E-Paper
Advertisement

ఆ హీరోయిన్ల కాళ్లపై పడ్డ ఊర్వశి, ఆలియా.. ఆ ఫోటోపై బాలీవుడ్ బ్యూటీ ఫైర్!

ఆ హీరోయిన్ల కాళ్లపై పడ్డ ఊర్వశి, ఆలియా.. ఆ ఫోటోపై బాలీవుడ్ బ్యూటీ ఫైర్!
Advertisement

AI Controversy: ఇండస్ట్రీలో ఫ్యాన్ వార్స్ సహజం. అయితే గతం థియేటర్ కటౌట్స్ దగ్గర,అంటించే ఫ్లెక్సీల దగ్గర కొట్టుకున్న ఫ్యాన్స్.. ఇప్పుడు సోషల్ మీడియాలో మీమ్స్, ట్రోల్స్‌తో డిజిటల్ వార్ చేసేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఎవరి క్రేజ్ వారిదే అయినప్పటికీ, మా హీరో తోపు అంటే మా హీరోయిన్ గ్రేట్ అంటూ సాగే ఈ ఫ్యాన్ వార్స్ కొన్నిసార్లు బార్డర్స్ క్రాస్ చేయడం మనం చూస్తునే ఉంటాం.

ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన AI ఫోటో 

Advertisement

ఇక ఇదే క్రమంలో తాజాగా బాలీవుడ్ బ్యూటీల మధ్యలో జరిగిన ఒక ఫ్యాన్ మేడ్ రేటింగ్ కాంట్రవర్సీ ఇప్పుడు నెట్టింట తెగ సర్క్యులేట్ అవుతుంది.ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఉపయోగించి చేసిన ఒక క్రేజీ ఫోటో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

also read :జైలర్ 2’లోకి ఆ బాలీవుడ్ స్టార్ హీరో.. షారుఖ్ నో చెప్పడంతో లక్కీ ఛాన్స్!

Advertisement

ఆ ఫోటోలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్లను రకరకాల కేటగిరీలుగా డివైడ్ చేయడం గమనార్హం.అందరికంటే పైన మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ బచ్చన్‌ను ‘గ్లోబల్ బ్యూటీ’గా నిలబెట్టిన నెటిజన్లు ఆ తర్వాతి స్థానాల్లో గ్లోబల్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణెతో పాటు ఎవర్ గ్రీన్ బ్యూటీ మాధురీ దీక్షిత్‌లను ఉంచారు. ఇక చివరగా కరీనా కపూర్, కత్రినా కైఫ్, ఆలియా భట్ లతో పాటు గ్లామర్ డాల్ ఊర్వశి రౌతేలాను చేర్చారు. ఇక్కడితో ఆగకుండా, ఆఖరి వరుసలో ఉన్న హీరోయిన్లందరూ తమ పైన ఉన్న సీనియర్ నటీమణుల కాళ్లపై పడి నమస్కరిస్తున్నట్లుగా ఆ ఏఐ ఇమేజ్‌ను డిజైన్ చేశారు.

ప్రతి ఒక్కరూ కష్టపడతారన్న ఊర్వశి రౌతేలా

ఇక హీరోయిన్లని ఇలా ట్రోల్ చేస్తూ చేసిన ఈ ఫోటో కాస్తా నెట్టింట్లో తెగ వైరల్ కావడంతో అది కాస్తా ఊర్వశి రౌతేలా కంటపడింది.దీంతో తమని అవమానిస్తూ చేసిన ఈ పోస్ట్ పై ఓ రేంజ్ లో ఫైర్ అయింది.తన అఫీషియల్ అకౌంట్ ద్వారా ఆ నెటిజన్లకి గట్టి బుద్దే చెప్పింది.

ఇలాంటి చీప్,వల్గర్ బిహేవియర్ తో సమాజంలో విషం చిమ్మడం ఆపాలని చెప్పుకొచ్చింది. ప్రతి ఒక్క నటికి సినిమా పరిశ్రమలో సొంత ప్రయాణం ఉంటుందని, ఇక్కడికి రావడానికి, నిలదొక్కుకోవడానికి ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడతారని ఊర్వశి గుర్తు చేసింది.

పిచ్చి పనులు మానేయండి 

ముఖ్యంగా ఎంతో శ్రమించి పైకొచ్చిన మహిళలను ఇలా ర్యాంకుల పేరుతో పోల్చుతూ ఫ్యాన్ వార్స్ సృష్టించడం వల్ల ఎవరికీ ఎలాంటి ప్రయోజనం ఉండదని, ఇది కేవలం సమాజంలో నెగెటివిటీని మాత్రమే పెంచుతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి పిచ్చి పనులు మానేసి, నటీనటుల్లోని ప్రతిభను గుర్తించాలని, వారి ఎదుగుదలను ప్రోత్సహించాలని హితవు పలికింది. ఇండస్ట్రీలో ఒకరినొకరు గౌరవించుకుంటూ దయతో ప్రవర్తించడం నేర్చుకోవాలని ఊర్వశి చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

also read :మొదటికొచ్చిన పర్సంటేజ్ పంచాయితీ?.. పవన్ కళ్యాణ్ భేటీపై యంగ్ ప్రొడ్యూసర్ షాకింగ్ కామెంట్స్!

ఊర్వశి చేసిన కామెంట్స్ కి  సామాన్య నెటిజన్లతో పాటు ఇండస్ట్రీ వర్గాల నుంచి కూడా మంచి సపోర్ట్ లభిస్తోంది. నటీనటులను ఇలా తక్కువ చేసి చూపించడం ఏమాత్రం కరెక్ట్ కాదని అందరూ అభిప్రాయపడుతున్నారు.ఇక ఊర్వశి రౌతేలా కెరీర్ విషయానికి వస్తే, ఈమె సినిమాల్లో మెయిన్ లీడ్ రోల్స్ చేసినప్పటికీ సౌత్ ఇండియాలో మాత్రం ఐటెం సాంగ్స్ ద్వారానే విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ముఖ్యంగా టాలీవుడ్‌లో ఈమె చేసిన ప్రత్యేక గీతాలు బాక్సాఫీస్ వద్ద మాస్ ఆడియన్స్‌ను ఊపేశాయి.

ఆడియన్స్‌కు పూనకాలు తెప్పించిన సాంగ్స్ 

మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో ‘బాసూ.. వేర్‌ ఈజ్‌ ద పార్టీ’ అంటూ ఊర్వశి చేసిన డ్యాన్స్ థియేటర్లలో పూనకాలు తెప్పించింది. ఆ తర్వాత అఖిల్ అక్కినేని ‘ఏజెంట్’ మూవీలో ‘వైల్డ్ సాలా’ అంటూ అలరించింది. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘బ్రో’ చిత్రంలో ‘మై డియర్ మార్కండేయ’ అంటూ స్టెప్పులేసి ఆకట్టుకుంది. అలాగే ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ‘స్కంద’ మూవీలో ‘కల్ట్ మామా’ సాంగ్‌తో మాస్ ఆడియన్స్‌కు పూనకాలు తెప్పించింది.

also read :మెగాస్టార్ పొలిటికల్ రీఎంట్రీ ఫిక్స్?ఎంపీ సీటు ఖాయమైనట్లేనా?

బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ వరుసగా క్రేజీ ఆఫర్లు దక్కించుకుంటున్న ఊర్వశి, ఇటీవల విడుదలైన ‘జాట్’ సినిమాలో ‘టచ్ కియా’ అనే స్పెషల్ నెంబర్‌తో మరోసారి సోషల్ మీడియాను షేక్ చేసింది. ఇంతటి పాపులారిటీ ఉన్న నటిని ఇలా తక్కువ చేస్తూ మీమ్స్ వేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.చూడాలి మరి ఊర్వశి ఇచ్చిన ఈ వార్నింగ్ తో అయినా నెటిజన్లు వీటికి ఎండ్ కార్డ్ వేస్తారేమో!

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×