E-Paper
Advertisement

Anxiety Relief Tips: ఇన్‌స్టంట్ రిలాక్సేషన్.. 2 నిమిషాల్లో యాంగ్జైటీ నుంచి రిలీఫ్ అవ్వడం ఎలా?

Anxiety Relief Tips: ఇన్‌స్టంట్ రిలాక్సేషన్.. 2 నిమిషాల్లో యాంగ్జైటీ నుంచి రిలీఫ్ అవ్వడం ఎలా?
Advertisement

Anxiety Relief Tips: ఈరోజుల్లో వేగంగా మారుతున్న లైఫ్ స్టైల్ కారణంగా చాలా మంది ఆందోళన చెందుతున్నారు. పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు, ఆర్థిక సమస్యలు లేదా భవిష్యత్తు గురించి ఆలోచనలు మనసులో టెన్షన్ పెంచుతాయి. కానీ చిన్న చిన్న అలవాట్లు మార్చుకుంటే యాంగ్జైటీ చాలా వరకు నియంత్రించుకోవచ్చు. సరైన లైఫ్ స్టైల్, ఆరోగ్యకరమైన ఆలోచనలు, కొన్ని సులభమైన పద్ధతులు పాటిస్తే.. మనసు ప్రశాంతంగా ఉంటుంది. యాంగ్జైటీ తగ్గించడానికి ఉపయోగపడే సులభమైన , ప్రాక్టికల్ టిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. లోతైన శ్వాస తీసుకోవడం:
ఆందోళనగా అనిపించినప్పుడు మన శ్వాస వేగంగా మారుతుంది. అప్పుడు లోతైన శ్వాస తీసుకోవడం చాలా ఉపయోగప డుతుంది. నెమ్మదిగా ముక్కు ద్వారా శ్వాస తీసుకుని కొన్ని సెకండ్లు ఆపి నెమ్మదిగా బయటకు వదలాలి. ఇలా 5–10 నిమిషాలు చేస్తే మనసు ప్రశాంతంగా మారుతుంది.

Advertisement

2. ప్రతిరోజూ వ్యాయామం:
రోజుకు కనీసం 20–30 నిమిషాలు చేయడం: తగ్గించడంలో సహాయపడుతుంది. వాకింగ్, యోగా లేదా లైట్ వర్కౌట్ చేయడం వల్ల శరీరంలో endorphins అనే హార్మోన్లు విడుదల అవుతాయి. ఇవి మనసును హ్యాపీగా ఉంచుతాయి.

3. సరిపడ నిద్ర:
నిద్ర సరిపడగా లేకపోతే యాంగ్జైటీ మరింత పెరుగుతుంది. రోజుకు 7–8 గంటలు నిద్రపోవడం చాలా ముఖ్యం. రాత్రి ఆలస్యంగా మొబైల్ వాడకాన్ని తగ్గిస్తే మంచి నిద్ర వస్తుంది.

Advertisement

4. కాఫీ ,చక్కెర తగ్గించండి:
కాఫీ, టీ లేదా ఎక్కువ చక్కెర ఉన్న ఆహారం తీసుకుంటే యాంగ్జైటీ లక్షణాలు పెరగవచ్చు. అందుకే కెఫిన్ ఉన్న పదార్థాలను పరిమితంగా తీసుకోవడం మంచిది.

5. పాజిటివ్ ఆలోచనలు పెంచుకోండి:
మన ఆలోచనలు మన భావోద్వేగాలను ప్రభావితం చేస్తాయి. నెగటివ్ ఆలోచనలు ఎక్కువగా ఉంటే యాంగ్జైటీ పెరుగుతుంది. అందుకే ప్రతీ పరిస్థితిని పాజిటివ్‌గా చూడటానికి ప్రయత్నించాలి.

6. ధ్యానం, యోగా:
మెడిటేషన్, యోగా మనసును ప్రశాంతంగా ఉంచడంలో చాలా ప్రభావవంతమైన పద్ధతులు. రోజుకు 10–15 నిమిషాలు ధ్యానం చేస్తే ఏకాగ్రత పెరుగుతుంది. అంతే కాకుండా ఆందోళన కూడ చాలా వరకు తగ్గుతుంది.

7. మీకు ఇష్టమైన పనులు:
పాటలు వినడం, పుస్తకాలు చదవడం, గార్డెనింగ్ చేయడం లేదా హాబీలు కొనసాగించడం వల్ల మనసు రిలాక్స్ అవుతుంది. ఇవి స్ట్రెస్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.

8. కుటుంబం,స్నేహితులతో మాట్లాడండి:

మన సమస్యలను మన దగ్గర వాళ్లతో పంచుకుంటే.. మనసులో ఉన్న ఒత్తిడి తగ్గుతుంది. అందుకే ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్‌తో మాట్లాడడం చాలా ముఖ్యం.

ఆందోళన అనేది చాలా సాధారణ సమస్య అయినప్పటికీ దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. చిన్న చిన్న అలవాట్లు మార్చుకుంటే మనసును ప్రశాంతంగా ఉంచుకోవచ్చు. సరైన నిద్ర, ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం , పాజిటివ్ ఆలోచనలు ఆందోళన ను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అవసరమైతే నిపుణుల సహాయం తీసుకోవడం కూడా మంచిది. మన ఆరోగ్యం కంటే ముఖ్యమైనది మరొకటి లేదు కాబట్టి మనసు ప్రశాంతంగా ఉండేలా లైఫ్ స్టైల్ మార్చుకోవాలి.

Related News

సండే స్పెషల్.. ఎప్పుడూ ఒకేలా కాకుండా మటన్‌ను ఇలా గ్రీన్‌గా వండి చూడండి.. వేళ్లు నాకేస్తారు!

అరకు ఫేమస్ బొంగు చికెన్.. తింటే జీవితంలో ఆ రుచిని మర్చిపోరు, ఎలా చేయాలో తెలుసా?

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

పిల్లల్లో డిప్రెషన్ ముప్పును తగ్గించే చిన్ననాటి అనుభవాలు ఇవే.. పేరెంట్స్ ఇవి తప్పక తెలుసుకోవాలి!

Big Stories

Advertisement
×