా రక్తపోటు గణనీయంగా తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఇది మూత్రవిసర్జనను పెంచి రక్తంలోని అదనపు ద్రవాలను బయటకు పంపుతుంది.

Also Read: ఉదయం పూట ఇవి తింటే.. రోజంతా ఫుల్ ఎనర్జీ

5. క్రమం తప్పకుండా వాకింగ్:

రోజుకు కనీసం 30 నిమిషాల పాటు వేగంగా నడవడం గుండె సామర్థ్యాన్ని పెంచుతుంది. గుండె బలంగా ఉంటే.. అది తక్కువ శ్రమతో ఎక్కువ రక్తాన్ని పంప్ చేయగలదు. దీని వల్ల ధమనులపై ఒత్తిడి తగ్గుతుంది. వ్యాయామం వల్ల శరీరంలోఎండార్ఫిన్లువిడుదలవుతాయి. ఇవి ఒత్తిడిని తగ్గించి రక్తపోటును అదుపులో ఉంచుతాయి.

పైన పేర్కొన్న పద్ధతులు ప్రాథమిక దశలో ఉన్న రక్తపోటును నియంత్రించడానికి చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. అయితే.. ఇప్పటికే మందులు వాడుతున్న వారు లేదా తీవ్రమైన రక్తపోటు ఉన్నవారు డాక్టర్ సలహా తీసుకోవడం తప్పనిసరి.

Related News

ఒక్క పన్ను పీకడానికి రూ.2.25 లక్షలా.. అదే ఇండియాలో అయితే?

డెస్క్ జాబ్ చేస్తున్నారా? ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వచ్చే సమస్యలు ఇవే

తగ్గేదెలే.. ఈ తేదీల్లో పుట్టినవారు ఆత్మగౌరవం విషయంలో అసలు రాజీపడరు

స్కూల్‌కు వెళ్లే సమయం అయినా పిల్లలు నిద్రలేవడం లేదా? ఈ 5 టిప్స్‌తో మార్నింగ్ రొటీన్ మార్చండి

గుండెపోటు ముప్పును 30 శాతం తగ్గించగల పిల్.. తాజా అధ్యయనంలో అద్భుత ఫలితాలు

వర్షాకాలంలో తరచూ అనారోగ్యానికి గురవుతున్నారా? రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి ఈ పుడ్స్

రక్తంలో చక్కెర పెరగకుండా ఉండాలంటే ఆపిల్ తినాలా? పియర్ తినాలా?

ఉదయం ఫ్రెష్‌గా లేవాలంటే రాత్రి ఎప్పుడు పడుకోవాలి? నిపుణులు ఏం చెబుతున్నారు?

Big Stories

Advertisement
×