E-Paper
Advertisement

Bad Dreams: జబ్బు పడినప్పుడు చెడు కలలు ఎందుకు వస్తాయి ? దీని వెనక ఉన్న సైన్స్ ఏంటి ?

Bad Dreams: జబ్బు పడినప్పుడు చెడు కలలు ఎందుకు వస్తాయి ? దీని వెనక ఉన్న సైన్స్ ఏంటి ?
Advertisement

Bad Dreams: కలలు రావడం సహజం. కానీ జ్వరం, జలుబు లేదా ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పుడు వచ్చే కలలు చాలా వింతగా, అస్పష్టంగా, ఒక్కోసారి భయంకరంగా ఉంటాయి. వీటిని ‘ఫీవర్ డ్రీమ్స్’ అని పిలుస్తారు. శరీరం వ్యాధితో పోరాడుతున్నప్పుడు మన మెదడు కూడా ఒక రకమైన గందరగోళానికి లోనవుతుంది. దీని వల్ల నిద్రలో ప్రశాంతత కరువై.. మనసులో రకరకాల ఆలోచనలు పీడకలల రూపంలో బయటకు వస్తాయి. ఈ వింత అనుభవాల వెనక ఉన్న అసలు కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

అనారోగ్య సమయంలో చెడు కలలు రావడానికి గల కారణాలు:

Advertisement

1. శరీర ఉష్ణోగ్రత పెరగడం:
జ్వరం వచ్చినప్పుడు మన శరీర ఉష్ణోగ్రత సాధారణం కంటే.. ఎక్కువగా ఉంటుంది. మన మెదడులోని మేధో సామర్థ్యం, కలలను నియంత్రించే భాగాలు వేడికి చాలా సెన్సిటివ్‌గా ఉంటాయి. ఉష్ణోగ్రత పెరిగినప్పుడు మెదడులోని ‘కాగ్నిటివ్ ప్రాసెస్’ దెబ్బతింటుంది. దీని వల్ల కలలు చాలా స్పష్టంగా, భయంకరంగా కనిపిస్తాయి.

2. REM నిద్రలో అంతరాయం:
మనం కలలు కనే దశను REM నిద్ర అంటారు. అనారోగ్యంతో ఉన్నప్పుడు ముక్కు దిబ్బడ, ఒళ్లు నొప్పులు లేదా దగ్గు వల్ల నిద్రకు పదే పదే భంగం కలుగుతుంది. ఇలా నిద్ర మధ్యలో మెలకువ రావడం వల్ల, మనం కంటున్న కలలు మనకు గుర్తిండిపోవడమే కాకుండా.. అవి మరింత భయంకరంగా అనిపిస్తాయి.

Advertisement

3. మెదడు రక్షణ వ్యవస్థ :
శరీరం ఇన్‌ఫెక్షన్‌తో పోరాడుతున్నప్పుడు, రోగనిరోధక వ్యవస్థ కొన్ని రసాయనాలను విడుదల చేస్తుంది. ఇవి మెదడు పనితీరుపై ప్రభావం చూపుతాయి. ఈ రసాయన మార్పుల వల్ల మన ఆలోచనలు అస్తవ్యస్తంగా మారి, కలలలో వింత దృశ్యాలు కనిపిస్తాయి.

4. మందుల ప్రభావం:
అనారోగ్య సమయంలో మనం వేసుకునే యాంటీబయోటిక్స్, పెయిన్ కిల్లర్స్ లేదా దగ్గు మందులు మెదడులోని న్యూరో ట్రాన్స్మిటర్లపై ప్రభావం చూపుతాయి. కొన్ని రకాల మందుల వల్ల కూడా పీడకలలు వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

5. మానసిక ఒత్తిడి, ఆందోళన:
జబ్బు పడినప్పుడు “త్వరగా కోలుకుంటానా లేదా?”, “పని ఆగిపోతుందేమో” అనే ఆందోళన మన సబ్-కాన్షియస్ మైండ్‌లో ఉంటుంది. ఈ మానసిక ఒత్తిడి రాత్రి పూట భయానక కలలుగా రూపాంతరం చెందుతుంది.

6. డీహైడ్రేషన్:
జ్వరం ఉన్నప్పుడు శరీరం త్వరగా నీటిని కోల్పోతుంది. డీహైడ్రేషన్ వల్ల మెదడుకు అందే ఆక్సిజన్, పోషకాలలో స్వల్ప మార్పులు రావచ్చు. ఇది భ్రాంతులు లేదా వింత కలలకు దారి తీస్తుంది.

Also Read: నిద్రపోయే ముందు చేసే ఈ తప్పులు.. కిడ్నీలను పాడు చేస్తాయ్ జాగ్రత్త !

ఫీవర్ డ్రీమ్స్ నుంచి ఎలా బయటపడాలి ?
అనారోగ్య కలలు రాకుండా ఉండాలంటే ఈ కింది జాగ్రత్తలు తీసుకోవాలి.

శరీరాన్ని చల్లబరచడం: గది ఉష్ణోగ్రత సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోవాలి. తడి గుడ్డతో ఒళ్లు తుడవడం వల్ల జ్వరం తగ్గి, నిద్ర ప్రశాంతంగా పడుతుంది.

ద్రవ పదార్థాలు: పుష్కలంగా నీరు, కొబ్బరి నీళ్లు లేదా పండ్ల రసాలు తాగి డీహైడ్రేషన్ కాకుండా చూసుకోవాలి.

విశ్రాంతి: బలవంతంగా పని చేయకుండా శరీరానికి పూర్తి విశ్రాంతి ఇవ్వాలి.

తేలికపాటి ఆహారం: పడుకునే ముందు జీర్ణం కావడానికి కష్టంగా ఉండే ఆహారాన్ని మానుకోవాలి.

అనారోగ్యంతో ఉన్నప్పుడు వచ్చే చెడు కలలు తాత్కాలికమైనవి మాత్రమే. శరీరం తిరిగి సాధారణ స్థితికి చేరుకోగానే ఇవి మాయమవుతాయి. కాబట్టి వీటిని చూసి భయపడాల్సిన పనిలేదు. అయితే.. ఈ కలలు మరీ ఎక్కువగా వస్తూ నిద్రను పూర్తిగా పాడు చేస్తుంటే.. మాత్రం డాక్టర్‌ని సంప్రదించడం మంచిది.

Related News

LED ఫేస్ మాస్క్ ముఖంపై ముడతలు తగ్గిస్తుందని ప్రచారం.. నిజంగా పనిచేస్తుందా?

సండే స్పెషల్.. ఎప్పుడూ ఒకేలా కాకుండా మటన్‌ను ఇలా గ్రీన్‌గా వండి చూడండి.. వేళ్లు నాకేస్తారు!

అరకు ఫేమస్ బొంగు చికెన్.. తింటే జీవితంలో ఆ రుచిని మర్చిపోరు, ఎలా చేయాలో తెలుసా?

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

Big Stories

Advertisement
×