E-Paper
Advertisement

Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో వండిన ఆహారం సురక్షితమేనా?.. నిపుణులు ఏం చెబుతున్నారో చూసేయండి!

Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో వండిన ఆహారం సురక్షితమేనా?.. నిపుణులు ఏం చెబుతున్నారో చూసేయండి!
Advertisement

Pressure Cooker Safety: ప్రస్తుతం ప్రెషర్ కుక్కర్ల వాడటం విపరీతంగా పెరిగింది. ఎందుకంటే.. వంటల్ని వేగంగా పూర్తి చేయడంలో ప్రెషర్ కుక్కర్లు ఎంతో దోహదం చేస్తాయి. అయితే చాలామందికి ఉన్న సందేహం ఏమిటంటే.. ప్రెషర్ కుక్కర్లో వండిన ఆహారం ఆరోగ్యం మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో అని. ఈ విషయంలో నిపుణలు ఏం చెబుతున్నారంటే.. ప్రెషర్ కుక్కర్ ద్వారా వండిన ఆహారం సురక్షితమా, హానికరమా అనేది చాలా విషయాలపై ఆధారపడి ఉంటుందని, సరైన జాగ్రత్తలు పాటిస్తే ప్రెషర్ కుక్కర్ వంటలు ఆరోగ్యానికి మంచిదే అని చెబుతున్నారు. అయితే కొన్ని జాగ్ర‌త్త‌ల‌ను పాటించాల‌ని సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూసేద్దాం..

ఎలాంటి హానీ జరగదు:

ప్రెష‌ర్ కుక్క‌ర్లలో ఆహారం వండ‌టం అనేది ఆహారాన్ని ఆవిరితో ఉడికించ‌డం కింద‌కే వ‌స్తుంది. ఎందుకంటే.. ఇడ్లీల‌ను ఏవిధంగా ఆవిరి ద్వారా ఉడికిస్తామో అలాగే ప్రెష‌ర్ కుక్క‌ర్ కూడా ఆహారాల‌ను ఉడికిస్తుంది. ఇలా ఆవితో వండిన ఆహారాలు అత్యంత ఆరోగ్య‌క‌ర‌మైన ప‌ద్ధ‌తుల్లో ఒక‌టి. కాబట్టి.. ప్రెష‌ర్ కుక్క‌ర్లలో వండిన ఆహారాన్ని ఎలాంటి సందేహం లేకుండా తిన‌వ‌చ్చట. దీనివ‌ల్ల మ‌న‌కు ఎలాంటి హానీ జరగదని చెబుతున్నారు నిపుణులు.

Advertisement

Read Also: రెగ్యులర్‌గా బ్లాక్ ఫుడ్స్ తీసుకుంటే.. ఎలాంటి రోగాలైనా పారిపోవాల్సిందే!

అతిగా ఉడికించ‌వ‌ద్దు..

సాధారణంగా ప్రెష‌ర్ కుక్క‌ర్‌లో ఉష్ణోగ్ర‌త అధికంగా ఉంటుంది. కాబట్టి.. ఏ ఆహారాన్నైనా స‌రే నిర్దిష్ట‌మైన విజిల్స్ వ‌చ్చే వ‌ర‌కు మాత్ర‌మే ఉడికించాలి. బాగా ఉడుకుతుందని చాలాసేపు అలానే వదిలేయకూడదు. ఎందుకంటే.. ప్రెష‌ర్ కుక్క‌ర్‌లో ఆహారాన్ని మ‌రీ అతిగా ఉడికిస్తే అందులోని పోష‌కాలు చాలా వ‌ర‌కు న‌శిస్తాయి. ఇక అలా వండిన ఆహారాన్ని తిన్నా కూడా మ‌న‌కు పెద్ద‌గా ప్ర‌యోజ‌నం ఉండకపోవచ్చు. కాబట్టి.. ప్రెష‌ర్ కుక్కర్లలో ఎక్కువగా ఆహారాల‌ను వండేవాళ్లు ఈ విష‌యాన్ని క‌చ్చితంగా గుర్తుంచుకోవాలని సూచిస్తున్నారు

మన్నిక-వారంటీ చూసుకోవాలి:

Advertisement

ఇకపోతే.. ప్రెష‌ర్ కుక్క‌ర్లలో వండిన ఆహారం ఆరోగ్య‌క‌ర‌మే అయిన‌ప్ప‌టికీ ఆ కుక్కర్లు ఎక్కువ కాలం పాటు వాడ‌కూడ‌ద‌ని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే.. దీర్ఘ‌కాలం పాటు ప్రెష‌ర్ కుక్క‌ర్లను వాడితే వాటి లోప‌లి పొర దెబ్బ తింటుంది. దీంతో ఆహారం ఉడికేటప్పుడు దానిలోకి ర‌సాయ‌నాలు, టాక్సిన్లు విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉంటుంది. అవి నేరుగా ఆహారంలో క‌లుస్తాయి. అలాంటి ఆహారాన్ని తిన‌డం వ‌ల్ల అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. కాబట్టి.. ప్రెష‌ర్ కుక్క‌ర్లను వాటి వారెంటీలను బట్టి మారుస్తూ ఉండాలి. ఒకవేళ కుక్కర్లోని లోప‌లి లైనింగ్ దెబ్బ తింటే అలాంటి వాడ‌కూడ‌దు.

Read Also: బ్లాక్ గ్రీన్‌లను మించి ‘వైట్ టీ’ హెల్త్ సీక్రెట్స్.. అందం, ఆరోగ్యం రెండూ ఒకే కప్పులో!

Related News

హెవీ ఇయర్‌రింగ్స్‌తో చెవి నొప్పి వస్తుందా? చెవి రంధ్రాలు సాగకుండా ఈ సింపుల్ ట్రిక్ పాటించండి

ఒక్క పన్ను పీకడానికి రూ.2.25 లక్షలా.. అదే ఇండియాలో అయితే?

డెస్క్ జాబ్ చేస్తున్నారా? ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వచ్చే సమస్యలు ఇవే

తగ్గేదెలే.. ఈ తేదీల్లో పుట్టినవారు ఆత్మగౌరవం విషయంలో అసలు రాజీపడరు

స్కూల్‌కు వెళ్లే సమయం అయినా పిల్లలు నిద్రలేవడం లేదా? ఈ 5 టిప్స్‌తో మార్నింగ్ రొటీన్ మార్చండి

గుండెపోటు ముప్పును 30 శాతం తగ్గించగల పిల్.. తాజా అధ్యయనంలో అద్భుత ఫలితాలు

వర్షాకాలంలో తరచూ అనారోగ్యానికి గురవుతున్నారా? రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి ఈ పుడ్స్

రక్తంలో చక్కెర పెరగకుండా ఉండాలంటే ఆపిల్ తినాలా? పియర్ తినాలా?

Big Stories

Advertisement
×