E-Paper
Advertisement

సమ్మర్ స్కిన్ కేర్.. జిడ్డు చర్మం, టాన్ పోగొట్టే.. బెస్ట్ ఫేస్ ప్యాక్స్

సమ్మర్ స్కిన్ కేర్.. జిడ్డు చర్మం, టాన్ పోగొట్టే.. బెస్ట్ ఫేస్ ప్యాక్స్
Advertisement

Summer Face Masks: సమ్మర్ రాగానే భానుడి ప్రతాపం వల్ల చర్మం తన సహజత్వాన్ని కోల్పోతుంది. అధిక చెమట, ధూళి, సూర్యరశ్మి వల్ల చర్మంపై నల్లని మచ్చలు , మొటిమలు, జిడ్డు పేరుకుపోతాయి. పార్లర్లకు వెళ్లి వేల రూపాయలు ఖర్చు చేసేకంటే.. మన ఇంట్లో దొరికే సహజ సిద్ధమైన పదార్థాలతో చర్మాన్ని కాపాడుకోవచ్చు. చర్మాన్ని చల్లబరిచి, మృదువుగా మార్చే రెండు అత్యుత్తమ ఫేస్ మాస్క్‌లు,వాటి ఉపయోగాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

వేసవిలో స్కిన్ కేర్ అనేది ఒక సవాలుతో కూడుకున్న పని. అయితే ప్రకృతి ప్రసాదించిన కొన్ని పదార్థాలతో మనం ఈ సమస్యను సులభంగా అధిగమించవచ్చు. వేసవికి తగిన 2 బెస్ట్ ఫేస్ మాస్క్‌లు ఇవే..

Advertisement

1. ముల్తానీ మట్టి , రోజ్ వాటర్ మాస్క్:
వేసవిలో జిడ్డు చర్మం ఉన్నవారికి ముల్తానీ మట్టి ఒక వరం లాంటిది. ఇది చర్మంలోని అదనపు నూనెను పీల్చుకుని, రంధ్రాలను శుభ్రపరుస్తుంది.

కావాల్సినవి:

Advertisement

2 స్పూన్ల ముల్తానీ మట్టి

తగినంత రోజ్ వాటర్

చిటికెడు పసుపు

తయారీ విధానం: ఒక గిన్నెలో ముల్తానీ మట్టి తీసుకుని.. అందులో రోజ్ వాటర్ కలిపి మెత్తని పేస్ట్‌లా చేయాలి.

ఎలా వాడాలి: ఈ ప్యాక్‌ను ముఖానికి, మెడకు పట్టించి 15-20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. పూర్తిగా ఆరిపోయిన తర్వాత చల్లని నీటితో కడిగేయాలి.

లాభాలు: ఇది చర్మాన్ని చల్లబరుస్తుంది, మొటిమలను తగ్గిస్తుంది. అంతే కాకుండా తక్షణ కాంతిని ఇస్తుంది.

2. అలోవెరా ,దోసకాయ ఫేస్ మాస్క్:
చర్మం ఎండ వల్ల ఎర్రబడినా లేదా మంటగా అనిపించినా , ఈ మాస్క్ అద్భుతంగా పని చేస్తుంది. ఇది చర్మానికి కావాల్సిన తేమను అందిస్తుంది.

కావాల్సినవి:

2 స్పూన్ల తాజా అలోవెరా జెల్

1 స్పూన్ దోసకాయ రసం

కొన్ని చుక్కల నిమ్మరసం

తయారీ విధానం: దోసకాయను తురిమి జ్యూస్ తీయాలి. అందులో అలోవెరా జెల్ కలిపి బాగా మిక్స్ చేయాలి.

ఎలా వాడాలి: ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి వృత్తాకారంలో 5 నిమిషాలు మసాజ్ చేయాలి. 15 నిమిషాల తర్వాత వాష్ చేసుకోవాలి.

లాభాలు: ఇది చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. ఎండ వల్ల వచ్చే నలుపును తొలగించి చర్మాన్ని రిఫ్రెష్‌గా ఉంచుతుంది.

ఈ రెండు మాస్క్‌లను వారానికి రెండు సార్లు వాడటం వల్ల వేసవిలో కూడా మీ చర్మం ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా ఉంటుంది. వీటితో పాటు రోజుకు కనీసం 3-4 లీటర్ల నీరు తాగడం, బయటకు వెళ్లేటప్పుడు సన్ స్క్రీన్ వాడటం మర్చిపోకండి.

Related News

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సాయం చేస్తారు.. ఈ తేదీల్లో పుట్టినవారు కష్టకాలంలో తోడుగా నిలుస్తారు

మరణం తర్వాత శరీరంలోని ఏ అవయవం ఎంతసేపు జీవించి ఉంటుంది? ఈ విషయాలు తెలుసా

జీవితంలో ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోరు, మోసపోరు.. చాణక్యుడు చెప్పిన ఈ నీతి సూత్రాలు పాటిస్తే

తక్కువ స్థలంలో కిచెన్ గార్డెన్‌.. ఇంట్లోనే కూరగాయలు పండించడం మరింత సులభం

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

పిల్లలు రాత్రి ఏ సమయం కల్లా నిద్రపోవాలి? టైమ్‌కు నిద్రపోకపోతే మెదడుపై ప్రభావం

రక్తపోటు పెరగడానికి మౌత్ వాష్ కూడా ఒక కారణమేనా.. తాజా రీసెర్చ్ ఏం చెబుతోంది?

Big Stories

Advertisement
×