Andhra Pradesh: అన్నమయ్య జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ తల్లి కొందరు యువకులకు సుపారీ ఇచ్చి కన్న కొడుకుని హత్య చేయించింది.. పెద్ద కొడుకు జయప్రకాష్ రెడ్డిని హత్య చేయడానికి సుపారి గ్యాంగ్‌తో ఆరు లక్షలకు ఒప్పందం చేసుకుంది తల్లి శ్యామలమ్మ. ఎంబీఏ రెండో సంవత్సరం చదువుతూ చదువు మానేసి, మద్యానికి బానిసై జులాయిగా తిరుగుతున్న జయప్రకాశ్ రెడ్డి ఆస్తి పంచాలని, మద్యం కోసం డబ్బులు ఇవ్వాలంటూ తల్లి శ్యామలను తరచుగా వేధించడంతో భరించలేక సుపారీ గ్యాంగ్‌తో కొడుకును హత్య చేయించింది.
అయితే వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా, బి.కొత్తకోట మండలం గోళ్ళతోపు పంచాయతీలోని గుడిసివారిపల్లి గ్రామానికి చెందిన దాదాపు 50 ఏళ్ల మహిళ టి. శ్యామలమ్మ తన పెద్ద కొడుకు జయప్రకాష్ రెడ్డిని హత్య చేయించడానికి సుపారీ గ్యాంగ్‌ను ఉపయోగించుకుంది. ఈ సంఘటన నవంబర్ 7న జరిగింది.
అయితే శ్యామలమ్మకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెద్దవాడు జయప్రకాశ్ రెడ్డి , మదనపల్లె సమీపంలోని అంగళ్ళులో ఎంబీఏ రెండో సంవత్సరం చదువుతున్నాడు. అయితే, చదువును వదిలేసి మద్యపానానికి బానిసై, జులాయిగా తిరిగే స్థితికి చేరుకున్నాడు. రెండో కొడుకు విజయవాడలో చదువుతున్నాడు. శ్యామలమ్మ పొలాల్లో కూలీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. జయప్రకాష్ రెడ్డి తన తల్లిని తరచూ వేధించేవాడు.. ఆస్తి పంచాలని, మద్యం కొనడానికి డబ్బులు ఇవ్వాలంటూ రోజూ ఇబ్బంది పెట్టేవాడు. ఈ వేదనలు భరించలేకపోయిన శ్యామలమ్మలో కసి పెరిగి, చివరికి కొడుకును హతమార్చాలని నిర్ణయించుకుంది. ఆమె పొలంలో పని చేసే ఏ. మహేష్ అనే యువకుడిని సంప్రదించి, సుపారీ గ్యాంగ్‌ను ఏర్పాటు చేయించింది.
ఆ తర్వాత శ్యామలమ్మ మొత్తం రూ. 6 లక్షలకు సుపారీ ఇచ్చింది. అడ్వాన్స్‌గా రూ. 50 వేలు మహేష్‌కు చెల్లించింది. మహేష్ పెద్దతిప్ప సముద్రంకు చెందినవాడు. అతడు ములకల చెరువు, పెద్దతిప్పసముద్రం ప్రాంతాల నుంచి మరో ఆరుగురు యువకులను ఏర్పాటు చేశాడు. ఈ గ్యాంగ్ నవంబర్ 7న ముంబై-చెన్నై జాతీయ రహదారిపై గొళ్ళపల్లి బ్రాందీ షాప్ వద్ద జయప్రకాష్ రెడ్డిని ఆక్రమించింది. అతడిని దారుణంగా దాడి చేసి, మట్టుపెట్టి చంపేశారు. డెడ్ బాడీ రోడ్డు మీద పడి ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
Also Read: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న ప్రముఖ నేతలు, సీని ప్రముఖులు
అన్నమయ్య జిల్లా పోలీసులు ఈ కేసును ‘హత్య’గా నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, డీఎస్పీ మహీంద్ర ఆదేశాల మేరకు క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌ను ఉపయోగించారు. ఘటనాస్థలం నుంచి మారణాయుధాలు, వాహనాలు సీజ్ చేశారు. డెడ్ బాడీ నుంచి వెళ్లిన ఒక్క ఫోన్ కాల్ కీలక ఆధారంగా మారింది. టెక్నికల్ ఎవిడెన్స్‌తో విచారణలు జరిపిన పోలీసులు, రెండు రోజుల్లోనే కేసును ఛేదించారు. తల్లి శ్యామలమ్మ ప్రధాన నిందితురాలిగా తేలింది. మొత్తం తొమ్మిది మందిని అరెస్టు చేశారు. నిందితులను కొత్తకోట పోలీస్ స్టేషన్‌లో విచారిస్తున్నారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సుపారీ ఇచ్చి మరీ కొడుకుని హత్య చేయించిన తల్లి
అన్నమయ్య జిల్లాలో దారుణ ఘటన
పెద్ద కొడుకు జయప్రకాశ్ రెడ్డిని హత్య చేయడానికి సుపారీ గ్యాంగ్‌తో 6 లక్షలకు తల్లి శ్యామలమ్మ ఒప్పందం
పోలీసులు అదుపులో తల్లి, మరో 8మంది నిందితులు
ఆస్తి పంచాలని, మద్యానికి డబ్బులివ్వాలని వేధిస్తుండడంతో హత్య pic.twitter.com/ZvYtuSLJfM
— BIG TV Breaking News (@bigtvtelugu) November 11, 2025