E-Paper
Advertisement

ఫ్రిజ్ డోర్ సెల్ఫ్స్‌లో ఏం స్టోర్ చేయాలో తెలుసా ? 99 % మందికి చేసే పొరపాట్లు ఇవే

ఫ్రిజ్ డోర్ సెల్ఫ్స్‌లో ఏం స్టోర్ చేయాలో తెలుసా ? 99 % మందికి చేసే పొరపాట్లు ఇవే
Advertisement

Food storage tips: మనలో చాలామంది మార్కెట్ నుంచి తెచ్చిన వస్తువులను ఫ్రిజ్‌లో ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పెట్టేస్తుంటాం. ముఖ్యంగా ఫ్రిజ్ డోర్ సెల్ఫ్స్‌లో పాలు, గుడ్లు వంటివి సర్దేస్తాం. కానీ మీకు తెలుసా? ఫ్రిజ్ మొత్తం మీద అత్యంత తక్కువ చల్లదనం ఉండే ప్రాంతం డోర్ మాత్రమే. అందుకే అక్కడ ఏవి పడితే అవి పెడితే త్వరగా పాడయ్యే అవకాశం ఉంది. మరి డోర్ సెల్ఫ్స్‌లో పెట్టినా ఎక్కువ కాలం నిల్వ ఉండే పదార్థాలు ఏంటి ? అసలు ఫ్రిజ్ లో ఎలాంటి పదార్థాలు ఎక్కడ పెట్టాలో తెలుసా ? దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఫ్రిజ్ డోర్‌లో పెట్టాల్సిన 6 ఆహార పదార్థాలు:

సాధారణంగా ఫ్రిజ్ లోపలి భాగంలో ఉష్ణోగ్రత అంతటా ఒక లాగా ఉంటుంది. కానీ డోర్‌ను మనం మాటిమాటికీ తీస్తూ, వేస్తూ ఉండటం వల్ల అక్కడి ఉష్ణోగ్రత మారుతూ ఉంటుంది. కాబట్టి.. “ఎక్కువ కాలం నిల్వ ఉండే ” పదార్థాలను మాత్రమే ఇక్కడ ఉంచాలి.

Advertisement

1. జ్యూస్‌లు:
ప్యాక్ చేసిన జ్యూస్‌లు లేదా తాజా జ్యూస్‌లను డోర్‌లో ఉంచవచ్చు. వీటిలో ఉండే సహజసిద్ధమైన ఆమ్లాలు ఉష్ణోగ్రత మారినా కూడా తట్టుకోగలవు. అయితే.. పాలను మాత్రం పొరపాటున కూడా డోర్‌లో పెట్టకండి. పాలు త్వరగా విరిగిపోయే గుణం కలిగి ఉంటాయి కాబట్టి వాటిని ఫ్రిజ్ లోపల అత్యంత చల్లగా ఉండే షెల్ఫ్‌లో ఉంచాలి.

2. సాస్‌లు,కెచప్ :
కెచప్, సోయా సాస్, చిల్లీ సాస్ , మయోనైస్ వంటి వాటిని నిరభ్యంతరంగా ఫ్రిజ్ డోర్‌లో పెట్టవచ్చు. వీటిలో వెనిగర్ , ఉప్పు వంటి ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి తక్కువ చల్లదనంలో కూడా పాడవకుండా ఉంటాయి.

Advertisement

3. జామ్, జెల్లీలు:
జామ్స్ తయారు చేసేటప్పుడు చక్కెరను ఎక్కువగా ఉపయోగిస్తారు. చక్కెర సహజంగానే బ్యాక్టీరియా చేరకుండా కాపాడుతుంది. కాబట్టి.. జామ్ సీసాలను డోర్ సెల్ఫ్స్‌లో ఉంచడం వల్ల లోపల ఇతర ముఖ్యమైన వస్తువులకు చోటు దక్కుతుంది.

4. పచ్చళ్లు :
మనం ఇంట్లో పెట్టుకునే ఆవకాయ కావచ్చు లేదా మార్కెట్లో దొరికే వెనిగర్ బేస్డ్ ఊరగాయలు కావచ్చు, వీటిని డోర్ సెల్ఫ్స్‌లో ఉంచడం బెస్ట్. ఇందులో ఉండే ఉప్పు, నూనె, వెనిగర్ వంటి పదార్థాలు తక్కువ ఉష్ణోగ్రత వద్ద కూడా ఆహారాన్ని పాడకుండా ఉంచుతాయి.

Also Read: ఫ్రిజ్‌లో స్పూన్ పెడితే.. ఆహారం ఎన్ని రోజులైనా పాడవ్వదు తెలుసా ?

5.వాటర్ బాటిల్స్, సాఫ్ట్ డ్రింక్స్:
మంచినీళ్లు, సోడా లేదా ఇతర కూల్ డ్రింక్స్ బాటిళ్లను డోర్‌లో ఉంచడం వల్ల తీసుకోవడానికి సులభంగా ఉంటుంది. ఇవి పాలు లేదా నాన్ వెజ్ లాగా ఉష్ణోగ్రత మారగానే బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉండదు.

6. వెన్న :
చాలా ఫ్రిజ్‌లకు డోర్ పైభాగంలో ఒక చిన్న బాక్స్ వంటిది ఉంటుంది. దీన్ని వెన్న లేదా చీజ్ నిల్వ చేయడానికి తయారు చేస్తారు. వెన్న మరీ గడ్డకట్టకుండా, కొంచెం మెత్తగా ఉంటేనే బ్రెడ్‌పై రాసుకోవడానికి బాగుంటుంది. కాబట్టి డోర్‌లో ఉండే తక్కువ ఉష్ణోగ్రత వెన్నకు సరిగ్గా సరిపోతుంది.

మీ ఫ్రిజ్ నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోవడమే కాకుండా.. ఆహారం వృథా కాకుండా ఉండాలంటే ఈ చిన్న మార్పులు చేయండి. పాలు, పెరుగు, గుడ్లు, మాంసం వంటి వస్తువులను ఎప్పుడూ ఫ్రిజ్ లోపలి భాగంలోనే ఉంచండి. ఈ చిట్కాలు పాటిస్తే మీ ఆరోగ్యం సురక్షితంగా ఉండటమే కాకుండా ఆహారం కూడా తాజాగా ఉంటుంది.

Related News

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

పిల్లల్లో డిప్రెషన్ ముప్పును తగ్గించే చిన్ననాటి అనుభవాలు ఇవే.. పేరెంట్స్ ఇవి తప్పక తెలుసుకోవాలి!

సాయంత్రం పూట వేడి వేడిగా ఇలా చేసి పెట్టండి ఇంటిల్లిపాదీ ఇష్టంగా తింటారు!

హోటల్ స్టైల్ క్రిస్పీ ఇన్‌స్టంట్ రవ్వ దోశ.. 15 నిమిషాల్లో ఇలా తయారు చేసుకోండి!

Big Stories

Advertisement
×