E-Paper
Advertisement

IPL Auction 2026: 12 ఏళ్ల కింద‌టే చెప్పాడు..ఇప్పుడు జ‌డేజా ప్లేస్ భ‌ర్తీ చేసేశాడు..అకేల్ హోసిన్ ట్వీట్ వైర‌ల్‌

IPL Auction 2026: 12 ఏళ్ల కింద‌టే చెప్పాడు..ఇప్పుడు జ‌డేజా ప్లేస్ భ‌ర్తీ చేసేశాడు..అకేల్ హోసిన్ ట్వీట్ వైర‌ల్‌
Advertisement

IPL Auction 2026:   ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంటుకు ( Indian Premier League 2026 Tournament ) సంబంధించిన మినీ వేలం చాలా ర‌స‌వ‌త్త‌రంగా కొన‌సాగుతోంది. అయితే, ఈ మినీ వేలంలో చెన్నై సూప‌ర్ కింగ్స్ చాలా తెలివిగా ప్లేయ‌ర్ల‌ను కొనుగోలు చేస్తోంది. డ‌బ్బులు పెట్టాల్సిన ద‌గ్గ‌రే పెడుతోంది చెన్నై సూప‌ర్ కింగ్స్‌. దేశీయ ప్లేయ‌ర్ల‌పై కోట్లు కుమ్మ‌రించిన చెన్నై, అంత‌ర్జాతీయ ప్లేయ‌ర్ల‌ను ప‌ట్టించుకోవ‌డం లేదు. అయితే, ఆల్ రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా స్థానాన్ని మాత్రం ఓ విదేశీ ప్లేయ‌ర్ తో భ‌ర్తీ చేసింది. అకేల్ హోసేన్ ( Akeal Hosein ) అనే విండీస్ ఆల్ రౌండర్ తో భ‌ర్తీ చేసింది చెన్నై సూప‌ర్ కింగ్స్‌. అకేల్ హోసేన్ ( Akeal Hosein ) ను కేవ‌లం రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది.

Also Read: IPL 2026 Auction: ఐపీఎల్ 2026 షెడ్యూల్ లో మార్పు…నేడే మినీ వేలం, టైమింగ్స్, ఉచితంగా ఎక్క‌డ చూడాలంటే

12 ఏళ్ల కిందటి అకేల్ హోసేన్ ట్వీట్ వైరల్

Advertisement

ఐపీఎల్ మినీ వేలం నేపథ్యంలో అకేల్ హోసేన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి వచ్చాడు. కేవలం రెండు కోట్లకే తెలివిగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అతన్ని కొనుగోలు చేసింది. దీంతో రవీంద్ర జడేజా స్థానాన్ని అకేల్ హోసేన్ తో భర్తీ చేయనుంది చెన్నై సూపర్ కింగ్స్. జడేజా లాగానే అకేల్ హోసేన్ కూడా లెఫ్ట్ అండ్ స్పిన్నర్. బ్యాటింగ్ కూడా ఇరగదీస్తాడు. భారీ సిక్సర్లు కొడతాడు. అయితే ఈ నేపథ్యంలోనే అతడు 12 సంవత్సరాల కిందట చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ఏదో ఒక రోజు రవీంద్ర జడేజా లాంటి ఆల్ రౌండర్ అవుతానని అప్పట్లో ట్వీట్ చేశాడు అకేల్ హోసేన్. అయితే 12 సంవత్సరాల తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి వచ్చి తన కలను ఇప్పుడు నెరవేర్చుకున్నాడు. రవీంద్ర జ‌డేజా స్థానంలో ఇప్పుడు చెన్నై అకేల్ హోసేన్ ను వాడుకోనుంది. ఇదే విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కూడా రీ-ట్వీట్‌ చేసింది.

Also Read: Vaibhav Suryavanshi: 3 ఏళ్లుగా అదే చెబుతున్నావ్, వైభ‌వ్ ఏజ్ పై పాకిస్తాన్ ఫ్యాన్స్ ట్రోల్స్‌.. ఛీట‌ర్ అంటూ అరుపులు

Advertisement

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×