E-Paper
Advertisement

జిమ్ అవసరం లేకుండానే ఫిట్‌గా ఉండటం ఎలా?

జిమ్ అవసరం లేకుండానే ఫిట్‌గా ఉండటం ఎలా?
Advertisement

Workouts: ప్రస్తుత లైఫ్ స్టైల్‌లో శారీరక శ్రమ కరువవ్వడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. వ్యాయామం అంటే.. కేవలం జిమ్‌కు వెళ్లి బరువులు ఎత్తడం మాత్రమే కాదు. శరీరానికి కదలికను ఇచ్చే ఏ పనైనా వ్యాయామమే. ప్రతి రోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయడం వల్ల గుండె పని తీరు మెరుగుపడటమే కాకుండా.. మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది. చిన్న పాటి వాకింగ్, యోగా లేదా డ్యాన్స్ వంటివి మనల్ని రోజంతా ఉత్సాహంగా ఉంచుతాయి. ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం వ్యాయామాన్ని అలవాటుగా మార్చుకోవడం ఎంతో కీలకం.

శారీరక శ్రమ – ఆరోగ్యానికి అసలైన చిరునామా

1.గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది:
మనం వ్యాయామం చేసినప్పుడు గుండె వేగంగా కొట్టుకుంటుంది. దీని వల్ల రక్తప్రసరణ మెరుగు పడుతుంది. ఇది రక్త పోటును అదుపులో ఉంచుతుంది. అంతే కాకుండా కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేసే వారిలో గుండె పోటు వచ్చే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుందని అనేక పరిశోధనలు చెబుతున్నాయి.

Advertisement

2.మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం: 
వ్యాయామం చేసే సమయంలో మన మెదడు ‘ఎండార్ఫిన్లు’ అనే హ్యాపీ హార్మోన్లను విడుదల చేస్తుంది. ఇవి సహజంగానే మనల్ని సంతోషంగా ఉంచి, ఒత్తిడి, ఆందోళన, కుంగుబాటు నుంచి కాపాడతాయి. రోజంతా ఆఫీసు పనులతో అలసిపోయిన వారికి సాయంత్రం చేసే చిన్నపాటి వాకింగ్  గొప్ప ఉపశమనాన్ని ఇస్తుంది.

3.సులభమైన మార్గాలతో వ్యాయామం:
చాలా మంది వ్యాయామం అనగానే జిమ్ లో మెంబర్ షిప్ తీసుకోవాలని అనుకుంటారు. కానీ.. ఖర్చు లేకుండా ఇంట్లోనే లేదా ఇంటి దగ్గరే చేసే పనులు ఎన్నో ఉన్నాయి.

Advertisement

వాకింగ్:ఇది అత్యంత సులభమైన, బెస్ట్ వ్యాయామం.

యోగా:శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఏకాగ్రతను పెంచుతుంది.

డ్యాన్స్ :ఇది వినోదంతో కూడిన వ్యాయామం, దీని వల్ల కేలరీలు త్వరగా కరుగుతాయి.

Also Read: సమ్మర్ స్కిన్ కేర్.. జిడ్డు చర్మం, టాన్ పోగొట్టే.. బెస్ట్ ఫేస్ ప్యాక్స్

4.జీవనశైలిలో చిన్న మార్పులు – పెద్ద ఫలితాలు:
పెద్దగా సమయం కేటాయించలేని వారు తమ దైనందిన జీవితంలో కొన్ని మార్పులు చేసుకోవచ్చు. ఉదాహరణకు.. ఆఫీసులో లిఫ్ట్‌కు బదులుగా మెట్లు ఎక్కడం వల్ల కాళ్ళ కండరాలు దృఢంగా మారుతాయి. దగ్గరి దూరాలకు వాహనాలు వాడకుండా నడిచి వెళ్లడం, టీవీ చూస్తూ చిన్న పాటి స్ట్రెచింగ్స్ చేయడం వంటివి మీ జీవ క్రియను మెరుగు పరుస్తాయి.

5.రోగనిరోధక శక్తి పెంపు:
క్రమం తప్పకుండా శారీరక శ్రమ చేసేవారిలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల సీజనల్ వ్యాధులు, ఇన్ఫెక్షన్లు త్వరగా దరి చేరవు. అలాగే.. ఇది టైప్-2 మధుమేహం, కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

ఆరోగ్యమే మహా భాగ్యం. మనం ఎంత సంపాదించినా.. మన శరీరం సహకరించకపోతే..  సంపద వృధా అవుతుంది. కాబట్టి, బిజీ షెడ్యూల్‌లోనూ మీ ఆరోగ్యం కోసం ఒక 30 నిమిషాలు కేటాయించండి. అది మిమ్మల్ని శారీరకంగా బలంగా, మానసికంగా ప్రశాంతంగా ఉంచుతుంది.

Related News

LED ఫేస్ మాస్క్ ముఖంపై ముడతలు తగ్గిస్తుందని ప్రచారం.. నిజంగా పనిచేస్తుందా?

సండే స్పెషల్.. ఎప్పుడూ ఒకేలా కాకుండా మటన్‌ను ఇలా గ్రీన్‌గా వండి చూడండి.. వేళ్లు నాకేస్తారు!

అరకు ఫేమస్ బొంగు చికెన్.. తింటే జీవితంలో ఆ రుచిని మర్చిపోరు, ఎలా చేయాలో తెలుసా?

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

Big Stories

Advertisement
×