E-Paper
Advertisement

Radish leaves: అరెరే.. ఇన్ని ప్రయోజనాలున్న ముల్లంగి ఆకులను ఎందుకు పడేస్తున్నాం?

Radish leaves: అరెరే.. ఇన్ని ప్రయోజనాలున్న ముల్లంగి ఆకులను ఎందుకు పడేస్తున్నాం?
Advertisement

Radish leaves: చలికాలం మొదలైందంటే చాలు అనేక రకాల ఇన్‌ఫెక్షన్లు మనల్ని చుట్టుముడుంతుంటాయి. చలి తీవ్రత పెరిగే కొద్ది జులబు, గొంతు నొప్పి, జ్వరం, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం ఇలా.. ప్రతిరోజూ ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతుంటాం. అయితే ఈ సీజన్‌లో మన డైట్‌లో తప్పక ఉండాల్సిన కూరగాయాల్లో ముల్లంగి ఒకటి. దీనిని చాలామంది తినడానికి ఇష్టపడరు. కానీ ముల్లంగి ఆకుల వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే.. వద్దన్నా తినేస్తారు. అవునండీ బాబూ.. ముల్లంగి ఆకులను తరచూ మన ఆహారంలో భాగం చేసుకుంటే, చలికాలంలో శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ముల్లంగి ఆకులతో కలిగే అద్భుత ప్రయోజనాలేమిటో తెలుసుకుందాం రండి.

ముల్లింగి ఆకులు తినడానికి 5 ప్రధాన కారణాలు:

⇒ ముల్లంగి ఆకుల్లో విటమిన్ సి ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గానే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

Advertisement

⇒ ఈ ఆకుల్లో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. శరీరంలోని వివిధ భాగాలకు ఆక్సిజన్‌ను తీసుకువెళ్లే హిమోగ్లోబిన్ తయారీకి ఐరన్ సహాయపడుతుంది.

⇒ ముల్లంగి ఆకుల్లోని కాల్షియం ఎముకలు, దంతాలను బలపరుస్తుంది. కాబట్టి.. వీటిని పిల్లల నుంచి పెద్దల వరకూ ప్రతి ఒక్కరూ తినవచ్చు.

Advertisement

⇒ దీనిలోని ఫోలేట్.. గర్భిణీ స్త్రీలను మరింత బలంగా ఉంచుతుంది. ఈ ఫోలేట్ కంటెంట్ కడుపులో పిండం అభివృద్ధికి సహాయపడుతుంది.

⇒ విటమిన్ కె పుష్కలంగా లభించే ముల్లింగి ఆకుల తరచూ తీసుకుంటే.. రక్తం గడ్డకట్టకుండా ఉండటంలో సహాయపడుతుంది.

ఇతర ప్రయోజనాలు:

* జీర్ణక్రియను మెరుగుపరచడంలో ముల్లంగి ఆకులు కీలకంగా పనిచేస్తుంది. ముల్లంగి ఆకుల్లోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరిచి, మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది.

* అలాగే రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ ఈ ఆకులు మేలు చేస్తాయి. దీనిలో విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వల్ల జలుబు, దగ్గు వంటి వ్యాధుల నుండి రక్షణ పొందవచ్చు.

* ముల్లంగి ఆకులు యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది ఆర్థరైటిస్ రోగులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

* గుండెకు మేలు చేయడంలో ముల్లంగి ఆకులు మొదటి స్థానంలో ఉంటుంది. అంతేకాదు.. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలోనూ సహాయపడతాయి .

* బరువు నియంత్రణకు ముల్లంగి ఆకుల రసం మంచి ఎంపిక. దీనిలో కేలరీలు తక్కువ, ఫైబర్ అధికంగా ఉంటుంది. దీంతో కడుపుని నిండుగా ఉంచుతుంది.

* అలాగే ముల్లంగి ఆకులు చర్మానికి మేలు చేస్తుంది. దీనిలో ఉన్న విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

 

 

 

Related News

LED ఫేస్ మాస్క్ ముఖంపై ముడతలు తగ్గిస్తుందని ప్రచారం.. నిజంగా పనిచేస్తుందా?

సండే స్పెషల్.. ఎప్పుడూ ఒకేలా కాకుండా మటన్‌ను ఇలా గ్రీన్‌గా వండి చూడండి.. వేళ్లు నాకేస్తారు!

అరకు ఫేమస్ బొంగు చికెన్.. తింటే జీవితంలో ఆ రుచిని మర్చిపోరు, ఎలా చేయాలో తెలుసా?

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

Big Stories

Advertisement
×