E-Paper
Advertisement

Kodo Millet Benefits: అరికెలు తినకపోతే ఈ ఆరోగ్య ప్రయోజనాలను వదులుకునట్టే!

Kodo Millet Benefits: అరికెలు తినకపోతే ఈ ఆరోగ్య ప్రయోజనాలను వదులుకునట్టే!
Advertisement

Kodo Millet Benefits: సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవాలని చాలామంది ఎక్కువగా చిరుధాన్యాలను తమ ఆహారంలో భాగం చేసుకుంటుంటారు. ఈ క్రమంలో రాగులు, జొన్నలతో పాటు అరికెల (కోడో మిల్లెట్)ను కూడా పోషక విలువలు ఎక్కువగా ఉన్న ధాన్యంగా చెప్పవచ్చు. ఒకప్పుడు నిత్యాహారంగా వాడిన అరికెలు, ఇప్పుడు మళ్లీ ప్రాధాన్యం పొందుతున్నాయి. జావ, ఉప్మా, అన్నం వంటి వంటకాలుగా తినగలిగే అరికెలు రుచిగా ఉండటమే కాకుండా, శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. రోజూవారీ ఆహారంలో అరికెలను చేర్చుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం.

జీర్ణ సమస్యలకు చెక్:

ఇది ఫైబర్ అధికంగా ఉండే చిరుధాన్యం. వీటిని ఆహారంలో చేర్చుకుంటే.. జీర్ణక్రియ మెరుగు పడటమే కాకుండా మలబద్ధకం వంటి సమస్యలు సైతం తగ్గుతాయి. అలాగే ఇవి ప్రీబయోటిక్‌లా పనిచేసి పేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరగడానికి సహాయపడతాయి. దీనివల్ల జీర్ణ సంబంధిత సమస్యలు దరిచేరవు. అలాగే అరికెల్లో తక్కువ గ్లైసీమిక్ ఇండెక్స్ ఉండటం వల్ల అరికెలు రక్తంలో చక్కెర స్థాయిలను మెల్లగా పెంచుతాయి. కాబట్టి.. షుగర్, టైప్-2 డయాబెటిస్ ఉన్నవారికి ఇవి మంచి ఆహారంగా చెప్పవచ్చు

Advertisement

Also Read: జిమ్‌ అవసరం లేదు.. రోజూ మెట్లు ఎక్కితే చాలు, ఫిట్‌నెస్ ఫలితాలు చూసి ఆశ్చర్యపోతారు!

గుండె ఆరోగ్యానికి మేలు:

అరికెల్లో సహజంగానే యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలోని హానికర ఫ్రీ ర్యాడికల్స్‌ను తగ్గించి గుండెపై పడే ఒత్తిడిని తగ్గిస్తాయి. అలాగే అరికెల్లో వాపులను తగ్గించే గుణాలు ఉండటంతో.. ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులు ఉన్నవారికి ఉపశమనం లభిస్తుంది. తరచూ అరికెలు తీసుకుంటే గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు కూడా తక్కువే అని చెబుతున్నారు వైద్య నిపుణులు.

కొలెస్ట్రాల్, బీపీ నియంత్రణకు:

Advertisement

మన రోజువారీ ఆహారంలో అరికెలను చేర్చుకుంటే.. చెడు కొలెస్ట్రాల్ తగ్గి, మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీనివల్ల రక్తనాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఈ చిరు ధాన్యంలో ఉండే మెగ్నీషియం కండరాల నొప్పులను తగ్గించడంలో సహాయపడటమే కాకుండా.. దీనిలోని పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే హైబీపీ ఉన్నవారికి కూడా అరికెలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

Also Read: శరీరంలో నీరు తగ్గితే ఈ ప్రమాదాలు తప్పవు.. రోజుకు ఎంత నీరు తాగాలో తెలుసా?

Related News

రక్తంలో చక్కెర పెరగకుండా ఉండాలంటే ఆపిల్ తినాలా? పియర్ తినాలా?

ఉదయం ఫ్రెష్‌గా లేవాలంటే రాత్రి ఎప్పుడు పడుకోవాలి? నిపుణులు ఏం చెబుతున్నారు?

చాణక్య నీతి.. ఈ 6 సందర్భాల్లో మౌనంగా ఉండటమే తెలివైన నిర్ణయం

తెల్లని బట్లలు పాతబడి పసుపుపచ్చగా మారుతున్నాయా? మళ్లీ మెరిసిపోయే తెల్లదనం కోసం టిప్స్

ఫైనాన్షియల్ మాస్టర్స్.. ఈ 3 తేదీల్లో పుట్టినవారు ఏ బిజినెస్ చేసినా సూపర్‌హిట్

కడుపు బరువుగా అనిపిస్తుందా? భోజనం తర్వాత పైనాపిల్ తింటే చాలా ప్రయోజనాలు

నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? రోజూ ఈ వ్యాయామం చేస్తే మంచి గాఢనిద్ర మీ సొంతం

Zomatoలో ఈ టేస్టీ ఫుడ్స్ ఇక దొరకవ్..ఎందుకంటే ?

Big Stories

Advertisement
×