E-Paper
Advertisement

Crime News: సంగారెడ్డి జిల్లాలో మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి..

Crime News: సంగారెడ్డి జిల్లాలో మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి..
Advertisement

Crime News: సంగారెడ్డి జిల్లా, కొండాపూర్ మండలం మల్కాపూర్‌లో నివాసముంటున్న సుచిత అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఆమె మరణంపై మొదట భర్త ఇచ్చిన సమాచారాన్ని కుటుంబ సభ్యులు నమ్మినా, అంత్యక్రియల సమయంలో మృతదేహంపై కనిపించిన గాయాలు అనుమానాలకు దారి తీశాయి. ఈ ఘటన వెనుక భర్త శ్రీనివాస్ హస్తం ఉండొచ్చని సుచిత బంధువులు ఆరోపిస్తున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. సుచిత మరణించిన తర్వాత ఆమె భర్త శ్రీనివాస్, తన భార్య గుండెపోటుతో మరణించిందని బంధువులను నమ్మించాడు. సహజ మరణంగా భావించిన బంధువులు, అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. అయితే, అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో సుచిత మృతదేహాన్ని గమనించిన బంధువులు ఆమె గొంతు వద్ద అనుమానాస్పద మరకలను గుర్తించారు. ఈ మరకలు చూసి వారికి అనుమానం వచ్చింది. దీంతొ ఇది సహజ మరణం కాదని, హత్య జరిగి ఉండవచ్చని అనుమానించారు.

Advertisement

వెంటనే అనుమానం వచ్చిన సుచిత బంధువులు అంత్యక్రియలను నిలిపివేశారు. భర్త శ్రీనివాసే సుచితను హత్య చేసి, అది గుండెపోటుగా చిత్రీకరించడానికి నాటకం ఆడాడని వారు ఆరోపించారు. ఈ మేరకు వారు కొండాపూర్ పోలీస్ స్టేషన్‌లో శ్రీనివాస్‌పై ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని తక్షణమే చర్యలు చేపట్టారు.

పోలీసులు అంత్యక్రియలను ఆపేసి, సుచిత మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆమె మరణానికి గల కారణాలను నిర్ధారించడం కోసం, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక ద్వారా సుచిత మృతికి అసలు కారణం ఏమిటనేది స్పష్టమయ్యే అవకాశం ఉంది.

Advertisement

Also Read:హైదరాబాద్‌ రియల్టర్‌ మర్డర్‌ కేసులో సంచలన విషయాలు..

ఈ ఘటనపై కొండాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు కారణం భార్యాభర్తల మధ్య విభేదాలు ఏమైనా ఉన్నాయా లేదా నిజంగానే గుండెపోటా.. అనే కోణంలో ఆలోచిస్తున్నారు.

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×