E-Paper
Advertisement

Vemulawada Bhimeswara Temple: గెస్ట్ హౌస్‌లో మేకపోతు బలి.. భీమేశ్వర ఆలయంలో అపచారం

Vemulawada Bhimeswara Temple: గెస్ట్ హౌస్‌లో మేకపోతు బలి.. భీమేశ్వర ఆలయంలో అపచారం
Advertisement

Vemulawada Bhimeswara Temple: వేములవాడ భీమేశ్వర సదన్ వసతి సముదాయంలో జంతు బలి, డొంక కదిలింది. ఫారెస్ట్ అధికారులు రిఫర్ చేయడంతో వసతి గది ఇచ్చామని ఆలయ అధికారులు, పోలీసులకు పిర్యాదు చేశారు. ఈ ఇష్యూతో దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ కూడ సిరియస్ అయ్యింది.

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయ భీమేశ్వర అతిథి గృహంలో.. ఆదివారం అపచారం చోటుచేసుకుంది. భీమేశ్వర ఆలయాన్ని ఆనుకొని ఉన్న రెండవ నెంబర్ భీమేశ్వర గెస్ట్ హౌస్‌ను, వేములవాడ అటవీ శాఖ అధికారి రెఫర్ ద్వారా అద్దెకు తీసుకున్నారు. అద్దెకు పొందిన వ్యక్తులు అతిథి గృహంలో, పోచమ్మ అమ్మవారిని దర్శించుకుని అనంతరం మేకను బలిచ్చారు. అయితే భీమేశ్వర ఆలయంలో స్వామివారిని దర్శించుకుని వస్తున్న వేరే ప్రాంత భక్తులు, పీఆర్వో కార్యాలయం పక్కనే అతిధి గృహం ఉండగా జంతు బలి చూసి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే మేకను బలి చేస్తున్న ఫోటోలు సామజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.

Advertisement

మరోవైపు భక్తులకు ప్రీతిపాత్రమైన స్వామి వారి ప్రసాదాల తయారీ విభాగం కూడా ఉండగా.. జంతుబలి జరగడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు భక్తులు,హిందూసంఘాల నేతలు. వేములవాడ రాజన్న ఆలయ పరిసరాలతో పాటు వసతి గదుల్లో కూడా జంతు బలి చేయరాదని దేవాదాయ శాఖ చట్టంలో నిబంధనలో ఉంది. భక్తుల నుండి అభ్యంతరాలు రావడంతో వెంటనే విభాగం ఇన్స్పెక్టర్ సింహాచారి అతిథి గృహం వద్దకు చేరుకొని వారిని గట్టిగా వారించారు. వెనువెంటనే అతిథి గృహాన్ని కూడా కాళీ చేయించారు. అయితే ఈ కథ ఆదివారంకు ముగిసింది.

సోమవారం ఉదయం ఆలయ అధికారులు వేములవాడ పట్టణ పోలీసులకు పిర్యాదు చేశారు. ఫారెస్ట్ అధికారులు చెప్పినందుకే వసతి గది ఇచ్చమని పోలీసులకు చెప్పినట్లు సమాచారం. చందుర్తి మండలంలో గంతంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పనిచేసిన, వేములవాడ ఫారెస్ట్ కార్యాలయంలో పనిచేసే మరో అధికారికి, భీమేశ్వర ఆలయం వద్ద వసతి గది ఏర్పాటు చేయాలనీ చెప్పడంతో, వేములవాడ ఫారెస్ట్ అధికారులు, ఆలయ అధికారులకు కాల్ చేసి వసతి గది బుకింగ్ చేసారట.

Advertisement

Also Read: అతి తెలివి ఎక్కువ.. పని తక్కువ.. బీఆర్ఎస్ పాలనపై ఉత్తమ్ కుమార్ ఆగ్రహం

సామాన్య భక్తులకు, భక్తుల రద్దీ నెలకొన్న సందర్బములో వసతి గదులే దొరకని దుస్థితి.. అలాంటివి ఫారెస్ట్ అధికారులు, అధికారికంగా కాకుండా, అనదికారంగా రూమ్ బుక్ చేసి.. ఏకంగా అందులోనే మేకను బలి ఇచ్చేసారు. అయితే ఈ విషయం పై దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ సీరియస్ గా స్పందించారు. మేకను బలిచ్చిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించినట్లు సమాచారం.

Related News

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

Big Stories

Advertisement
×