E-Paper
Advertisement

World Food Cities-2026: వరల్డ్ బెస్ట్ ఫుడ్ సిటీలు.. దేశవ్యాప్తంగా ఆరు నగరాలు, హైదరాబాద్‌కు చోటు

World Food Cities-2026: వరల్డ్ బెస్ట్ ఫుడ్ సిటీలు.. దేశవ్యాప్తంగా ఆరు నగరాలు, హైదరాబాద్‌కు చోటు
Advertisement

World Food Cities-2026:  భారత దేశ ఆహార సంస్కృతి శతాబ్దాలుగా అభివృద్ధి చెందింది. ప్రాంతీయ సంప్రదాయ వంటకాలు, స్ట్రీట్ ఫుడ్, ఇంటి వంటలు ఇలా చెప్పు కుంటూ పోతే చాలానే ఉంది. యుగయుగాలుగా సరిహద్దులను దాటింది. తాజాగా భారతీయ నగరాల వంటలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తోంది. స్పైసీ చాట్స్, స్వీట్ ట్రీట్స్, బిర్యానీల వంటివి ఉన్నాయి.

Advertisement

వరల్డ్ బెస్ట్ ఫుడ్ సిటీల్లో హైదరాబాద్ 

వరల్డ్ బెస్ట్ ఫుడ్ సిటీల టేస్ట్ అట్లాస్-2026 జాబితాలో దేశంలోని ఆరు నగరాలు చోటు దక్కించుకున్నాయి. అందులో హైదరాబాద్‌కు 54వ స్థానం దక్కింది.  సుగంధ ద్రవ్యాలతో చేసే వంటకాలు ప్రపంచ వ్యాప్తంగా ఆహార ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. వంటలు, నాణ్యత ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంది. ఇండియా నుంచి ఈసారి ఆరు నగరాలకు చోటు దక్కింది. గతేడాది మాదిరిగా ఈసారి ప్రపంచవ్యాప్తంగా 5వ స్థానాన్ని దక్కించుకుంది ముంబై సిటీ. అమృత్‌సర్-48, న్యూఢిల్లీ-53, హైదరాబాద్-54, కోల్‌కతా-73, చెన్నై-93వ స్థానాల్లో నిలిచాయి.

Advertisement

ముంబై- ఎల్లప్పుడూ ఐకానిక్ వంటకాలైన తీపి-కారంగా కరకరలాడే భేల్ పూరి, పావ్ భాజీ, OG వడ పావ్, ప్యాటీస్ లేదా ఐకానిక్ మోదక్ వంటి చాట్‌లతో ఆహార ప్రియుల హృదయాలను గెలుచుకుంది ముంబై నగరం. ప్రపంచంలోని జాబితాలో ఈ నగరానికి ఐదో స్థానం సొంతం చేసుకుంది. స్ట్రీట్ ఫుడ్ తోపాటు టేస్ట్ అట్లాస్ రామ్ ఆశ్రయ, శ్రీ థాకర్ భోజనాలయం, కేఫ్ మద్రాస్, నవాబ్ సాహెబ్, బాబా ఫలూడా వంటి వాటితో ముంబైలోని అనేక ఐకానిక్ సాంప్రదాయ రెస్టారెంట్లను హైలైట్ చేసింది.

దేశవ్యాప్తంగా ఆరు నగరాలు, టాప్-5 లో ముంబై

అమృత్‌సర్‌- పంజాబీ వంటకాలకు పేరుగాంచింది ఈ సిటీ. అమృత్‌సరి కుల్చా, పాలక్ పనీర్, దాల్ మఖానీ, సర్సన్ కా సాగ్, స్వీట్ డిలైట్ ఫిర్నీ వంటి ప్రముఖ వంటకాలు ఉన్నాయి . కేసర్ ద ధాబా, భరవన్ దా ధాబా, బడే భాయ్ కా బ్రదర్స్ ధాబా, క్రిస్టల్ రెస్టారెంట్, పెహెల్వాన్ కుల్చా వంటి ఐకానిక్ సాంప్రదాయ రెస్టారెంట్లకు కొదవలేదు. వెన్నతో కూడిన పంజాబీ భోజనాలను కోరుకునే ఆహార ప్రియులను ఆకర్షిస్తూనే ఉన్నాయి.

న్యూఢిల్లీ- ఇక ఢిల్లీ గురించి చెప్పనక్కర్లేదు. దాల్ మఖానీ, ముర్గ్ మఖానీ (బటర్ చికెన్), క్రిస్పీ పకోరాలు, చోలే భాతురే, సతత హరిత డెజర్ట్ గులాబ్ జామూన్ వంటి ఉత్తర భారత క్లాసిక్‌ వంటకాలకు రాజధాని మారింది.

ALSO READ: ఫోన్‌లో డేటా ఐపోయిందా? ప్రీ వైఫై హాట్ స్పాట్‌లను గుర్తించడానికి

హైదరాబాద్-దేశ, విదేశీ ఆహార ప్రియులకు స్వర్గధామంగా గుర్తింపు పొందింది హైదరాబాద్ సిటీ. సాంస్కృతిక వైవిధ్యంతోపాటు అద్భుతమైన రుచులకు కేరాఫ్. ఆహారపు అలవాట్లు.. నిజాం, నగర చరిత్ర, భౌగోళిక స్థితిని ఇక్కడ ప్రతిబింబిస్తాయి. హైదరాబాదీ బిర్యానీతోపాటు తెలంగాణ, ఆంధ్రా సంప్రదాయ వంటకాలు, హలీమ్, ఇరానీ చాయ్, ఉస్మానియా బిస్కెట్, డబుల్‌ కా మిఠా, మండి బిర్యానీ ఇలా చెప్పుకొంటూ పోతే పెద్ద జాబితా ఉంది. మొఘల్‌ సామ్రాజ్యం దక్షిణాదిలో విస్తరించినపుడు బిర్యానీ హైదరాబాద్ సిటీకి పరిచయమైందని అక్కడి వాసుల మాట. మొఘల్, అరబ్‌, పర్షియన్ దేశస్థుల వంటకాలతో స్థానిక దక్కన్ రుచుల మేళవింపుతో బిర్యానీ పుట్టుకొచ్చింది.

కోల్‌కతా-రసగుల్లా, రోష్మలై, సందేశ్ వంటి స్వీట్ల కేరాఫ్ ఈ సిటీ కేరాఫ్. స్ట్రీట్ ఫుడ్ అనగా కాథి రోల్, క్రీమీ ఫెర్మెంటెడ్ ట్రీట్ మిష్టి దోయి వరకు ఉంటుంది. ప్రియమైన పాత ప్రపంచ తినుబండారాల్లో టామరిండ్, చిత్తరంజన్ మిస్తాన్నా భండార్, అలెన్స్ కిచెన్, పీటర్ క్యాట్, లక్ష్మీ నారాయణ్ షా & సన్ వంటివి ఉన్నాయి.

చెన్నైదక్షిణ భారతంలో కీలకమైన నగరాల్లో చెన్నై ఒకటి. దోస, ఇడ్లీ, హార్టీ చికెన్ 65, మృదువైన రుమాలీ రోటీ, సాంబార్ వంటి ప్రధాన వంటకాలకు ప్రపంచవ్యాప్తంగా ఆహారప్రియులకు ఇష్టమైనది. ఆ నగరానికి వెళ్తే.. కచ్చితంగా దోస, వడ, సాంబార్ కచ్చితంగా రుచులు చూస్తుంటారు. వీటికి కూడా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కింది.

Related News

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

మీ బంధువులు, స్నేహితులను ఈ 4 ప్రశ్నలు ఎప్పుడూ అడగకూడదు.. రిలేషన్ దెబ్బతింటుంది

ఛార్జింగ్ అవసరం లేని.. ఈ మ్యాజికల్ వేరబుల్ డివైస్ విశేషాలివే!

ఐలైనర్ సరిగ్గా రావడం లేదా? పర్ఫెక్ట్ లుక్ కోసం ఈజీ మేకప్ ట్రిక్స్‌ ఇవిగో

ఇంటి ఖర్చులకు నెలజీతం సరిపోవడం లేదా? అదనపు ఆదాయం ఇలా సంపాదించండి

భోజనం చేసినా, ఏదైనా తాగినా వెంటనే లిప్‌స్టిక్ పాడవుతోందా? రోజంతా పెదాలు కలర్‌ఫుల్‌గా ఉండేందుకు చిట్కాలు

Big Stories

Advertisement
×