E-Paper
Advertisement

OTT Movie : పార్టీలో ప్రాణాలు తీసే వైరస్… మోస్ట్ డిస్టర్బింగ్ సీన్స్… ఒంటరిగా చూశారో వణుకే

OTT Movie : పార్టీలో ప్రాణాలు తీసే వైరస్… మోస్ట్ డిస్టర్బింగ్ సీన్స్… ఒంటరిగా చూశారో వణుకే
Advertisement

OTT Movie : జాంబీ సినిమా అంటే రక్తం, భయం, హింస అని అనుకునేవాళ్లకి ‘క్వీన్స్ ఆఫ్ ది డెడ్’ సినిమా ఒక్కసారిగా నవ్వు పుట్టిస్తుంది. ఈ ఏడాది థియేటర్లలో రిలీజ్ అయింది. ఇప్పుడు ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. లో బడ్జెట్ మూవనే అయినా విజువల్స్, మేకప్, కాస్ట్యూమ్స్ ఈ సినిమాలో అదిరిపోయాయి. ఈ చిత్రానికి దివంగత ప్రఖ్యాత హారర్ దర్శకుడు జార్జ్ ఎ. రొమెరో కుమార్తె టీనా రొమెరో దర్శకత్వం వహించారు. ఈ మూవీ నేటి సోషల్ మీడియా, ఫోన్ వ్యసనాలపై విమర్శనాత్మకంగా చూపిస్తుంది. ఇది ఏ ఓటీటీలో ఉంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

2025లో విడుదలైన ఈ అమెరికన్ జాంబీ కామెడీ హారర్ సినిమా పేరు ‘క్వీన్స్ ఆఫ్ ది డెడ్’ (Queens of the dead). టినా రొమెరో ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఇందులో కాటీ ఓ’బ్రయన్, జాక్వెల్ స్పైవీ లీడ్ రోల్స్ లో నటించారు. 2025 అక్టోబర్ 24న థియేట్రికల్ రిలీజ్ అయిన ఈ సినిమా షడర్, అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

Advertisement

Read Also : ఓటీటీలో నలుగురమ్మాయిల రచ్చ… పోస్టర్ లోనే మ్యాటర్… ఇలాంటి సిరీస్ తో నిద్ర కరువే మావా

స్టోరీ ఏమిటంటే

ఈ కథ బ్రూక్లిన్‌లోని ఒక పెద్ద వేర్‌హౌస్ పార్టీలో జరుగుతుంది. అక్కడికి వచ్చిన వాళ్ళల్లో చాలా మంది చిన్న చిన్న విషయాలలో తగాదాలు పెట్టుకుంటూ ఉంటారు. పార్టీని కూడా వేరే లెవెల్ లో ఎంజాయ్ చేస్తుంటారు.  సరిగ్గా అదే రోజు రాత్రి, నగరంలో జోంబీ అపోకలిప్స్ మొదలవుతుంది. మాంసం తినే జాంబీలు పార్టీ జరుగుతున్న వేదికపై దాడి చేస్తాయి. ఆ ప్రదేశం ఒక్కసారిగా యుద్ధరంగంగా మారుతుంది. ప్రాణాలను కాపాడుకోవాల్సిన పరిస్థితి రావడంతో, ఆ పార్టీలో ఉన్న వాళ్ళు తమలోని విభేదాలను పక్కన పెట్టి, జాంబీలతో పోరాడటానికి సిద్దపడతారు. ఇప్పుడు పార్టీ నిర్వాహకురాలు డ్రే, అక్కడికి వచ్చిన వాళ్ళు ప్రాణాలతో బయటపడేందుకు చేసే ప్రయత్నంలో కామెడీతో పాటు, ఉత్కంఠ రేపే రక్తపాత సన్నివేశాలు ఉంటాయి. దీని నుంచి బయట పడేందుకు న్యూయార్క్ నగరం నుండి పారిపోవాలని వాళ్ళు లక్ష్యంగా పెట్టుకుంటారు. ఈ ప్రయాణంలో వాళ్ళు ఎదుర్కొనే సవాళ్ళు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. చివరికి వాళ్ళు జోంబీల నుంచి తప్పించుకుంటారా ? వాటికి బలవుతారా ? అసలు జోంబీలు ఎలా వచ్చాయి ? అనే విషయాలను, ఈ అమెరికన్ జాంబీ కామెడీ హారర్ సినిమాని చూసి తెలుసుకోండి.

Advertisement

 

Related News

సైబర్ క్రైమ్ స్కామ్ తో సర్వం కోల్పోయే అమ్మాయి.. క్లైమాక్స్ అదుర్స్, తెలుగులో మలయాళ థ్రిల్లర్

ఎడారిలో విమానం క్రాష్.. లేడీ సైంటిస్ట్ కిడ్నాప్.. గ్రిప్పింగ్ సర్వైవల్ క్రైమ్ థ్రిల్లర్

చిన్నారికి ఇచ్చిన మాట తప్పే దేవుడు.. శక్తులు కోల్పోయి భూమి మీదకు… తెలుగులో క్రేజీ ఫాంటసీ ధమాకా

భార్య హత్యకు ప్రతీకారం.. ఆర్మీ ఆఫీసర్ రివేంజ్ కిరాక్.. తెలుగులోనూ ఉంది

ఆఫ్ఘనిస్థాన్ అడవుల్లో హెలికాప్టర్ క్రాష్.. పదేళ్ళ చిన్నారి కోసం కమాండో డేరింగ్ సెర్చ్

జపాన్ సైన్యానికి చుక్కలు చూపించే పోరాటం.. తెలుగులో కొరియన్ హిస్టారికల్ యాక్షన్-వార్ డ్రామా

మునిగిపోయిన ఓడలో వేల కోట్ల నిధి.. ట్విస్టులతో పిచ్చెక్కించే యాక్షన్-అడ్వెంచర్ మిస్టరీ టీన్ సిరీస్

ఈ వింత కెమెరాతో ఫోటో తీస్తే దారుణమైన చావు… గుండె జారిపోయే డార్క్ హర్రర్ మిస్టరీ

Big Stories

Advertisement
×