E-Paper
Advertisement

Bald Head: 30 ఏళ్లకే బట్టతలా ? మగవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన నిజాలివే

Bald Head: 30 ఏళ్లకే బట్టతలా ? మగవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన నిజాలివే
Advertisement

Bald Head: ఒకప్పుడు బట్టతల అనేది 50 ఏళ్లు దాటిన వారిలో కనిపించే లక్షణం. కానీ నేడు 20 ఏళ్ల యువకుల్లో కూడా జుట్టు పలచబడటం, నుదురు వెనక్కి వెళ్లడం సాధారణమైపోయింది. ముఖ్యంగా మన దేశంలో మారుతున్న వాతావరణం, పని ఒత్తిడి, ఆహారపు అలవాట్లు యువతలో ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయి. కేవలం వంశ పారంపర్యం వల్లే జుట్టు రాలుతుందని అనుకోవడం పొరపాటు.. మనకు తెలియకుండానే మనం చేసే కొన్ని పొరపాట్లు, మన చుట్టూ ఉన్న పరిసరాలు ఈ ప్రక్రియను వేగవంతం చేస్తున్నాయి. 30 ఏళ్ల లోపు బట్టతలకు దారితీసే.. ఆ అంతర్లీన కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం.

30 ఏళ్ల లోపు బట్టతలకు దారితీసే 6 ప్రధాన కారణాలు:
పురుషుల జుట్టు రాలడానికి జీవక్రియల నుంచి పర్యావరణం వరకు అనేక అంశాలు దోహదం చేస్తాయి.

Advertisement

1. తీవ్రమైన మానసిక ఒత్తిడి :
నేటి పోటీ ప్రపంచంలో కెరీర్, ఆర్థిక ఇబ్బందులు యువతలో ఒత్తిడిని పెంచుతున్నాయి. మనం ఒత్తిడికి లోనైనప్పుడు శరీరంలో ‘కోర్టిసాల్’ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఇది హెయిర్ ఫోలికల్స్ (జుట్టు కుదుళ్లు) విశ్రాంతి దశలోకి వెళ్లేలా చేస్తుంది. దీని వల్ల జుట్టు విపరీతంగా రాలిపోతుంది. దీనినే ‘టెలోజెన్ ఎఫ్లూవియం’ అంటారు.

2.  నీరు, కాలుష్యం:
మన దేశంలో చాలా నగరాల్లో భూగర్భ జలాల్లో కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. ఈ నీటితో తల స్నానం చేయడం వల్ల జుట్టు పొడిగా మారి, కుదుళ్లు బలహీన పడతాయి. అలాగే గాలిలోని ధూళి, పొగ తలలో చేరి ఇన్ఫెక్షన్లకు, జుట్టు రాలడానికి కారణమవుతాయి.

Advertisement

3. ప్రోటీన్, విటమిన్ల లోపం:
జుట్టు ప్రధానంగా ‘కెరాటిన్’ అనే ప్రోటీన్‌తో నిర్మితమవుతుంది. మన దేశంలో ఆహారంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండి.. ప్రోటీన్లు తక్కువగా ఉండటం ఒక లోపం. విటమిన్ D, విటమిన్ B 12,ఐరన్ లోపం వల్ల జుట్టుకు అందాల్సిన పోషకాలు అందక అవి రాలిపోతాయి.

4. జంక్ ఫుడ్, ఇన్సులిన్ రెసిస్టెన్స్:
చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలు, ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు పెరుగుతాయి. అధిక ఇన్సులిన్ పురుషులలో ‘DHT’ అనే హార్మోన్‌ను ప్రేరేపిస్తుంది. ఈ DHT హార్మోన్ జుట్టు కుదుళ్లను కుంచించుకుపోయేలా చేసి.. శాశ్వత బట్టతలకు దారితీస్తుంది.

5. ధూమపానం, మద్యపానం:
సిగరెట్ తాగడం వల్ల రక్త నాళాలు కుంచించుకుపోయి. తలపై  చర్మానికి రక్త ప్రసరణ తగ్గుతుంది. దీని వల్ల జుట్టుకు అందాల్సిన ఆక్సిజన్ అందదు. మద్యపానం శరీరంలోని జింక్ స్థాయిలను తగ్గించి జుట్టును బలహీన పరుస్తుంది.

6. హెయిర్ స్టైలింగ్, రసాయనాలు:
అతిగా జెల్స్ వాడటం, హెయిర్ డ్రైయర్లు ఉపయోగించడం, నాణ్యత లేని షాంపూలలో ఉండే సల్ఫేట్లు జుట్టు సహజత్వాన్ని దెబ్బతీస్తాయి. వేడి తగిలినప్పుడు జుట్టులోని తేమ ఆవిరైపోయి చిట్లిపోవడం మొదలవుతుంది.

Also Read: జబ్బు పడినప్పుడు చెడు కలలు ఎందుకు వస్తాయి ? దీని వెనక ఉన్న సైన్స్ ఏంటి ?

నివారణ మార్గాలు:
ఆహారం: గుడ్లు, చేపలు, ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్ వంటి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి.

నీరు: గట్టి నీరు ఉన్నచోట వాటర్ సాఫ్ట్‌నర్లను వాడటం లేదా ఫిల్టర్ చేసిన నీటితో తలస్నానం చేయడం మంచిది.

వ్యాయామం: యోగా, వ్యాయామం వల్ల ఒత్తిడి తగ్గి, రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.

బట్టతల రావడం అనేది కేవలం వయసు సంబంధిత సమస్య కాదు. అది మన లైఫ్ స్టైల్‌కి ప్రతిబింబం. ముందే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే 30 ఏళ్ల లోపు వచ్చే జుట్టు సమస్యలను సమర్థవంతంగా అడ్డుకోవచ్చు.

 

Related News

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

పిల్లల్లో డిప్రెషన్ ముప్పును తగ్గించే చిన్ననాటి అనుభవాలు ఇవే.. పేరెంట్స్ ఇవి తప్పక తెలుసుకోవాలి!

సాయంత్రం పూట వేడి వేడిగా ఇలా చేసి పెట్టండి ఇంటిల్లిపాదీ ఇష్టంగా తింటారు!

హోటల్ స్టైల్ క్రిస్పీ ఇన్‌స్టంట్ రవ్వ దోశ.. 15 నిమిషాల్లో ఇలా తయారు చేసుకోండి!

Big Stories

Advertisement
×