E-Paper
Advertisement

School Bus Accident: డ్రైవర్‌ డ్రంకెన్‌ డ్రైవింగ్‌.. లారీని ఢీకొట్టిన స్కూల్ బస్సు.. స్పాట్‌లో

School Bus Accident: డ్రైవర్‌ డ్రంకెన్‌ డ్రైవింగ్‌.. లారీని ఢీకొట్టిన స్కూల్ బస్సు.. స్పాట్‌లో
Advertisement

School Bus Accident: తెలంగాణలోని మేడ్చల్ జిల్లా నాగారం ప్రాంతంలో ఈరోజు ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాంపల్లి క్రాస్ రోడ్డు వద్ద చీర్యాలలోని డివైన్ గ్రేస్ స్కూల్ బస్సు అదుపు తప్పి, ముందు వెళ్తున్న జీహెచ్ఎంసీ చెత్త లారీని బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతినగా, బస్సులో ఉన్న విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి.

అదృష్టవశాత్తు, ప్రమాదం జరిగిన సమయంలో స్కూల్ బస్సులో కేవలం ఇద్దరు విద్యార్థులు మాత్రమే ఉన్నారు. దీంతో పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరగకుండా పెను ప్రమాదం తప్పింది. గాయపడిన ఇద్దరు విద్యార్థులను వెంటనే అప్రమత్తమైన స్థానికులు, అధికారులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిపారు.

Advertisement

ఈ ప్రమాదానికి బస్సు డ్రైవర్ రాజు నిర్లక్ష్యమే ప్రధాన కారణంగా పోలీసులు భావిస్తున్నారు. అతను తాగి డ్రైవింగ్ చేస్తూ ఈ ఘటనకు పాల్పడి ఉంటాడనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బస్సు డ్రైవర్ రాజు మద్యం సేవించి ఉన్నాడా అనే విషయాన్ని ధృవీకరించడానికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

Also Read: సంగారెడ్డి జిల్లాలో మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి..

Advertisement

ఈ విషయంలో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా డ్రైవర్ రాజు మద్యం తాగి డ్రైవింగ్ చేసిన సందర్భాలు ఉన్నాయని, అతని నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని వారు ఆరోపిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, డ్రైవర్ నిర్లక్ష్యంపై, అలాగే మద్యం తాగి డ్రైవింగ్ చేశాడా లేదా అనే అంశంపై లోతుగా దర్యాప్తు చేపట్టారు.

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×