E-Paper
Advertisement

OTT Movie : డబ్బులిచ్చి మరీ చావును కొని తెచ్చుకునే మెంటల్ గ్యాంగ్… చావుకే గుబులు పుట్టించే బ్లడీ బ్లడ్ బాత్

OTT Movie : డబ్బులిచ్చి మరీ చావును కొని తెచ్చుకునే మెంటల్ గ్యాంగ్… చావుకే గుబులు పుట్టించే బ్లడీ బ్లడ్ బాత్
Advertisement

OTT Movie : హాలివుడ్ హారర్ సినిమా అంటేనే ఓ రేంజ్ లో భయపెట్టే సన్ని వేశాలు ఉంటాయి. ఇక కామెడీ హారర్ సినిమాలైతే ఒక పక్క భయపెడుతూ, మరో వైపు కామెడీ సీన్స్ తో కేక పెట్టిస్తుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో రెండూ మిక్స్ చేసి ఉంటాయి. ఈ స్టోరీ హోలోవీన్ సీజన్ లో జరుగుతుంది. అక్కడ ఈ ఫెస్టివల్ సమయంలో ఒక భయంకరమైన షో ఏర్పాటు చేస్తారు. అక్కడికి వెళ్ళిన నలుగురు స్నేహితులు ఊహించని ట్రాప్ లో పడతారు. ఆతరువాత వాళ్ళ చుట్టూ జరిగే హాంటెడ్ సీన్స్ తో స్టోరీ నడుస్తుంది. హారర్ కామెడీ ఇష్టపడే వాళ్ళు మిస్ కాకుండా చూడాల్సిన సినిమా ఇది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే …

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

2020లో విడుదలైన అమెరికన్ హాలివుడ్ హారర్ కామెడీ సినిమా పేరు ‘ఫియర్ ఫార్మ్’ (Fear Pharm). డాంటే యోర్ దర్శకత్వంలో ఇది రూపొందింది. ఇందులో టియానా టట్టుల్, ఎమిలీ స్వీట్, హౌస్టన్ స్టెవెన్సన్, జాన్ లిటిల్‌ఫీల్డ్ లీడ్ రోల్స్ లో నటించారు. ఈ సినిమా 2020సెప్టెంబర్ 11న రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్ వీడియో Tubi లో ఈ సినిమా అందుబాటులో ఉంది.

Advertisement

Read Also : హాంటెడ్ హౌస్ లో మోడ్రన్ భూతాలు… సినిమా డైరెక్టర్ తో మంతనాలు… వాటి జోలికెళ్తే దబిడి దిబిడే

స్టోరీలోకి వెళ్తే

క్రిస్టీ అనే యువతి తన ముగ్గురు స్నేహితులు కలసి, హాలోవీన్ సీజన్‌లో వినోదం కోసం ప్రసిద్ధి చెందిన “ఫియర్ ఫార్మ్” అనే హాంటెడ్ షో కి వెళ్లాలని నిర్ణయించుకుంటారు. ఇది ఒక పెద్ద పొలంలో ఏర్పాటు చేసిన భయపెట్టే ప్రదర్శన. ఈ ఫామ్‌కి ఒక విచిత్రమైన చరిత్ర ఉంది. ఇది పాతాళ లోకానికి ద్వారం అని కొందరు నమ్ముతారు. యువత సరదాగా నవ్వుతూ అక్కడికి చేరుకుంటారు. మొదట వారు దీన్ని కేవలం ఒక వినోద కార్యక్రమంగా, నటులు భయపెట్టే సాధారణ ప్రదర్శనగా భావిస్తారు. డబ్బులు పెట్టి టికెట్ తీసుకుని లోపలికి వెళ్తారు. పంట పొలాలలో చెరకు తోటల్లో జరిగే ఈ షో లో వీళ్ళకు  ఎదురయ్యే భయానక సంఘటనలు, వాస్తవానికి చాలా దగ్గరగా ఉన్నాయని గ్రహించడం మొదలుపెడతారు. ఒక్కొక్కరిని అందులో ఉన్న వాళ్ళు విచిత్రమైన ఆకారాలు క్రూరంగా వేటాడటం మొదలు పెడతారు. చివరికి ఈ నలుగురూ ప్రాణాలతో బయట పడతారా ? ‘ఫియర్ ఫార్మ్’ లో బలవుతారా ? అనే విషయాలను, ఈ అమెరికన్ హాలివుడ్ హారర్ కామెడీ సినిమాను చూసి తెలుసుకోండి.

Advertisement

 

 

 

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×