E-Paper
Advertisement

Telangana Panchayat Elections 3rd Phase: తెలంగాణలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు.. అక్కడ అందరూ కలిసిపోయారు

Telangana Panchayat Elections 3rd Phase: తెలంగాణలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు.. అక్కడ అందరూ కలిసిపోయారు
Advertisement

Telangana Panchayat Elections 3rd Phase: గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీల గుర్తుకు అతీతంగా జరుగుతున్నాయి. కొన్ని సందర్భాల్లో కీలక పార్టీల నేతలు, కార్యకర్తలు ఒకేతాటి మీదకు బలమైన ఓ అభ్యర్థి కోసం ప్రచారం చేసిన.. చేస్తున్న సందర్భాలు చాలానే ఉంటాయి. అలాంటి వెరైటీ ప్రచారం నాగర్ కర్నూలు జిల్లా రామోజీపల్లి గ్రామంలో కనిపించింది.

తెలంగాణలో పంచాయతీ మూడో విడత ప్రచారం

Advertisement

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్నాయి. ఇప్పటికే రెండు విడతలు ఎన్నికల జరిగాయి. రెండొంతులు కాంగ్రెస్ మద్దతుదారులు గెలుపొందగా, ఓ వంతు బీఆర్ఎస్ మద్దతుదారులు గెలిపొందారు. మరో వంతు బీజేపీ-ఇతరులు గెలుపొందారు. దీంతో మూడో విడత పంచాయతీ ఎన్నికలపై అందరి దృష్టి పడింది. తాము ఎక్కువగా గెలుచుకుంటామని ప్రధాన పార్టీలు ధీమాగా చెబుతున్నాయి.

పంచాయతీ ఎన్నికల అంటేనే గ్రామాల్లో హోరాహోరీగా ఉంటుంది. అధికార-ప్రతిపక్ష పార్టీల మధ్య ప్రచారం జోరు, ఆపై డబ్బుల పంపిణీ గురించి ఏమాత్రం చెప్పక్కర్లేదు. కానీ ఆ గ్రామంలో కాంగ్రెస్-బీఆర్ఎస్ పార్టీలు రెండు కలిసిపోయాయి. ఆపై ఒకే అభ్యర్థిని ఫైనల్ చేసి రెండు పార్టీలు కలిసి ప్రచారంలో దిగాయి.

Advertisement

ఇరుపార్టీల కార్యకర్తలు ఒకే అభ్యర్థికి ప్రచారం

నాగర్ కర్నూల్ జిల్లా బల్మూరు మండలం రామోజీపల్లి గ్రామం సర్పంచ్ అభ్యర్థి అవకాశం ఎస్టీ రిజర్వుడుకు కేటాయించారు. సర్పంచ్ అభ్యర్థిగా వంశీని కాంగ్రెస్- బీఆర్ఎస్ పార్టీలు రెండు కలిపి గ్రామ సర్పంచిగా పోటీలోకి దింపాయి. దీంతో ఆ గ్రామంలో ప్రచార పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. కాంగ్రెస్-బీఆర్ఎస్ పార్టీలు రెండు కలిపి గ్రామంలో పెద్ద ఎత్తున వంశీని గెలిపించాలంటూ ప్రచారం చేపట్టారు.

కాంగ్రెస్-టీఆర్ఎస్ నాయకులు ప్రచారంలో పాల్గొనడం చూసి గ్రామస్తులంతా ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే ఆ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారు వాలువాయి బాలమ్మను సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలబెట్టారు. గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తలు-బీఆర్ఎస్ కలిసి నిలబెట్టిన అభ్యర్థికి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.

ALSO READ: మిమ్మల్ని దారుణంగా చూశారు.. ఆ రోజు అదే ఏం జరిగిందన్న కవిత

పంచాయతీ ఎన్నికలు కేవలం గ్రామాల అభివృద్ధి కేంద్రంగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఒక్కోసారి చివరి నిమిషంలో డ్రాపైన వాళ్లు ఉంటారు. ప్రధాన పార్టీల మద్దతుతో గెలిచినవాళ్లు ఉంటారు.  మొత్తానికి పార్టీల మద్దతు ఏమోగానీ, అక్కడ అధికార కాంగ్రెస్-బీఆర్ఎస్ కార్యకర్తలు కలిసి ఒకే అభ్యర్థిని రంగంలోకి దింపడం ఆసక్తికరంగా మారింది.

Related News

తెలంగాణ మహిళపై జమ్మూకశ్మీర్‌లో కేసు నమోదు..!

ఎంవీఎస్ఆర్ కాలేజీ దాండియా ప్రమాదంపై.. ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక ప్రకటన!

ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే సదస్సులకు.. సర్కార్ కొత్త నిబంధనలు!

సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై.. నిజామాబాద్ పోలీసులు యాక్షన్..!

కేసీఆర్‌ కుటుంబ ఆస్తులు స్వాధీనం చేసుకోవాలి! – మాజీ మంత్రి రవీంద్ర నాయక్

సాలార్ జంగ్ మ్యూజియంకు సరికొత్త రూపు.. ఓయూ విద్యార్థులకు కీలక పిలుపు!

దేశంలో అలజడులు సృష్టించే కుట్రలు సాగనివ్వం: రాంచందర్ రావు

కేజీబీవీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. త్వరలో మళ్లీ ఆర్డర్లు?

Big Stories

Advertisement
×