E-Paper
Advertisement

Home Exercises: తక్కువ టైంలో ఎక్కువ క్యాలరీలు ఖర్చు అవ్వాలా ? ఇలా చేస్తే బెస్ట్ రిజల్ట్

Home Exercises: తక్కువ టైంలో ఎక్కువ క్యాలరీలు ఖర్చు అవ్వాలా ? ఇలా చేస్తే బెస్ట్ రిజల్ట్
Advertisement

Home Exercises: బరువు తగ్గాలనుకునే వారికి లేదా ఫిట్‌నెస్‌పై ఆసక్తి ఉన్నవారికి జిమ్‌కు వెళ్లడం తరచూ సాధ్యం కాకపోవచ్చు. అయితే.. ఎలాంటి పరికరాలు లేకుండా కేవలం ఇంట్లోనే ఉంటూ తక్కువ సమయంలో ఎక్కువ క్యాలరీలను ఖర్చు చేసే అద్భుతమైన వ్యాయామాలు కూడా కొన్ని ఉన్నాయి. వీటి ద్వారా క్యాలరీలు ఈజీగా తగ్గించుకోవచ్చు. బరువు తగ్గాలని అనుకునే వారు తరచుగా వ్యాయామం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇంతకీ క్యాలరీలు తగ్గాలంటే ఎలాంటి వ్యాయామాలు చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..

Advertisement

అధిక క్యాలరీలను తగ్గించే 8 వ్యాయామాలు :

1. బర్పీస్: క్యాలరీలను కరిగించడంలో ఇది ‘రాజా’ వంటిది. ఇది మీ మొత్తం శరీరాన్ని (కాళ్లు, ఛాతీ, కోర్, భుజాలు) ఉపయోగిస్తుంది. కేవలం 10 నిమిషాల బర్పీస్ దాదాపు 100 నుంచి 150 క్యాలరీలను ఖర్చు చేస్తుంది. ఇది మీ గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది.అంతే కాకుండా బెల్లీ ఫ్యాట్ ను తగ్గించి ఆరోగ్యంగా ఉండటానికి కూడా ఉపయోగపడుతుంది.

Advertisement

2. జంపింగ్ జాక్స్:  ఇది చిన్నప్పుడు మనం చేసే సాధారణ వ్యాయామంలా అనిపించినా.. అద్భుతమైన కార్డియో వ్యాయామం. ఇది శరీరంలోని అన్ని కండరాలను కదిలిస్తుంది. దీని ద్వారా నిమిషానికి సుమారు 8 నుంచి 12 క్యాలరీలను ఖర్చు చేయవచ్చు. జంపిక్స్ జాక్స్ కాళ్లకు  కూడా చాలా బాగా మేలు చేస్తుంది.

3. మౌంటైన్ క్లైంబర్స్: నేలపై ప్లాంక్ పొజిషన్‌లో ఉండి, పరిగెడుతున్నట్లుగా కాళ్లను మార్చడం వల్ల పొట్ట దగ్గర ఉన్న కొవ్వు త్వరగా కరుగుతుంది. ఇది కోర్ బలాన్ని పెంచడమే కాకుండా.. మెటబాలిజం రేటును వేగవంతం చేస్తుంది. ఫలితంగా బెల్లీ ఫ్యాట్ ఈజీగా తగ్గుతుంది.

4. స్క్వాట్స్ :  కాళ్లు, పిరుదుల కండరాలను దృఢంగా ఉంచడానికి స్క్వాట్స్ ఉత్తమం. పెద్ద కండరాలపై పని చేయడం వల్ల ఎక్కువ శక్తి ఖర్చవుతుంది. దీని వల్ల శరీర కింది భాగం దృఢంగా మారుతుంది. అంతే కాకుండా శరీర ఆకృతి కూడా మెరుగుపడుతుంది.

5. హై నీస్:  ఒకే చోట నిలబడి మోకాళ్లను నడుము ఎత్తు వరకు పైకి లేపుతూ వేగంగా పరిగెత్తడంహై నీస్ అని పిలుస్తారు . ఇది గుండె కొట్టుకునే వేగాన్ని పెంచి, తక్కువ సమయంలో ఎక్కువ క్యాలరీలను దహనం చేస్తుంది.

6. పుష్-అప్స్ :  శరీర పైభాగాన్ని దృఢపరచడానికి ఇది ప్రాథమిక వ్యాయామం. ఛాతీ, భుజాలు, ట్రైసెప్స్ కండరాలకు మంచి వ్యాయామం లభిస్తుంది. కండరాలు పెరిగే కొద్దీ విశ్రాంతి సమయంలో కూడా క్యాలరీలు ఖర్చవుతాయి.ఫుష్ అప్స్ వల్ల కూడా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.

7. లంజెస్‌ :  ముందుకు అడుగు వేస్తూ మోకాళ్లను వంచడం ద్వారా చేసే ఈ వ్యాయామం సమతుల్యతను మెరుగు పరుస్తుంది. ఇది కాళ్లు , హిప్ కండరాలను టోన్ చేస్తుంది. మీరు చేతుల్లో వాటర్ బాటిల్స్ పట్టుకుని చేస్తే ఫలితం ఇంకా ఎక్కువగా ఉంటుంది.

8. ప్లాంక్:  ఇది కదలకుండా చేసే వ్యాయామం అయినప్పటికీ.. శరీరంలోని ప్రతి కండరాన్ని ఒత్తిడికి గురి చేస్తుంది. ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ (పొట్ట కొవ్వు) తగ్గించాలనుకునే వారికి ఇది వరం. ఇది వెన్నునొప్పిని తగ్గించడానికి కూడా సహాయ పడుతుంది. తక్కువ సమయంలో ఎక్కువ క్యాలరీలను కరిగించడంలో కూడా ఇది అద్భుత ప్రయోజనాలను అందిస్తుంది.

Also Read: ఎగ్స్‌తో కలిపి పొరపాటున కూడా ఇవి తినొద్దు !

కొన్ని ముఖ్యమైన సూచనలు:

వార్మ్-అప్: వ్యాయామం ప్రారంభించే ముందు 5 నిమిషాల పాటు వార్మ్-అప్ చేయడం వల్ల గాయాలు కాకుండా చూసుకోవచ్చు.

నీరు: వ్యాయామం చేసే సమయంలో , తరువాత తగినంత నీరు తాగాలి.

క్రమం తప్పకుండా.. వారానికి కనీసం 4 నుంచి 5 రోజులు ఈ వ్యాయామాలు చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.

ఆహారం: వ్యాయామంతో పాటు సరైన పోషకాహారం తీసుకుంటేనే బరువు తగ్గడం సాధ్యమవుతుంది.

ముగింపులో.. క్యాలరీలు దహనం చేయడం అనేది మీరు ఎంత తీవ్రతతో వ్యాయామం చేస్తున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది. పైన పేర్కొన్న వ్యాయామాలను ‘HIIT’ (High-Intensity Interval Training) పద్ధతిలో అంటే.. 40 సెకన్లు వ్యాయామం, 20 సెకన్లు విశ్రాంతి తీసుకోవడం ద్వారా చేస్తే ఎక్కువ ప్రయోజనాలను పొందవచ్చు.

Related News

ఘాటు ఘాటుగా మష్రూమ్ పెప్పర్ ఫ్రై.. ఒక్కసారి ఇలా ట్రై చేస్తే టేస్ట్ అద్భుతం!

వంట రాని వాళ్లు కూడా నిమిషాల్లో చేసేయగల సూపర్ టేస్టీ పన్నీర్ భుర్జీ రెసిపీ!

థీమ్ పార్కుకు వెళుతున్నారా? జాగ్రత్త రోలర్ కోస్టర్ రైడ్స్‌తో మెదడుకు ప్రమాదం

పిల్లలు వద్దనుకోవడం స్వార్థమా? సమాజం చేసే విమర్శలకు సమాధానమిదే

భార్యా, తల్లా.. ఇద్దరి మధ్య నలిగిపోకుండా భర్త ఏం చేయాలి?

పిల్లల ఆరోగ్యంతో చెలగాటం వద్దు.. బేబీ ఫుడ్‌లో చక్కెరపై FSSAI కీలక ఆదేశాలు!

ఈ 3 అలవాట్లే మంచి మనుషుల బలహీనతలు.. మీరూ ఇవే తప్పులు చేస్తున్నారా?

LED ఫేస్ మాస్క్ ముఖంపై ముడతలు తగ్గిస్తుందని ప్రచారం.. నిజంగా పనిచేస్తుందా?

Big Stories

Advertisement
×