E-Paper
Advertisement

జోగి రమేశ్ vs పోలీసు అధికారి.. కేకలతో ఊగిపోయిన ఇరువురు.. వీడియో వైరల్!

జోగి రమేశ్ vs పోలీసు అధికారి.. కేకలతో ఊగిపోయిన ఇరువురు.. వీడియో వైరల్!
Advertisement

Jogi Ramesh: గుంటూరు జిల్లాలో మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్ చేపట్టిన పర్యటన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. పొన్నూరు నియోజకవర్గం, మామిళ్లపల్లి వెళ్లేందుకు జోగి రమేశ్ యత్నించగా.. ఆయన్ని తెనాలి పోలీసులు మార్గం మధ్యలో అడ్డుకున్నారు. అనుమతి లేదంటూ రోడ్డుపైనే ఆయన వాహనాన్ని నిలిపివేశారు. పోలీసుల తీరుతో తీవ్ర అసహనం చెందిన జోగి రమేశ్ రోడ్డుపైనే బైఠాయించారు. దీంతో ఆయనకు అండగా వైసీపీ కార్యకర్తలు సైతం పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.

Also Read: ఇకపై ఇంట్లోనే కాదు.. గోడలపైనా మొక్కలు పెంచేయొచ్చు.. శాస్త్రవేత్తల క్రేజీ ఆవిష్కరణ!

Advertisement

దీంతో మరింత దూకుడు పెంచిన పోలీసులు.. ఆయన్ను బలవంతంగా వాహనంలోకి ఎక్కించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసు అధికారి, జోగి రమేశ్ కు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అరుపులు, కేకలతో పోలీసు అధికారి, మాజీ మంత్రి చాలా కోపంగా కనిపించారు. ఈ క్రమంలో పోలీసు అధికారి వేలు చూపిస్తూ కారు ఎక్కమని జోగి రమేశ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఒక్కసారిగా వైసీపీ శ్రేణులు సైతం రెచ్చిపోయి కేకలు వేయడంతో అక్కడి పరిస్థితులు ఒక్కసారిగా చేతులు దాటుతాయన్న భయాందోళన కలిగించింది. చివరికి జోగి రమేశ్ ను అదుపులోకి తీసుకోని అక్కడి నుంచి తరలించినట్లు తెలుస్తోంది.

Advertisement

ఇదిలా ఉంటే ఇటీవల మామిళ్లపల్లిలో రాజకీయంగా తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఓ గోడౌన్ లోని మెుక్క జొన్నను అధికారులు సీజ్ చేయగా.. అది వైసీపీ నేతది కావడంతో ఒక్కసారిగా రాజకీయ దుమారం చెలరేగింది. స్థానిక వైసీపీ నేత అంబటి మురళి, పొన్నూరు టీడీపీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర మధ్య దీనిపై మాటల యుద్దం సాగాయి. ఈ క్రమంలోనే మామిళ్లపల్లికి జోగి రమేశ్ వెళ్లేందుకు యత్నించడంతో స్థానికంగా ఉద్రిక్తతలు చెలరేగే అవకాశం ఉందన్న ఆరోపణలతో జోగి రమేశ్ ను పోలీసులు అడ్డుకున్నారు.

Also Read: సామాన్యుడికి గుడ్ న్యూస్.. ఏసీ లేకున్నా లైఫ్ లాంగ్ కూలింగ్.. పైగా జీరో కరెంట్ బిల్లు!

Related News

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

Big Stories

Advertisement
×