E-Paper
Advertisement

ఎండలకి పిల్లలు అలసిపోతున్నారా? వేసవి నుంచి కాపాడే 5 సూపర్ ఫుడ్స్ ఇవే!

ఎండలకి పిల్లలు అలసిపోతున్నారా? వేసవి నుంచి కాపాడే 5 సూపర్ ఫుడ్స్ ఇవే!
Advertisement

Summer superfoods for kids: వేసవి సెలవులు వచ్చేశాయి.. పిల్లల ఆటపాటలు, అల్లరి మామూలుగా ఉండదు. అయితే.. ఎండలు మండిపోతున్న ఈ టైమ్‌లో పిల్లల ఆరోగ్యం విషయంలో పేరెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. పెద్దవాళ్లతో పోలిస్తే పిల్లల బాడీ త్వరగా డీహైడ్రేట్ అవుతుంది. దీని వల్ల వడదెబ్బ, నీరసం, కడుపునొప్పి, వాంతులు, మోషన్స్ లాంటి సమ్మర్ అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే ఛాన్స్ ఉంది. మరి మీ పిల్లలు ఈ వేసవిలో కూడా సూపర్ యాక్టివ్‌గా, హెల్తీగా ఉండాలంటే.. మార్కెట్లో దొరికే కూల్ డ్రింక్స్ కాకుండా, వారి డైట్‌లో చేర్చాల్సిన మ్యాజికల్ సూపర్ ఫుడ్స్ ఏంటో తెలుసుకుందామా..

పిల్లలని కాపాడే ఆ 5 వేసవి సూపర్ ఫుడ్స్ ఇవే:

Advertisement

1.అమృతం లాంటి ‘పెరుగు, మజ్జిగ’:
సమ్మర్‌లో పిల్లల పొట్టను చల్లగా ఉంచడానికి పెరుగును మించిన సూపర్ ఫుడ్ లేదు.పెరుగులో ఉండే క్యాల్షియం,విటమిన్లు పిల్లల ఎముకల బలానికి హెల్ప్ అవుతాయి.

ఎందుకు పెట్టాలి?: పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ (మంచి బ్యాక్టీరియా) పిల్లల జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. దీని వల్ల వేసవిలో వచ్చే కడుపునొప్పి,డయేరియా సమస్యలు రావు.

Advertisement

టిప్: పిల్లలకు బోర్ కొట్టకుండా కొద్దిగా ఉప్పు, జీలకర్ర పొడి వేసి చల్లటి మజ్జిగ లాగానో.. లేదా ఫ్రూట్ లస్సీ లాగానో చేసి ఇస్తే ఇష్టంగా తాగుతారు.

2. వాటర్ ప్యాకెట్ ‘పుచ్చకాయ’ :
సమ్మర్ అనగానే అందరికీ గుర్తొచ్చే మొదటి ఫ్రూట్ పుచ్చకాయ.ఇందులో దాదాపు 92% నీరు ఉంటుంది.ఎండలో ఆడుకుని వచ్చే పిల్లలకి ఇది బెస్ట్ ఎనర్జీ బూస్టర్.

ఎందుకు పెట్టాలి?: ఇది శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడమే కాకుండా.. ఎండ వేడి వల్ల బాడీ కోల్పోయే విటమిన్ ఎ, విటమిన్ సి , పొటాషియం వంటి ఖనిజాలను తిరిగి అందిస్తుంది. ఇది బాడీని లాంగ్ లాస్టింగ్ హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది.

3. చలవ చేసే ‘సబ్జా గింజలు’:
సబ్జా గింజలు ప్రకృతి మనకిచ్చిన బెస్ట్ బాడీ కూలర్. ఇవి శరీరంలోని విపరీతమైన వేడిని చాలా వేగంగా లాగేస్తాయి.

ఎందుకు పెట్టాలి?: ఎండ తీవ్రత వల్ల చాలా మంది పిల్లలు యూరిన్ ఇన్ఫెక్షన్ లేదా యూరిన్ మంటతో ఇబ్బంది పడుతుంటారు. రోజూ సబ్జా గింజలను నీళ్లలో నానబెట్టి ఇస్తే ఆ సమస్యలన్నీ మాయమవుతాయి.

టిప్: వీటిని నార్మల్ నీళ్లలో ఇస్తే పిల్లలు తాగడానికి మారాం చేయొచ్చు. అందుకే ఇంట్లో చేసే నిమ్మకాయ నీళ్లలో లేదా కొబ్బరినీళ్లలో ఈ సబ్జా గింజలను కలిపి కలర్‌ఫుల్‌గా ఇస్తే గ్లాస్ ఖాళీ చేసేస్తారు.

4. ఎనర్జీ కింగ్ ‘కొబ్బరినీళ్లు’ :
మార్కెట్లో దొరికే ఆర్టిఫిషియల్ గ్లూకోజ్ పౌడర్స్ కంటే కొబ్బరినీళ్లు వంద రెట్లు పవర్‌ఫుల్, నేచురల్.

ఎందుకు పెట్టాలి?: ఇందులో ఉండే ఎలక్ట్రోలైట్స్ (పొటాషియం, సోడియం, మెగ్నీషియం) వడదెబ్బ తగలకుండా రక్షిస్తాయి. ఆటల వల్ల పిల్లలు కోల్పోయే ఎనర్జీని ఇది వెంటనే రీఛార్జ్ చేస్తుంది. నీరసం దరిచేరనివ్వదు.

Also Read: చద్దన్నం మహిమ తెలిస్తే అస్సలు వదలరు.. ఎండదెబ్బకి చెక్ పెట్టే బెస్ట్ సూపర్ ఫుడ్!

5. దోసకాయ , పుదీనా :
దోసకాయలో వాటర్ కంటెంట్, ఫైబర్ (పీచుపదార్థం) చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే పుదీనా బాడీకి అద్భుతమైన రిఫ్రెష్‌మెంట్‌ను ఇస్తుంది.

ఎందుకు పెట్టాలి?: వేసవిలో పిల్లల్లో ఆకలి తగ్గిపోవడం కామన్. దోసకాయ ముక్కలపై కొద్దిగా పుదీనా రసం, నిమ్మరసం చల్లి స్నాక్స్‌లా ఇస్తే జీర్ణశక్తి పెరిగి ఆకలి బాగా వేస్తుంది. బాడీ కూడా లైట్‌గా ఉంటుంది.

ఈ సమ్మర్‌లో మీ పిల్లలు హెల్తీగా ఉండాలంటే ప్యాకెట్ జ్యూస్‌లు, ఐస్‌క్రీమ్‌లు, కూల్ డ్రింక్స్‌ను వీలైనంత వరకు దూరంగా ఉంచండి. వాటిలో ఉండే షుగర్ కంటెంట్ వల్ల ఇమ్యూనిటీ తగ్గి, పిల్లలు త్వరగా రోగాల బారిన పడతారు. దానికి బదులు మనం చెప్పుకున్న ఈ 5 నేచురల్ సూపర్ ఫుడ్స్‌ను డైలీ లైఫ్‌లో భాగం చేయండి. వారితో ఎక్కువ నీళ్లు తాగించండి. ఈ సింపుల్ కేర్ తీసుకుంటే.. మీ పిల్లలు వేసవి వేడిని ఈజీగా తట్టుకుని, సెలవులను సూపర్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు.

Related News

జీవితంలో ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోరు, మోసపోరు.. చాణక్యుడు చెప్పిన ఈ నీతి సూత్రాలు పాటిస్తే

తక్కువ స్థలంలో కిచెన్ గార్డెన్‌.. ఇంట్లోనే కూరగాయలు పండించడం మరింత సులభం

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

పిల్లలు రాత్రి ఏ సమయం కల్లా నిద్రపోవాలి? టైమ్‌కు నిద్రపోకపోతే మెదడుపై ప్రభావం

రక్తపోటు పెరగడానికి మౌత్ వాష్ కూడా ఒక కారణమేనా.. తాజా రీసెర్చ్ ఏం చెబుతోంది?

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

Big Stories

Advertisement
×