Anti ageing Foods| వయసు పెరిగేకొద్దీ శరీరంలో కొలాజెన్ ఉత్పత్తి తగ్గుతుంది. కొలాజెన్ చర్మాన్ని టైట్‌గా, మృదువుగా ఉంచుతుంది. ఈ కొరత వల్ల ముడతలు, చర్మం వేలాడడం వంటి సమస్యలు వస్తాయి. ఫ్రీ రాడికల్స్ కూడా చర్మ కణాలను దెబ్బతీస్తాయి. సరైన ఆహారం ఈ సమస్యలను ఎదుర్కోవడానికి సహాయపడుతుంది.
బెర్రీలు, నారింజ, స్ట్రాబెర్రీ వంటి పండ్లలో యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌ను ఎదుర్కొంటాయి. ఈ పండ్లలో ‘విటమిన్ సి’ ఎక్కువగా ఉండటం వల్ల కొలాజెన్ ఉత్పత్తి పెరిగి చర్మం టైట్‌గా, యవ్వనంగా ఉంటుంది.
పాలకూర, ఆకు కూరలు విటమిన్లు, మినరల్స్‌తో నిండి ఉంటాయి. ఇవి చర్మాన్ని డ్యామేజ్ కాకుండా రక్షిస్తాయి పైగా సహజంగా చర్మంలో తేమ అందిస్తాయి.
బాదం, వాల్‌నట్స్, ఫ్లాక్స్ సీడ్స్ ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ ఈతో నిండి ఉంటాయి. ఇవి చర్మం పొడిబారకుండా చూస్తాయి.
సాల్మన్, మాకరెల్ వంటి చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మాన్ని మృదువుగా, తేమతో నిండుగా ఉంచి, శరీరంలో వాపును తగ్గిస్తాయి.
గోధుమ, జొన్న, రాగి వంటి హోల్ గ్రెయిన్స్ ఫైబర్ వంటి పోషకాలు అందిస్తాయి. మంచి జీర్ణక్రియ వల్ల చర్మం కూడా స్పష్టంగా, ఆరోగ్యంగా ఉంటుంది.
అవకాడో ఒక సూపర్ ఫ్రూట్. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లతో నిండి ఉంటుంది. వీటితో చర్మం సాగేగుణం కోల్పోకుండా ఉంటుంది. పైగా చర్మానికి తేమ అందిస్తుంది.
టమాటాల్లో లైకోపీన్ అనే పవర్‌ఫుల్ యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది ఎండ నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. పైగా చర్మ ఆకృతిని మెరుగుపరుస్తుంది.
ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలు మానండి. ఇవి శరీరంలో వాపును పెంచి, కొలాజెన్‌ను త్వరగా దెబ్బతీస్తాయి. దీని వల్ల ముడతలు ముందుగానే వస్తాయి.
Also Read: సినిమా స్టార్‌లాగా మీ పెళ్లి కూడా.. దేశంలోని ఈ ప్రాంతాల్లో తక్కువ బడ్జెట్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్
ఖరీదైన క్రీములు లేదా ట్రీట్‌మెంట్లు అవసరం లేకుండానే, ఆహారంలో చిన్న మార్పులు చేస్తే ముడతలు తగ్గి చర్మం యవ్వనంగా ఉంటుంది. పోషకాలు అధికంగా ఉండే ఆహారాలు తినడం వల్ల చర్మం సహజంగా మెరుస్తుంది. ఆరోగ్యకరమైన జీవనశైలి అనుసరిస్తే చర్మం ఎక్కువ కాలం తాజాగా, ప్రకాశవంతంగా ఉంటుంది.