Best Dishwasher for Indian Cooking 2026: ఇంట్లో వంట చేయడం ఒక ఎత్తైతే.. వంట పూర్తయ్యాక సింక్ నిండా పేరుకు పోయే గిన్నెలను కడగడం ఒక పెద్ద తల నొప్పి. ముఖ్యంగా ఇండియన్ వంటకాల్లో వాడే నూనె, మసాలాల జిడ్డు మరకలను వదిలించడం సామాన్యమైన విషయం కాదు. అందుకే ఇప్పుడు చాలా మంది ఇళ్లలో ‘డిష్‌వాషర్స్’ కిచెన్‌లో ముఖ్య భాగమైపోతున్నాయి. ఇవి గిన్నెలను కేవలం కడగడమే కాకుండా 99% పైగా బ్యాక్టీరియాను క్లీన్ చేసి పొడిగా కూడా మారుస్తాయి. ప్రతి రోజూ వాడుకోవడానికి మార్కెట్లో ఉన్న టాప్ 5 బెస్ట్ డిష్‌వాషర్ బ్రాండ్స్, వాటి ఫీచర్లు, ప్రస్తుత ధరల వివరాలు ఇవే..
5 బెస్ట్ డిష్‌వాషర్ బ్రాండ్స్ :
ఈ రోజుల్లో డిష్‌వాషర్ అనేది ఒక లగ్జరీ కాదు. సమయాన్ని ఆదా చేసే ఒక చక్కటి కిచెన్ గ్యాడ్జెట్. ప్రస్తుతం ఎక్కువ మంది వాడుతున్న 5 బెస్ట్ డిష్‌వాషర్ బ్రాండ్ల వివరాలు..
1. Bosch 13 Place Settings Dishwasher:
డిష్ వాషర్ రంగంలో గ్లోబల్ లీడర్ ‘బాష్’. ఇండియన్ కిచెన్స్ కోసం వీరు ప్రత్యేకంగా ‘Intensive Kadhai’ మోడల్‌ను డిజైన్ చేశారు. ఇది 70°C వేడి నీటితో గిన్నెలను కడగడం వల్ల కడాయిలకు ఉండే మొండి జిడ్డు, మాడిన మరకలు సైతం పూర్తిగా వదిలిపోతాయి. దీనిలోని ‘EcoSilence Drive’ మోటార్ చాలా తక్కువ శబ్దంతో పని చేస్తుంది. ఇది 4 నుంచి 5 గురు ఉన్న కుటుంబానికి పర్ఫెక్ట్‌గా సరి పోతుంది.
ప్రస్తుత ధర: రూ.39,500
2. LG 14 Place Settings Wi-Fi Inverter Dishwasher:
మీకు ఫుల్ అడ్వాన్స్‌డ్ ఫీచర్లు కావాలంటే.. ఎల్‌జీ బెస్ట్ ఆప్షన్. ఇందులో ‘TrueSteam’ టెక్నాలజీ ఉంది. అంటే వేడి ఆవిరి ద్వారా గిన్నెలను క్లీన్ చేస్తుంది, దీని వల్ల గ్లాస్ ఐటమ్స్ మీద నీటి మచ్చలు పడకుండా తళతళలాడుతాయి. దీనికి ‘QuadWash’ ఫీచర్ ఉంది. అంటే నాలుగు క్లీనింగ్ ఆర్మ్స్ అన్ని వైపుల నుంచి వాటర్ స్ప్రే చేస్తాయి. దీనిని మొబైల్ యాప్ (LG ThinQ) ద్వారా కూడా ఆపరేట్ చేయవచ్చు.
ప్రస్తుత ధర :రూ. 52,990
3. IFB 15 Place Settings Neptune Dishwasher:
పెద్ద ఫ్యామిలీస్ లేదా రోజు వారీగా ఎక్కువ గిన్నెలు పడే ఇళ్లకు ఐఎఫ్‌బీ నెప్ట్యూన్ సిరీస్ చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. దీనిలోని 15 ప్లేస్ సెట్టింగ్స్ వల్ల పెద్ద పెద్ద గిన్నెలు, ప్లేట్లను సులభంగా సర్దవచ్చు. ఇందులో ‘Hot Water Wash’, ‘Super Energy Efficient’ మోడ్స్ ఉన్నాయి. ఇవి కరెంట్, నీటిని చాలా పొదుపుగా వాడుకుంటాయి. హార్డ్ వాటర్ (ఉప్పు నీరు) ఉన్న ప్రాంతాల్లో కూడా ఇది అద్భుతంగా పని చేస్తుంది.
ప్రస్తుత ధర : రూ. 44,000
4. Voltas Beko 8 Place Settings Table Top Dishwasher:
మీ కిచెన్ చిన్నగా ఉండి, ఫ్యామిలీలో ఇద్దరు లేదా ముగ్గురు మాత్రమే ఉంటే.. ఈ టేబుల్ టాప్ డిష్‌వాషర్ పర్ఫెక్ట్ ఛాయిస్. దీనిని కిచెన్ ప్లాట్‌ఫారమ్ మీద చిన్న స్పేస్‌లోనే సెట్ చేసుకోవచ్చు. చిన్నదైనప్పటికీ ఇందులో 6 వాష్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇది తక్కువ ధరలో రావడమే.. కాకుండా నీటి వాడకాన్ని కూడా చాలా వరకు తగ్గిస్తుంది. బ్యాచిలర్స్ లేదా వర్కింగ్ కపుల్స్‌కు ఇది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఆప్షన్.
ప్రస్తుత ధర : రూ.20,490
5. Faber 12 Place Settings Dishwasher:
కిచెన్ అప్లయన్సెస్ లో మంచి గుర్తింపు ఉన్న ఫేబర్ బ్రాండ్ నుంచి వచ్చిన బడ్జెట్ ఫ్రెండ్లీ మోడల్ ఇది. ఇందులో 6 వాష్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. వీటిలో ‘Self-Clean’ ఫీచర్ చాలా స్పెషల్. అంటే డిష్‌వాషర్ లోపల కూడా ఎలాంటి వాసనలు రాకుండా అది ఆటోమేటిక్‌గా క్లీన్ చేసుకుంటుంది. తక్కువ బడ్జెట్‌లో నమ్మకమైన పర్ఫార్మెన్స్, నీటి ఆదా ఇచ్చే మంచి మోడల్ ఇది.
ప్రస్తుత ధర : రూ. 25,990
Also Read: చిన్న కిచెన్.. తక్కువ బడ్జెట్! రూ. 20వేలలోపు టాప్ టేబుల్ టాప్ డిష్‌వాషర్స్
డిష్‌వాషర్ కొనేటప్పుడు ఈ విషయాలు గమనించండి :
ప్లేస్ సెట్టింగ్స్ : చిన్న కుటుంబాలకు 8 కన్నా తక్కువ ప్లేస్ సెట్టింగ్స్, మీడియం కుటుంబాలకు 12 నుంచి 13, పెద్ద కుటుంబాలకు 14 లేదా 15 ప్లేస్ సెట్టింగ్స్ ఉన్నవి ఎంచుకోవాలి.
వాటర్ కన్సప్షన్: చేత్తో కడిగితే ఒక సారికి సుమారు 40 నుంచి 50 లీటర్ల నీరు వేస్ట్ అవుతుంది. అదే డిష్‌వాషర్ అయితే కేవలం 9 నుంచి 12 లీటర్ల నీటితోనే క్లీనింగ్ పూర్తి చేస్తుంది.
ఒక మంచి డిష్ వాషర్ కిచెన్‌లో మీ శ్రమను తగ్గించడమే కాకుండా. చేతులను , మీ సమయాన్ని కాపాడుతుంది. పైగా వేడి నీటితో.. కడగడం వల్ల చిన్న పిల్లలు ఉన్న ఇళ్లకు ఇది మరింత హైజీనిక్ . మీ బడ్జెట్ , కుటుంబ సభ్యుల సంఖ్యను బట్టి పైన పేర్కొన్న వాటిలో ఒక బెస్ట్ బ్రాండ్‌ను సెలెక్ట్ చేసుకుని మీ కిచెన్‌ను మరింత స్మార్ట్‌గా మార్చేయండి.