E-Paper
Advertisement

ఇస్లామాబాద్‌లో ఇరాన్-అమెరికా శాంతి చర్చలు.. చెడువార్త.. అమెరికా వెళ్తున్నాం- జేడీవాన్స్ ప్రకటన

ఇస్లామాబాద్‌లో ఇరాన్-అమెరికా శాంతి చర్చలు.. చెడువార్త.. అమెరికా వెళ్తున్నాం- జేడీవాన్స్  ప్రకటన
Advertisement

Islamabad: పశ్చిమాసియా‌లో శాంతిని నెలకొల్పడం లక్ష్యంగా అమెరికా-ఇరాన్‌ల మధ్య చర్చలు శనివారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించలేదు. దీంతో ఆదివారం మరో విడత చర్చించే అవకాశమున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అసలు తొలిరోజు ఏయే అంశాలపై చర్చలు జరిగాయి?

ఇస్లామాబాద్‌లో ముగిసిన ఇరాన్-అమెరికా శాంతి చర్చలు

Advertisement

ఇస్లామాబాద్ వేదికగా శనివారం నుంచి ఇరాన్-అమెరికా మధ్య శాంతి చర్చలు మొదలయ్యాయి. తొలిరోజు ఈ రెండు దేశాల మధ్య చర్చలు కొలిక్కిరాలేదు. ఒకవిధంగా చెప్పాలంటే ప్రతిష్టంభన కొనసాగుతోంది. వారు డిమాండ్లకు ఇరు దేశాలు అంగీకరించలేదు. చర్చల తర్వాత మీడియా ముందుకొచ్చారు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్.

అర్థాంతరంగా చర్చల ముగించి తిరిగి వెళ్లిపోయింది అమెరికా. మా నిబంధనలు అంగీకరించేందుకు ఇరాన్ సిద్ధపడలేదని జేడీ వాన్స్ ప్రకటన చేశారు. ఇరాన్ వైపు నుంచి సానుకూల నిబద్ధత కనిపించాలన్నారు. ఎలాంటి అంగీకారం లేకుండా వెనక్కి వెళ్తున్నట్లు తెలిపారు. యుద్ధాన్ని ముగించేందుకు వాషింగ్టన్ విధించిన షరతులను టెహ్రాన్ అంగీకరించడానికి నిరాకరించిందన్నారు.

Advertisement

చెడువార్త, అమెరికా తిరిగి వెళ్తున్నామని జేడీవాన్స్ ప్రకటన

అమెరికా-ఇరాన్‌ల మధ్య చర్చలు విఫలమయ్యాయని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అన్నారు. ఇరాన్ తమ షరతులను అంగీకరించకపోతే జేడీ వాన్స్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం తిరిగి వాషింగ్టన్‌కు వెళ్లనుంది.   రాబోయే రోజుల్లో ఇరాన్ అణ్వాయుధాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నించకూడదని అమెరికా ఒక స్పష్టమైన హామీని కోరిందన్నారు. ఈ విషయం అమెరికా కంటే ఇరాన్‌కు చెడువార్తగా వర్ణించారు.

ఈ విషయంలో పాకిస్థాన్ అద్భుతమైన పనితీరు కనబరిచిందన్నారు. చర్చల్లో ఏమైనా లోపాలుంటే అవి పాకిస్థాన్ వల్ల కలిగినవి కావన్నారు. అమెరికా-ఇరాన్ మధ్య అంతరం తగ్గించేందుకు పాకిస్థాన్ చేయాల్సిన ప్రయత్నాలు చేసిందన్నారు. ఇరుదేశాల ఒప్పందం విషయంలో సహాయపడిందన్నారు. ఇరాన్ ప్రతినిధులతో దాదాపు 21 గంటలపాటు చర్చలు జరిపామన్నారు.

ALSO READ: ట్రంప్‌ కీలక ప్రకటన.. హర్మూజ్‌ జలసంధి క్లీనింగ్ మొదలు, ఏం జరిగింది? 

ఇరాన్ అణు కార్యక్రమం, అందుకు సంబంధించిన మౌళిక సౌకర్యాలు ధ్వంసం చేశామన్నారు. కానీ అణ్వాయుధాలను అభివృద్ధి చేయబోమని హామీ ఇవ్వలేదన్నారు.  ఈ చర్చల ఫలితం ఎలా ఉన్నా అమెరికా గెలిచిందంటూ ట్రంప్ ప్రకటన చేసిన కొన్నిగంటల తర్వాత వాన్స్ ఈ ప్రకటన చేశారు. ఇరాన్‌ను తాము పూర్తిగా ఓడించామని, బహుశా వారు ఒప్పందం చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చని ట్రంప్ అన్నారు. అమెరికా దృక్కోణం నుండి తనకు ఎలాంటి సంబంధం లేదని, టెహ్రాన్‌ను సైనికపరంగా ఓడించిందన్నారు.

 

 

Related News

పెరులో వరుస భూకంపాలు.. ఆరుగురు మృతి, వందలాది మంది నిరాశ్రయులు

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

Big Stories

Advertisement
×