E-Paper
Advertisement

మద్యం తాగడం మానేస్తే మీ శరీరంలో వచ్చే మార్పులు ఇవే.. మీ మెదడుపై తీవ్ర ప్రభావం

మద్యం తాగడం మానేస్తే మీ శరీరంలో వచ్చే మార్పులు ఇవే.. మీ మెదడుపై తీవ్ర ప్రభావం
Advertisement

Effects of quitting alcohol| ఈ రోజుల్లో మద్యం తాగడం చాలా సాధారణం విషయమైపోయింది. చాలా మంది యువకులు, ఉద్యోగులు రోజూ మద్యం తాగుతుంటారు. అయితే వీరిలో కొంత మంది చిన్న మోతాదు మద్యం సేవించడం హాని చేయదని అనుకుంటారు. కానీ ఎక్కువసేపు తాగడం వల్ల శరీరం, మెదడు దెబ్బతింటాయి. మద్యం చిన్న మోతాదులో తీసుకున్నా.. వ్యసనంగా మారితే గుండె, కాలేయం, మెదడుకు హాని చేస్తుంది. అందుకే చాలా మంది ఆరోగ్యకరమైన జీవనం కోసం మద్యం తాగడం మానేయాలని నిర్ణయిస్తారు. మానేసిన తర్వాత శారీరకంగా, మానసికంగా అనేక మార్పులు వస్తాయి.

మానేసిన తరువాత మొదటి 24 నుంచి 72 గంటలు

మద్యం అలవాటు మానేసిన తరువాత మొదటి రెండు-మూడు రోజులు చాలా కష్టంగా ఉంటుంది. ఈ సమయంలో క్రమంగా శరీరం నుంచి విష పదార్థాలు, మలినాలు బయటకు వస్తాయి. ఆందోళన, అస్థిరత, చిరాకు, మూడ్ స్వింగ్స్ వస్తాయి. నిద్ర సరిగా పట్టదు. చెమట, తలనొప్పి, వికారం, చేతులు వణుకు వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇవి శరీరం మద్యం లేకుండా సర్దుకోవడం వల్ల వస్తాయి. కొన్ని రోజుల్లో ఈ లక్షణాలు తగ్గుతాయి.

ఒక వారం తర్వాత మార్పులు

Advertisement

మద్యం మానేసిన ఒక వారం తర్వాత శరీరం కొంత స్థిరపడుతుంది. నిద్ర నాణ్యత మెరుగవుతుంది. గాఢ నిద్ర వస్తుంది. చర్మం మెరుగ్గా కనిపిస్తుంది. కళ్ల కింద ఉండే నల్లటి మచ్చలు తగ్గుతాయి. ఎనర్జీ లెవెల్స్ క్రమంగా పెరుగుతుంది. రోజంతా చురుకుగా ఉంటారు. ఈ చిన్న మార్పులు మద్యం మానేయడానికి ప్రోత్సాహం ఇస్తాయి.

రెండు నుంచి నాలుగు వారాల తర్వాత

మద్యం తాగడం వల్ల దెబ్బతిన్న కాలేయం రెండు వారాలు మద్యం తాగడం మానేస్తే క్రమంగా నయం కావడం మొదలవుతుంది. కాలేయంలో కొవ్వు తగ్గుతుంది. జీర్ణక్రియ మెరుగవుతుంది. మద్యంలో ఉండే అదనపు క్యాలరీలు తగ్గడం వల్ల పొట్ట కొవ్వు తగ్గుతుంది. మెదడు పనితీరు మెరుగవుతుంది. మద్యం వల్ల మెదడుపై బ్రెయిన్ ఫాగ్ సమస్య వస్తుంది. ఈ అలవాటు మానేయగానే బ్రెయిన్ ఫాగ్ సమస్య తగ్గి, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి.

ఒక్క నెల నుంచి మూడు నెలల తర్వాత

Advertisement

రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. మద్యం ప్రభావం వల్ల తరచుగా అనారోగ్యం చేస్తూ ఉంటుంది. ఈ సమస్య కూడా మద్యం మానేయగానే ఉండదు. రక్తపోటు తగ్గుతుంది. గుండె సమస్యలు వచ్చే అవకాశం తగ్గుతుంది. శారీరక, మానసిక శక్తి ఎక్కువ అవుతుంది. మూడ్ స్థిరంగా ఉంటుంది. సంతోషం, సమతుల్యత పెరుగుతాయి.

Also Read: మీ పిల్లాడు గుంపులో తప్పిపోయినా సురక్షితంగా తిరిగి వస్తాడు.. తల్లిదండ్రులు ఈ జాగ్రత్తలు పాటించాలి

మద్యం మానేయడం ఎందుకు ముఖ్యం?

మద్యం మానేయడం వల్ల అనేక దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉన్నాయి. అవయవాలు స్వయంగా నయం అవుతాయి. నిద్ర, మూడ్, జీర్ణక్రియ మెరుగవుతాయి. తీవ్రమైన వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. మొదట్లో కష్టం అనిపించినా, ఆ తరువాత ఫలితాలు బాగుంటాయి.

కాలేయం, రోగనిరోధక శక్తి, మెదడుకు మద్యం హాని చేస్తుంది. మానేసిన తర్వాత దశలవారీగా సానుకూల మార్పులు వస్తాయి. ముందుగా కొన్ని రోజులు కష్టంగా ఉన్నా అవి తాత్కాలికమే. కాలక్రమేణా ఆరోగ్యం బాగా మెరుగవుతుంది. ఈ మార్పులు అర్థం చేసుకుంటే మద్యం మానడం సులభం అవుతుంది. ఆరోగ్యకరమైన జీవితం మంచి నిర్ణయాలతో మొదలవుతుంది.

Related News

వయసు మీరుతున్నా ప్రేమలో మాత్రం ఫ్రెష్‌ ఫీలింగ్.. ఈ తేదీల్లో పుట్టినవారు గ్యారంటీ లవర్స్

రోజూ పకోడీలు తిని బోర్ కొడుతోందా? పచ్చి బొప్పాయితో క్రిస్పీ కట్లెట్స్ ట్రై చేయండి

కృష్ణాష్టమికి మీ పాపను రాధమ్మగా ముస్తాబు చేయాలా? ఫొటోషూట్ అందంగా చేయడానికి టిప్స్

మహిళల్లో ఎముకల బలహీనత సమస్య.. మెనోపాజ్‌కు ముందే బలమైన ఎముకల కోసం ఏం చేయాలి?

డైటింగ్ చేయాలంటే వెనుకడుగు వేస్తున్న పురుషులు.. తాజా అధ్యయనంలో తేలిన కారణాలివే

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

పెన్, డైరీ లాంటివి వద్దు.. టీచర్స్ డే రోజు రూ.500 లోపు బడ్జెట్‌లో స్పెషల్ గిఫ్ట్స్

Big Stories

Advertisement
×