E-Paper
Advertisement

ఢిల్లీకి తెలంగాణ కాంగ్రెస్ నేతలు, సీడబ్ల్యూసీ సమావేశాలకు హాజరు.. వాటిపై ప్రధానంగా చర్చించే అవకాశం

ఢిల్లీకి తెలంగాణ కాంగ్రెస్ నేతలు, సీడబ్ల్యూసీ సమావేశాలకు హాజరు.. వాటిపై ప్రధానంగా చర్చించే అవకాశం
Advertisement

Delhi: హస్తినకు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు బయలుదేరారు. శుక్రవారం మద్యాహ్నం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. అందులోని సభ్యులంతా హాజరవుతున్నారు. వారిలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్, రామోదర్ రాజనర్సింహా, పీసీసీ ఛీఫ్ మహేష్ కుమార్ ఉన్నారు.

ఢిల్లీకి తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. సీడబ్ల్యూసీ సమావేశాలకు హాజరు

Advertisement

కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శుక్రవారం సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఉదయం న్యూఢిల్లీకి వెళ్తున్నారు. ఆయనతోపాటు మంత్రులు ఉత్తమ్ కుమార్, దామోదర్ రాజనర్సింహా, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ వెళ్లనున్నారు. ఈ సమావేశాలకు దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరవుతున్నారు.

కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శుక్రవారం సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఉదయం న్యూఢిల్లీకి వెళ్తున్నారు. ఆయనతోపాటు మంత్రులు ఉత్తమ్ కుమార్, దామోదర్ రాజనర్సింహా, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ వెళ్లనున్నారు.

Advertisement

సీఎం రేవంత్‌తోపాటు ఉత్తమ్, పీసీసీ చీఫ్ కూడా

ఈనెల 16న పార్లమెంటు ఉభయసభలకు మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లులు రానున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే మోదీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కావడం భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు అంశాలపై వివిధ రాష్ట్రాల నేతల నుంచి సమాచారం తీసుకోనుంది కాంగ్రెస్ పార్టీ.

ఆ తర్వాత ఏ విధంగా ముందుకు అడుగులు వేయాలన్నది ఆలోచన చేయనుంది. ఇదే సమయంలో గురువారం జరిగిన మూడు రాష్ట్రాల ఎన్నికల పోలింగ్ సరళి గురించి ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. అంతేకాదు 2029 ఎన్నికలకు ఇప్పటి నుంచే రాష్ట్రాల నేతలకు పార్టీ హైకమాండ్ కీలక సూచనలు చేయనున్నట్లు సమాచారం.

ALSO READ: కాళేశ్వరం బ్యారేజీలకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తులు చేయండి.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

దీంతోపాటు తెలంగాణలోని రాజకీయ పరిస్థితి, ప్రభుత్వ పథకాల అమలు, పార్టీని బలోపేతం చర్యలతోపాటు పలు అంశాలపై సీడబ్ల్యూసీ చర్చించే అవకాశం ఉంది. తెలంగాణలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 28 నెలలు పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో హామీల అమలు, అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై సీఎం రేవంత్ రెడ్డి పార్టీ హైకమాండ్‌కు వివరించనున్నారు.

ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీపై చర్చలు జరపవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. శుక్రవారం సాయంత్రం సీఎం రేవంత్.. ఏఐసీసీ సీనియర్ నాయకులు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీలతో ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశం ఉంది.

Related News

హైదరాబాద్ MVSR కాలేజీ దాండియా వేడుకల్లో ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి!

క్యూనెట్ రూ.10,000 కోట్ల కుంభకోణం.. మరో కీలక నిందుతుడు అరెస్ట్?

వాహన ఫిట్‌నెస్ టెస్ట్ విధానంలో.. తెలంగాణ సర్కార్ కీలక మార్పులు..?

మూసీ తరహాలోనే హుస్సేన్ సాగర్ ప్రక్షాళన.. సర్కార్ సంచలన నిర్ణయం!

తెలంగాణ ప్రభుత్వ ఆఫీసుల్లో.. ఏసీల వాడకం పై కొత్త రూల్స్ ఇవే..?

విద్యాసంస్థల్లో దాడులా.. కాంగ్రెస్ అనుబంధ సంఘాలకు పీసీసీ మాస్ వార్నింగ్!

గత ఏడాది కంటే భారీగా పెరిగిన విద్యుత్ వాడకం.. ఓక్కరోజులోనే ఇంత వాడేసారా..?

తెలంగాణ నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. రానున్న 2, 3 రోజుల్లో నోటిఫికేషన్!

Big Stories

Advertisement
×