E-Paper
Advertisement

చెక్క ఫర్నిచర్‌కు చెదలు పట్టాయా? ఈ చిట్కాలతో.. ఈజీగా చెక్ పెట్టండి!

చెక్క ఫర్నిచర్‌కు చెదలు పట్టాయా? ఈ  చిట్కాలతో.. ఈజీగా చెక్ పెట్టండి!
Advertisement

How to remove termites from wood: ఇల్లు అందంగా కనిపించడంలో.. మన ఇంట్లోని సోఫాలు,మంచాలు,డోర్స్ వంటి చెక్క ఫర్నిచర్ కీలక పాత్ర పోషిస్తాయి. కానీ.. ఒక్కసారి వీటికి చెదలు పట్టాయా.. ఇక అంతే సంగతులు! లోపల లోపలే నమిలేసి మన కళ్లముందే లక్షల విలువైన ఫర్నిచర్‌ను పొడిపొడిగా మార్చేస్తాయి. మార్కెట్లో దొరికే కెమికల్స్ వాడదామంటే ఖర్చు ఎక్కువ, పైగా ఇంట్లో పిల్లలు ఉంటే ఆరోగ్యంపై ఎఫెక్ట్ పడుతుంది. అందుకే.. మన వంటింట్లో దొరికే పదార్థాలతోనే చెదలను ఈజీగా ఎలా తరిమికొట్టాలో ఇప్పుడు చూద్దాం.

చెక్క ఫర్నిచర్ నుంచి చెదలను వదిలించే 6 చిట్కాలు:

చెదలు చీకటి, తేమ ఉన్న చోట వేగంగా పెరుగుతాయి. ఇవి ఒక్కసారి ఇంట్లోకి ప్రవేశిస్తే మొత్తం ఫర్నిచర్‌కు వ్యాపిస్తాయి. వీటిని తగ్గించడానికి ఎఫెక్టివ్‌గా పనిచేసే 6 బెస్ట్ హోమ్ రెమెడీస్..

1.వేప నూనె- సహజ సిద్ధమైన అస్త్రం:

Advertisement

మన పూర్వీకుల కాలం నుంచి క్రిమికీటకాలను తరిమేందుకు వేపను వాడుతున్నాం. చెదపురుగుల నివారణకు వేప నూనె ఒక అద్భుతమైన మందు.

ఎలా వాడాలి?: ఒక స్ప్రే బాటిల్‌లో వేప నూనె తీసుకుని.. చెదలు పట్టిన చోట బాగా స్ప్రే చేయండి.

Advertisement

ఎలా పనిచేస్తుంది?: ఈ నూనె వాసనకు చెదపురుగులు శ్వాస తీసుకోలేవు. అంతేకాదు. ఇది చెదలు గుడ్లు పెట్టకుండా వాటి పునరుత్పత్తి వ్యవస్థను దెబ్బతీస్తుంది.

2. బోరిక్ యాసిడ్- పవర్‌ఫుల్ సొల్యూషన్:

చెదలను త్వరగా, శాశ్వతంగా వదిలించుకోవడానికి బోరిక్ యాసిడ్ చాలా పాపులర్ రెమెడీ. ఇది మనకు మెడికల్ షాపుల్లో కూడా దొరుకుతుంది.

ఎలా వాడాలి?: కొద్దిగా బోరిక్ యాసిడ్ పౌడర్‌ను నీళ్లలో కలిపి మిశ్రమంగా చేయండి. దీనిని బ్రష్ సాయంతో చెక్కపై పూయండి లేదా స్ప్రే చేయండి.

ఎలా పనిచేస్తుంది?: చెదలు దీనిని తాకగానే వాటి నరాల వ్యవస్థ స్తంభించిపోయి చనిపోతాయి.

3. వెనిగర్, నిమ్మరసం :

సలాడ్స్,వంటల్లో వాడే వెనిగర్ క్లీనింగ్‌కే కాదు..చెదలను చంపడానికి కూడా సూపర్బ్ గా పనిచేస్తుంది.

ఎలా వాడాలి?: అరకప్పు వెనిగర్‌లో రెండు నిమ్మకాయల జ్యూస్ కలపండి. ఈ మిశ్రమాన్ని చెదలు ఉన్న రంధ్రాలలోకి స్ప్రే చేయండి.

ఎలా పనిచేస్తుంది?: వెనిగర్‌లోని యాసిడ్ గుణాలు చెదలను తక్షణమే నిర్మూలిస్తాయి.

4. ఉప్పు నీళ్ల మ్యాజిక్ :

అతి తక్కువ ఖర్చుతో కూడిన చిట్కా ఇది. ఉప్పులో ఉండే సోడియం క్లోరైడ్ కీటకాలకు శత్రువు లాంటిది.

ఎలా వాడాలి?: ఒక గ్లాస్ వేడి నీళ్లలో ఎక్కువ మొత్తంలో ఉప్పు వేసి బాగా కలపండి. ఈ సెలైన్ వాటర్‌ను సిరంజి సహాయంతో చెక్క రంధ్రాలలోకి ఇంజెక్ట్ చేయండి.

ఎలా పనిచేస్తుంది?: ఈ నీరు చెదలలోని తేమను లాగేసుకుని.. వాటిని డీహైడ్రేషన్ వల్ల చనిపోయేలా చేస్తుంది.

5. ఎండ దెబ్బ – ఉచిత నివారణ:

చెదపురుగులకు అస్సలు పడనిది ఏదైనా ఉందా అంటే.. అది సూర్యకాంతి, వేడి. ఇవి తేమలోనే బతుకుతాయి.

ఎలా వాడాలి?: చెదలు పట్టిన కుర్చీలు లేదా చిన్న టేబుల్స్‌ను కనీసం 2-3 రోజుల పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు మంచి ఎండలో పెట్టండి.

ఎలా పనిచేస్తుంది?: ఎండ వేడికి చెక్కలోని తేమ పూర్తిగా ఆరిపోతుంది. చీకటిని ఇష్టపడే చెదలు ఆ వేడిని తట్టుకోలేక చనిపోతాయి లేదా పారిపోతాయి.

Also Read: డిష్‌వాషర్ కొనాలనుకుంటున్నారా? ఇండియన్ కిచెన్‌కు పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యే బెస్ట్ ఆప్షన్స్!

6. కార్డ్‌బోర్డ్ ట్రాప్ :

ఇదొక తెలివైన చిట్కా. చెదపురుగులకు సెల్యులోజ్ అంటే చాలా ఇష్టం.కాగితం,కార్డ్‌బోర్డ్‌లలో ఇది ఎక్కువగా ఉంటుంది.

ఎలా వాడాలి?: ఒక రెండు మూడు అట్టపెట్టె ముక్కలను తడిపి, చెదలు పట్టిన ఫర్నిచర్ దగ్గర పెట్టండి.

ఎలా పనిచేస్తుంది?: ఫర్నిచర్‌ను వదిలేసి చెదలు అన్నీ ఈ తడి అట్ట ముక్కల్లోకి చేరతాయి.ఆ తర్వాత ఆ అట్టను తీసుకెళ్లి ఇంటికి దూరంగా తగలబెట్టేయండి.

ఇంటిని ఎప్పుడూ పొడిగా ఉంచుకోవడం, ఫర్నిచర్‌కు తడి తగలకుండా చూసుకోవడం ద్వారా చెదలను ముందే అడ్డుకోవచ్చు. ఒకవేళ ఇప్పటికే చెదలు స్టార్ట్ అయితే మాత్రం పైన చెప్పిన చిట్కాలను వెంటనే ట్రై చేయండి. అయితే.. సమస్య మరీ ఎక్కువగా ఉండి ఫర్నిచర్ మొత్తం పాడైపోయే స్టేజ్‌కు వస్తే మాత్రం ఆలస్యం చేయకుండా ప్రొఫెషనల్ పెస్ట్ కంట్రోల్ వారిని సంప్రదించడం మంచిది.

Related News

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

పిల్లల్లో డిప్రెషన్ ముప్పును తగ్గించే చిన్ననాటి అనుభవాలు ఇవే.. పేరెంట్స్ ఇవి తప్పక తెలుసుకోవాలి!

సాయంత్రం పూట వేడి వేడిగా ఇలా చేసి పెట్టండి ఇంటిల్లిపాదీ ఇష్టంగా తింటారు!

హోటల్ స్టైల్ క్రిస్పీ ఇన్‌స్టంట్ రవ్వ దోశ.. 15 నిమిషాల్లో ఇలా తయారు చేసుకోండి!

పిల్లల చేతి నుంచి ఫోన్ తీసుకోగానే ఏడుస్తున్నారా? ఇలా చేస్తే స్వయంగా ఇచ్చేస్తాడు

మన రక్తంలో ప్లాస్టిక్ విధ్వంసం.. తాజా రీసెర్చ్‌లో తేలిన సంచలన విషయాలు!

ఈ నవరాత్రులకు 3 స్పెషల్ డిషెస్.. ప్రసాదంగానూ పెట్టొచ్చు, రుచికి తిరుగే ఉండదు!

ఇడ్లీ,దోశలోకి అదిరిపోయే రుచితో ఉల్లిపాయ చట్నీలు..ఇలా చేసేయండి!

Big Stories

Advertisement
×