E-Paper
Advertisement

Mohsin Naqvi: న‌ఖ్వీ జిత్తుల‌మారి నక్క‌, బంగ్లాను 10 ఏళ్లు వెన‌క్కి లాగాడు..ఇండియాతో గొడ‌వ‌లో BCB యూట‌ర్న్‌

Mohsin Naqvi: న‌ఖ్వీ జిత్తుల‌మారి నక్క‌, బంగ్లాను 10 ఏళ్లు వెన‌క్కి లాగాడు..ఇండియాతో గొడ‌వ‌లో BCB యూట‌ర్న్‌
Advertisement

Mohsin Naqvi:  టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament) నేపథ్యంలో చివరి క్షణంలో బంగ్లాదేశ్ వైదొలిగిన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్ లో ( Bangladesh) హిందువులపై దాడులు, ఆ త‌ర్వాత ముస్తాఫిజుర్ రెహ్మ‌న్ ఐపీఎల్ ఆడ‌కుండా బ్యాన్ విధించిన‌ నేపథ్యంలో వివాదం చెలరేగి టోర్నమెంట్ నుంచి బంగ్లాదేశ్ వైదొల‌గాల్సి వచ్చింది. దానికి తోడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ న‌ఖ్వీ మసాలా చ‌ల్లి రెచ్చ‌గొట్టాడు. దీంతో బీసీసీఐపై బంగ్లాదేశ్ ఎగిరి పడింది. త‌ట‌స్థ వేదిక ఏర్పాటు చేయాల‌ని డిమాండ్ చేస్తూ, పాకిస్తాన్ చెప్పిన‌ట్లు బంగ్లాదేశ్ ఆడింది. దీనికి ఐసీసీ ఒప్పుకోలేదు. చివరికి టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament) బహిష్కరించింది బంగ్లాదేశ్. దీంతో కోట్లల్లో బంగ్లాదేశ్ నష్టపోయింది. ఇక ఇప్పుడు తప్పు తెలుసుకున్న బంగ్లాదేశ్.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ( PCB) చైర్మన్ మొక్సిన్ న‌ఖ్వీని ( pcb Mohsin Naqvi ) ఉద్దేశించి విమర్శలు చేస్తోంది. యూటర్న్ తీసుకున్న బంగ్లాదేశ్ ( Bangladesh)…మొక్సిన్ న‌ఖ్వీ కారణంగానే తమ క్రికెట్ బోర్డ్ నాశనమైందని అంటోంది.

Also Read: Albie vs Morne Morkel: మోర్కెల్ కుటుంబంలో చిచ్చు పెట్టిన‌ ఇండియా, ద‌క్షిణాఫ్రికా మ్యాచ్..ఆ త‌ల్లి గుండె కోత ఎవ‌రికి చెప్పుకోవాలి

న‌ఖ్వీ జిత్తుల‌మారి నక్క‌, బంగ్లాను 10 ఏళ్లు వెన‌క్కి లాగాడు

Advertisement

టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఇండియాలో పర్యటించకుండా బంగ్లాదేశ్ ను ఆపింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ మొక్సిన్ న‌ఖ్వీ అంటూ బంగ్లాదేశ్ మాజీ భద్రతాధికారి సయ్యద్ హక్ ( BCB FORMER SECURITY SYED HAQUE) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ జిత్తుల మారి నక్క మొక్సిన్ న‌ఖ్వీ మాటలు విని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ దారి తప్పిందని హాట్ కామెంట్స్ చేశారు. ఆ మొక్సిన్ న‌ఖ్వీ గాడి వల్ల బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మరో 10 సంవత్సరాలు వెనక్కి వెళ్లిందన్నారు. ఇప్పుడు ఐసీసీ తీసుకోబోయే యాక్షన్ కు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ బలి కావాల్సిందేనన్నారు.

దీని అంతటికి కారణం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొక్సిన్ న‌ఖ్వీ అంటూ ఫైర్ అయ్యారు సయ్యద్ హక్. మొక్సిన్ న‌ఖ్వీ మాట విని, టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడ‌కుండా బంగ్లాదేశ్ బ‌హిష్క‌రించింద‌ని తెలిపారు. ఇప్పుడు బాధ‌ప‌డాల్సిన పరిస్థితి ఏర్ప‌డింద‌ని ఫైర్ అయ్యారు స‌య్య‌ద్ హ‌క్‌. వెన‌క ఉండి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు పెద్ద‌ల‌ను మొక్సిన్ న‌ఖ్వీ రెచ్చ‌గొట్టాడ‌ని, చివ‌ర‌కు చేతులు దులుపుకున్నాడ‌ని ఆగ్ర‌హించారు. ఇప్పుడు 10 ఏళ్లు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డును వెన‌క్కి నెట్టి, స‌ర్వ‌నాశ‌నం చేశాడ‌ని సీరియ‌స్ అయ్యారు.  దీంతో బంగ్లాదేశ్ మాజీ భద్రతాధికారి సయ్యద్ హక్ చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి.

అస‌లు వివాదం ఏంటి ?

Advertisement

కాగా హిందువుల‌పై బంగ్లాదేశ్ లో దాడులు జ‌రుగుతోన్న నేప‌థ్యంలో ముస్తాఫిజుర్ రెహ్మ‌న్ ఐపీఎల్ ఆడ‌కుండా బీసీసీఐ నిర్న‌యం తీసుకుంది. దీంతో తాము ఇండియాకు రాబోమ‌ని, పాకిస్తాన్ చెప్పిన‌ట్లు విన్న బంగ్లా, టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ బహిష్కరించింది.

Also Read:  CT 2029-WC 2031 Fact Check: ఇండియాను దెబ్బ‌కొట్టిన పాకిస్తాన్‌..ఐసీసీ ఈవెంట్లు ర‌ద్దు..ఇక బీసీసీఐ రోడ్డున ప‌డ‌ట‌మే !

 

 

 

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×