మేకప్‌లో లిప్‌స్టిక్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. సరైన లిప్‌స్టిక్ షేడ్ మీ ముఖానికి కొత్త అందాన్ని తీసుకువస్తుంది. అయితే ప్రతి లిప్‌స్టిక్ కలర్ ప్రతి స్కిన్ టోన్‌కు సరిపోదు. ముఖ్యంగా డస్కీ స్కిన్ (చామన ఛాయ రంగు చర్మం) ఉన్నవారు తమ చర్మానికి సరిపోయే షేడ్స్‌ను ఎంచుకోవాలి. తప్పుడు కలర్స్ ఉపయోగిస్తే ముఖం వెలవెలబోయినట్లు కనిపించవచ్చు. అందుకే కొన్ని లిప్‌స్టిక్ షేడ్స్‌ను నివారించడం మంచిది. డస్కీ స్కిన్ కలర్ ఉన్నవారు ఈ 5 లిప్ స్టిక్ షేడ్స్ వేయకూడదు.
చాలా లేత బేజ్ కలర్ లేదా పీచ్ న్యూడ్ లిప్‌స్టిక్ డస్కీ స్కిన్‌కు అంతగా మ్యాచ్ కావు. ఈ రంగులు పెదవుల సహజ రంగును తగ్గించి ముఖాన్ని నిర్జీవంగా చూపిస్తాయి. న్యూడ్ లుక్ ఇష్టమైతే క్యారమెల్, బ్రౌన్ న్యూడ్ లేదా వార్మ్ న్యూడ్ షేడ్స్‌ను ఎంచుకోవడం మంచి ఎంపిక.
బేబీ పింక్ లేదా మిల్కీ పింక్ షేడ్స్ డస్కీ స్కిన్ అందాన్ని తగ్గిస్తాయి. ఈ రంగులు చర్మం సహజ కాంతిని దాచేస్తాయి. దీంతో మేకప్ సహజంగా కనిపించదు. దీనికి బదులుగా రోజ్ పింక్, డస్టీ రోజ్ లేదా మావ్ పింక్ షేడ్స్ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాయి.
లేత లావెండర్ లేదా పాస్టెల్ పర్పుల్ షేడ్స్ డస్కీ స్కిన్‌పై పెద్దగా మెరవవు. ఇవి చర్మం రంగును మరింత డల్‌గా కనిపించేలా చేస్తాయి. పర్పుల్ షేడ్స్ ఇష్టమైతే డీప్ ప్లమ్, బెర్రీ లేదా వైన్ షేడ్స్‌ను ఎంచుకోవచ్చు. ఇవి ముఖానికి మరింత అందాన్ని తీసుకొస్తాయి.
సిల్వర్ అండర్‌టోన్ లేదా మెటాలిక్ ఫినిష్ ఉన్న లిప్‌స్టిక్స్ డస్కీ స్కిన్‌కు అంతగా సరిపోవు. ఇవి పెదవుల అందాన్ని తగ్గించడంతో పాటు చర్మాన్ని మరింత ముదురు రంగులో చూపించవచ్చు. అందుకే మ్యాట్ లేదా శాటిన్ ఫినిష్ ఉన్న వార్మ్ షేడ్స్‌ను ఉపయోగించడం మంచిది.
లైట్ కోరల్ లేదా ప్రకాశవంతమైన నియాన్ ఆరెంజ్ రంగులు డస్కీ స్కిన్‌కు సరైన ఎంపిక కావు. ఇవి చర్మంలోని వార్మ్ అండర్‌టోన్‌తో సరిగ్గా కలవవు. బదులుగా బర్న్ట్ ఆరెంజ్, టెర్రాకోటా లేదా బ్రిక్ షేడ్స్‌ను ఉపయోగిస్తే ముఖం మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
Also Read: తక్కువ స్థలంలో కిచెన్ గార్డెన్.. ఇంట్లోనే కూరగాయలు పండించడం మరింత సులభం
డస్కీ స్కిన్ ఉన్నవారికి కొన్ని రంగులు అద్భుతంగా సరిపోతాయి. బ్రిక్ రెడ్, వైన్, ప్లమ్, డీప్ బెర్రీ, చాక్లెట్ బ్రౌన్, టెర్రాకోటా వంటి షేడ్స్ ముఖానికి ప్రత్యేక ఆకర్షణను ఇస్తాయి. అలాగే వార్మ్ న్యూడ్, మావ్ పింక్, క్లాసిక్ రెడ్ కూడా మంచి ఎంపికలు. ఇవి చర్మం సహజ కాంతిని మరింత హైలైట్ చేస్తాయి.
లిప్‌స్టిక్ కొనుగోలు చేసే ముందు మీ స్కిన్ అండర్‌టోన్‌ను గుర్తించాలి. చేతిపై కాకుండా పెదవుల దగ్గర లేదా జా లైన్ ( దవడల సమీపంలో) పై షేడ్‌ను పరీక్షించడం మంచిది. దీంతో ఆ రంగు మీకు ఎలా కనిపిస్తుందో సులభంగా తెలుసుకోవచ్చు. అలాగే పగటి మేకప్, రాత్రి మేకప్ కోసం వేర్వేరు షేడ్స్‌ను ఉపయోగించడం మంచిది. సరైన లిప్‌స్టిక్‌ను ఎంచుకోవడం వల్ల మీ అందం మరింత మెరుగుపడుతుంది.