E-Paper
Advertisement

Cucumber For Skin:ఫేస్ క్రీములు అవసరమే లేదు.. దోసకాయను ఇలా వాడితే చాలు

Cucumber For Skin:ఫేస్ క్రీములు అవసరమే లేదు.. దోసకాయను ఇలా వాడితే చాలు
Advertisement


Cucumber For Skin: దోసకాయ కేవలం వేసవిలో శరీరానికి చల్లదనాన్ని ఇవ్వడానికి మాత్రమే కాదు. చర్మ సౌందర్యాన్ని పెంచడంలో కూడా అద్భుతంగా పనిచేస్తుంది. దోసకాయలో దాదాపు 96% నీరు ఉంటుంది. ఇది చర్మాన్ని డీహైడ్రేట్ కాకుండా కాపాడుతుంది. అంతేకాకుండా.. ఇందులో విటమిన్ సి, కెఫిక్ ఆమ్లం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని శుభ్రపరుస్తాయి. అంతే కాకుండా కాంతివంతంగా మారుస్తాయి. ఇంతకీ గ్లోయింగ్ స్కిన్ కోసం దోసకాయను ఎలా వాడాలో తెలుకుందామా.. 

Advertisement

1. కళ్ళ కింద ఉంచడం:

దోసకాయ ముక్కలను ఫ్రిజ్‌లో చల్లార్చి.. వాటిని 10-15 నిమిషాలు కళ్ళపై ఉంచండి.

Advertisement

ప్రయోజనం: దీనిలోని శీతలీకరణ గుణాలు, యాంటీఆక్సిడెంట్లు కళ్ల వాపున తగ్గిస్తాయి. అంతే కాకుండా అలసటను పోగొడతాయి. డార్క్ సర్కిల్స్ తేలిక పరుస్తాయి.

2. దోసకాయ టోనర్ :

దోసకాయ రసం చర్మానికి సహజమైన టోనర్‌గా పనిచేస్తుంది. దోసకాయ రసాన్ని తీసి.. దానికి కొద్దిగా రోజ్ వాటర్ (పన్నీరు) కలపండి. ఈ మిశ్రమాన్ని దూది సాయంతో ముఖానికి అప్లై చేయండి.

ప్రయోజనం: ఇది చర్మ రంధ్రాలలో పేరుకుపోయిన మురికిని, అదనపు నూనెను తొలగించి.. ముఖ రంధ్రాలను బిగుతుగా చేస్తుంది.

3. దోసకాయ, పెరుగు ఫేస్ ప్యాక్ :

ఈ మాస్క్ చర్మానికి తేమను అందించి.. మృదువుగా చేస్తుంది. తురిమిన దోసకాయ, 1 చెంచా పెరుగు (పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది) కలిపి ముఖానికి ప్యాక్‌లా వేయండి. 15 నిమిషాల తర్వాత శుభ్రం చేయండి.

ప్రయోజనం: చర్మానికి పోషణ అందించి.. నిర్జీవమైన చర్మ కణాలను తొలగిస్తుంది. అంతే కాకుండా ఇది తక్షణ కాంతిని ఇస్తుంది.

4. దోసకాయ, నిమ్మరసం:

చర్మం రంగును మెరుగుపరచడానికి ఈ ప్యాక్ సహాయ పడుతుంది. దోసకాయ రసంలో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించండి. 10 నిమిషాల తర్వాత శుభ్రం చేయండి.

ప్రయోజనం: నిమ్మరసంలోని విటమిన్ సి, బ్లీచింగ్ గుణాలు నల్లటి మచ్చలు, ట్యాన్‌ను తగ్గించి, చర్మం రంగును తేలిక పరుస్తాయి. 

5. అలోవెరా, దోసకాయ జెల్ (మాయిశ్చరైజింగ్):

వేసవిలో లేదా ఎండ తగిలిన తర్వాత ఈ మిశ్రమం ఉత్తమ ఉపశమనాన్ని ఇస్తుంది. దోసకాయ రసాన్ని, సమాన పరిమాణంలో అలోవెరా జెల్‌తో (కలబంద గుజ్జు) కలిపి చర్మానికి మసాజ్ చేయండి.

ప్రయోజనం: సన్ బర్న్ నుంచి చర్మాన్ని ఉపశమనం చేస్తుంది. అంతే కాకుండా తేమను అందించి చర్మాన్ని చల్లగా, మృదువుగా ఉంచుతుంది.

6. దోసకాయ స్క్రబ్ (ఎక్స్‌ఫోలియేషన్):

నిర్జీవ కణాలను తొలగించడానికి దోసకాయ స్క్రబ్ చాలా బాగా ఉపయోగపడుతుంది.  తురిమిన దోసకాయ గుజ్జులో కొద్దిగా బియ్యప్పిండి లేదా చక్కెర కలిపి సున్నితంగా ముఖాన్ని స్క్రబ్ చేయండి.

ప్రయోజనం: చర్మంపై ఉన్న మృత కణాలను తొలగించి.. చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తుంది.

Also Read: చలికాలంలో చర్మాన్ని.. కాపాడుకోండిలా !

7. దోసకాయ ఐస్ క్యూబ్స్:

 దోసకాయ రసాన్ని ఐస్ ట్రేలలో పోసి గడ్డకట్టించండి. ఉదయం పూట ఈ ఐస్ క్యూబ్‌తో ముఖాన్ని మసాజ్ చేయండి.

ప్రయోజనం: చర్మం ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. అంతే కాకుండా రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. చర్మానికి కూడా తక్షణ కాంతిని ఇస్తుంది.

8. దోసకాయ, ఓట్‌మీల్ మాస్క్ (సెన్సిటివ్ స్కిన్ కోసం):

దోసకాయ గుజ్జును ఓట్‌మీల్ (యవలు పిండి) తో కలిపి మాస్క్‌లా వేయండి.

ప్రయోజనం: ఇది సున్నితమైన చర్మాన్ని శాంతపరుస్తుంది. అంతే కాకుండా ఎరుపుదనాన్ని తగ్గిస్తుంది. చర్మానికి మృదుత్వాన్ని ఇస్తుంది.

Related News

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

పెన్, డైరీ లాంటివి వద్దు.. టీచర్స్ డే రోజు రూ.500 లోపు బడ్జెట్‌లో స్పెషల్ గిఫ్ట్స్

చిన్న చిన్న విషయాలకే కోపం వస్తోందా? ప్రశాంతంగా ఉండడానికి రోజూ ఈ 5 టిప్స్ పాటించండి

మామిడి ఆకులు కేవలం ఇంట్లో తోరణాలు కట్టడానికి కాదు.. స్కిన్ కేర్ నుంచి ఎరువు తయారీ వరకు ఎన్ని ప్రయోజనాలు

అదృష్టాన్ని కాదు కష్టాన్ని నమ్ముకుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎన్ని కష్టాలొచ్చినా వెనకడుగు వేయరు

ఈ వీకెండ్‌ అలవాట్లు ఉన్నవారిలో క్యాన్సర్ ముప్పు.. అతిగా ఎంజాయ్ చేస్తే యమ డేంజర్

హెవీ ఇయర్‌రింగ్స్‌తో చెవి నొప్పి వస్తుందా? చెవి రంధ్రాలు సాగకుండా ఈ సింపుల్ ట్రిక్ పాటించండి

Big Stories

Advertisement
×