మొన్నటి వరకు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ గా ఉన్న సంజు శాంసన్ త్వరలోనే చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి రాబోతున్నాడట. ట్రేడింగ్ ప్రక్రియ ద్వారా సంజు శాంసన్ ను చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి సంజు శాంసన్ రాగా, రవీంద్ర జడేజాతో పాటు సామ్ కరణ్ రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి వెళ్తున్నారు. దీంతో చెన్నై జట్టులోకి సంజు శాంసన్ రావడం గ్యారెంటీ అయిపోయింది.
ఇలాంటి నేపథ్యంలోనే సంజు శాంసన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పింది చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం. నీకు మరింత శక్తి చేకూరాలి సంజు… ఇక నిన్ను ఎవడు ఆపేది లేడు, విషింగ్ యూ సూపర్ బర్త్ డే అంటూ చెన్నై సూపర్ కింగ్స్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. అయితే ఈ సందర్భంగా టీమిండియా జెర్సీలో ఉన్న సంజు శాంసన్ ఫోటోను షేర్ చేసింది. ఈ పోస్ట్ పెట్టడంతో సంజు శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి వెళ్లడం గ్యారంటీ అయిపోయిందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి సంజు శాంసన్ వస్తే, చాలా లాభాలే ఉంటాయి. ఫ్యూచర్ కెప్టెన్ గా సంజు శాంసన్ ను వాడుకోవచ్చు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. మరో సీజన్ తర్వాత మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ ఇచ్చే ఛాన్సులు ఉన్నాయి. అందుకే శాంసన్ ను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ధోని రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఫుల్ టైం వికెట్ కీపర్ గా సంజు శాంసన్ కొనసాగుతాడు. అలాగే అతని అదృష్టం బాగుంటే కెప్టెన్ కూడా అవుతాడు. వికెట్ కీపింగ్ చేయడంలో మహేంద్ర సింగ్ ధోనీ తర్వాత సంజు శాంసన్ అన్న రేంజ్ లో పరిస్థితి ఉంది. ఎలా చూసుకున్నా జడేజా కంటే సంజు శాంసన్ జట్టుకు చాలా ఉపయోగపడతాడు. అటు జడేజా మరో ఏడాది తర్వాత రిటైర్మెంట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. అందుకే తెలివిగా అతనిని తప్పించేశారు.
Also Read: IPL 2026: SRH నుంచి ట్రావిస్ హెడ్ ఔట్…రంగంలోకి రోహిత్ శర్మ..కావ్య పాప ప్లాన్ అదుర్స్ ?
More power to you, Sanju! Wishing you a super birthday! 🥳💛#WhistlePodu pic.twitter.com/f2lE6pWkPy
— Chennai Super Kings (@ChennaiIPL) November 11, 2025