E-Paper
Advertisement

సిరిసిల్ల జిల్లాలో మ‌రో పుణ్య‌క్షేత్రం..500 అడుగుల స‌ర్పం..ఏకంగా 5 త‌ల‌లు

సిరిసిల్ల జిల్లాలో మ‌రో పుణ్య‌క్షేత్రం..500 అడుగుల స‌ర్పం..ఏకంగా 5 త‌ల‌లు
Advertisement

Nampally Laxmi Narasimha Swamy Temple:  రాజన్న సిరిసిల్ల జిల్లాలో ( Rajanna Siricilla) అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ముఖ్యంగా దక్షిణ కాశీగా పేరు ఉన్న వేములవాడ రాజన్న ఆలయం (Vemulawada Rajanna Temple) ఇప్పటికే ప్రసిద్ధి గాంచింది. అయితే ఈ వేములవాడ రాజన్న ఆలయానికి సరిగ్గా 5 కిలోమీటర్ల దూరంలోనే నాంపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం కూడా ఉంది. ఈ ఆలయం కొండపైన ఉండటం కారణంగా.. పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దబడుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత ఈ ఆలయానికి నిధులు కేటాయించి తెలంగాణ ప్రభుత్వం కూడా డెవలప్మెంట్ చేస్తోంది. గుట్టపైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకొని… గుట్ట కింద మాంసంతో భోజనం చేస్తారు. అంటే అచ్చం యాదాద్రి తరహాలోనే ఈ నాంపల్లిలో (Nampally Laxmi Narasimha Swamy Temple) పూజలు జరుగుతాయి. వేముల‌వాడ రాజ‌న్న‌ను ద‌ర్శించుకున్న వాళ్లు, నాంప‌ల్లికి కూడా వ‌స్తారు.

Also Read: Ms Dhoni Ruling Team India: ధోని లేక సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

నాంపల్లి గుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ రహస్యం, ప్రత్యేకతలు ఇవే

Advertisement

వేములవాడ రాజన్న ఆలయానికి ఐదు కిలో మీటర్ల దూరంలో ఉన్న నాంపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయం (Nampally Laxmi Narasimha swamy temple)…. రాజన్న సిరిసిల్ల జిల్లాకు దాదాపు 12 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయం గుట్టపైన ఉంటుంది. అంతేకాదు కొండపైన దాదాపు 500 అడుగుల సర్పం కూడా నిర్మాణం చేశారు. ఈ సర్పానికి ఐదు పడగలు ఉంటాయి. సర్పం పొట్టలో నుంచి.. తల భాగం వైపు వెళ్లి లక్ష్మీనరసింహస్వామిని దర్శనం చేసుకోవాలి. అలాగే ఈ సర్పం తల భాగంలో శ్రీకృష్ణ భగవానుడు ఉంటాడు.

సంతానం లేని వాళ్లకు ప్రతిఫలం ఇచ్చే దేవుడిగా లక్ష్మీనరసింహస్వామికి పేరు ఉంది. అలాగే ఈ గుట్టపై నుంచి చూస్తే.. మిడ్ మానేరు అందాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. అటు రాజన్న ఆలయం కూడా గుట్టపై నుంచి కనిపిస్తుంది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల కాలంలో వచ్చిన తర్వాత పర్యాటక క్షేత్రంగా నాంపల్లిని మార్చేందుకు చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానే ఎయిర్ ఫోర్స్ కు సంబంధించిన ఓ విమానాన్ని కూడా నాంపల్లి గుట్ట పైకి తీసుకువెళ్లారు. ఈ క్షేత్రానికి వచ్చిన భక్తులు… ఈ విమానం చూసేలా ఏర్పాట్లు చేశారు. దీనిపై భక్తులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

నాంపల్లి ఆలయానికి 600 ఏళ్ల చరిత్ర

Advertisement

నాంపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి 600 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి స్వయంభుగా వెలిచాడు. 11వ శతాబ్దంలో రాజమహేంద్రవరాన్ని పరిపాలించిన రాజరాజ నరేంద్రుడు ఈ ప్రాంతాన్ని సందర్శించి… ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకున్నారు. ఆయన భార్య రత్నాంగి దేవి సంతానం కోసం ఇక్కడి గుట్టపై తపస్సు చేశాడు. ఈ క్రమంలోనే సంతాన భాగ్యం కలిగింది. ఈ క్రమంలోనే రాజరాజ నరేంద్రుడు ( Raja Raja Narendrudu) ఆలయ అభివృద్ధికి పాల్పడి… పర్యాటక క్షేత్రంగా మలిచేందుకు కూడా తోడ్పడ్డాడు.

Also Read: Hasan Ali in a pickpocketing case: పిక్ పాకెట్ కేసులో హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

 

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

 

 

Related News

ఆ దేశంలో గాజుతో రైలు నిర్మాణం చేసిన ఇంజినీర్లు.. దీనికి ప్రత్యేక కారణం మ్యాజిక్

ముస్లింలకు శుభవార్త.. ఒక్క ఉమ్రా వీసాతో ఎన్నిసార్లైనా మక్కా ఎంట్రీ.. కానీ చిన్న కండీషన్

పాత బంగ్లాలో అర్ధరాత్రి విడిది.. దెయ్యం లేదని నిరూపిస్తే.. రూ.52 వేలు మీవే!

Gulf Job Scam: విజిట్ వీసా vs వర్క్ వీసా.. ఈ ఒక్క తప్పు చేస్తే గల్ఫ్‌లో జీవితం నాశనమే!

సహారా ఎడారి లేకపోతే అమెజాన్ అడవి ఉండేది కాదా? రెండింటి మధ్య అసలు లింకేంటి?

ఒకప్పుడు పాక్ లో.. ఇప్పుడు ఇండియాలో.. ఈ అందమైన గ్రామం గురించి మీకు తెలుసా?

హైడ్రోజన్ రైలుపై రాళ్లు విసిరారా? వైరల్ వీడియోపై రైల్వే క్లారిటీ!

Big Stories

Advertisement
×