E-Paper
Advertisement

Portable AC vs Split AC: బడ్జెట్, విద్యుత్ ఆదా కోసం.. ఈ రెండు ఏసీల్లో.. ఏది కొంటే బెటర్?

Portable AC vs Split AC: బడ్జెట్, విద్యుత్ ఆదా కోసం.. ఈ రెండు ఏసీల్లో.. ఏది కొంటే బెటర్?

Portable AC vs Split AC: ప్రస్తుతం మార్కెట్ లో ప్రధానంగా రెండు రకాల ఏసీలు అందుబాటులో ఉన్నాయి. అందులో ఒకటి స్ప్లిట్ ఏసీ (Split AC) కాగా రెండోది పోర్టబుల్ ఏసీ. మెుదటిది ఇంటి గదిలోని గోడకు అమరిస్తే.. పోర్టబుల్ మోడల్ ఒక చోటు నుంచి మరో చోటుకు ఈజీగా తరలించేందుకు వీలు కల్పిస్తుంది. ప్రస్తుత సమ్మర్ లో ఏసీలకు డిమాండ్ పెరిగిపోయిన నేపథ్యంలో ఈ రెండింటిలో ఏది కొంటే బెటర్? ఫీచర్ల పరంగా తేడాలు? బడ్జెట్, లాభనష్టాలు? వంటివి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Split AC vs Portable AC

డిజైన్ విషయానికి వస్తే స్ప్లిట్ ఏసీ అనేది ఇండోర్ యూనిట్, ఔట్ డోర్ యూనిట్ అనే రెండు సెటప్ లతో లభిస్తుంది. ఇండోర్ ను గదిలోపల గోడకు అమర్చనుండగా.. అవుట్ డోర్.. ఇంటి బయట లేదా బాల్కానీలో ఉంచుతారు. ఇది కంప్రెషర్ లా పనిచేస్తుంది. ఇండోర్ యూనిట్ గదిలోని వేడి గాలిని పీల్చుకొని చల్లటి ఎయిర్ ను విడుదల చేస్తుంది. అవుట్ డోర్ యూనిట్ వేడి గాలిని బయటకు పంపించేస్తుంది. ఇక పోర్టబుల్ ఏసీ విషయానికి వస్తే.. ఇండోర్, ఔట్ డోర్ భాగాలు రెండూ ఒకే బాక్సులో ఉంటాయి. దీని వెనుక ఎగ్జాస్ట్ పైపు మాత్రం ఉంటుంది. దీని ద్వారా గదిలోని వేడిగాలి బయటకు వెళ్తుంది.

ఫీచర్లు, పనితీరు

స్ప్లిట్ ఏసీ చాలా వేగంగా, సమర్థవంతంగా గదిని చల్లబరుస్తుంది. దీనితో పోలిస్తే పోర్టబుల్ ఏసీ కొంచెం నెమ్మదిగా ఉంటుంది. స్ప్లిట్ ఏసీలో కంప్రెషర్ బయట ఉండటం వల్ల శబ్దం అస్సలు ఉండదు. పోర్టబుల్ లో కంప్రెషర్ మిషన్ లోనే ఉండటం వల్ల నాయిస్ ఎక్కువగా ఉంటుంది. ఇన్ స్టాలేషన్ విషయానికి వస్తే స్ప్లిట్ కోసం ప్రొఫెషనల్స్ హెల్ప్ అవసరం. అదే పోర్టబుల్ అయితే ఎక్కడికైనా తరలించవచ్చు. అయితే ఎగ్జాస్ట్ పైపును మాత్రం కిటికీ నుంచి బయట వైపునకు పెట్టాల్సి ఉంది. స్ప్లిట్ ఏసీ గోడపై స్థలాన్ని ఆక్రమిస్తే.. పోర్టబుల్ నేలపై ప్లేసును ఆక్యుపై చేస్తుంది.

విద్యుత్ ఆదా

విద్యుత్ ఆదా విషయంలో స్ప్లిట్ ఏసీ బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తోంది. ఇందులో 5 స్టార్ ఇన్వర్టర్ టెక్నాలజీ ఉంటుంది. గది చల్లబడగానే కంప్రెషర్ వేగాన్ని తగ్గించి విద్యుత్ ఆదా చేస్తుంది. పోర్టబుల్ ఏసీల్లో ఇన్వర్టర్ టెక్నాలజీ చాలా తక్కువ మోడల్స్ లో ఉంటుంది. పైగా వేడి గాలిని బయటకు పంపే పైపు సరిగ్గా సీల్ చేయకపోతే బయటి వేడి లోపలికి వచ్చి కంప్రెషర్ నిరంతరం పనిచేసేలా చేస్తుంది. దీనివల్ల కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తుంది.

బడ్జెట్ పరంగా.. 

స్ప్లిట్ ఏసీల ధర సాధారణంగా రూ. 30,000 నుండి రూ. 55,000 వరకు ఉంటుంది. దీనికి ఇన్‌స్టాలేషన్ ఖర్చులు కింద మరో రూ.1,500 – 2,500 వరకూ అదనపు భారం పడుతుంది. Portable AC విషయానికి వస్తే.. ఇవి మార్కెట్ లో రూ.28,000-45,000 మధ్య సేల్ అవుతున్నాయి. దీనికి ఇన్‌స్టాలేషన్ ఖర్చులు ఉండవు.

లాభనష్టాలు

స్ప్లిట్ ఏసీ నిశ్శబ్దంగా పనిచేస్తూ మెరుగైన కూలింగ్ ను అందిస్తాయి. పోర్టబుల్ ఏసీతో పోలిస్తే విద్యుత్ బిల్లును సైతం ఆదా చేస్తాయి. గాలిని శుభ్రపరిచే ఫిల్టర్లు ఈ ఏసీల్లో మెరుగ్గా ఉంటాయి. అయితే వేరే ఇంటికి మారేటప్పుడు దీనిని తీసుకెళ్లడం కష్టంగా అనిపించవచ్చు. రీ ఇన్ స్టాలేషన్ కోసం అదనంగా కొంత ఖర్చు చేయాల్సి ఉంటుంది. పోర్టబుల్ విషయానికి వస్తే.. అద్దె ఇళ్లల్లో ఉండేవారికి ఇది బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తోంది. గోడకు రంధ్రాలు చేయాల్సిన అవసరం లేదు. ఒక రూమ్ నుండి మరో రూమ్ కి మార్చుకోవచ్చు. అయితే ఎక్కువ శబ్దం, విద్యుత్ బిల్లు కాస్త ఇబ్బందిగా మారవచ్చు.

Also Read: Portable AC vs Portable Air Cooler: రెండింటిలో ఏది బెస్ట్? బడ్జెట్, ఫీచర్లు, లాభనష్టాలు.. డిటైల్డ్‌గా తెలుసుకోండి!

ఓవరాల్‌గా ఏది కొంటే బెటర్?

సొంత ఇల్లు ఉండి, మెరుగైన కూలింగ్, తక్కువ పవర్ బిల్లు కోరుకునే వారు.. స్ప్లిట్ ఏసీని ఎంపిక చేసుకోవచ్చు. ప్రశాంతమైన నిద్ర కావాలన్న ఇదే బెస్ట్ ఛాయిస్. అలా కాకుండా తరుచూ ఇళ్లు మారుతుండటం, గోడకు ఏసీ పెట్టే సదుపాయం లేకపోవడం, ఇంటి యజమాని గోడకు రంధ్రం చేయడానికి ఒప్పుకోని పరిస్థితుల్లో పోర్టబుల్ ఏసీని తీసుకోండి. మీకు సాధ్యమైతే Split Inverter ACకే ప్రాధాన్యత ఇవ్వండి. ఇది లాంగ్ రన్ లో మీకు చాలా డబ్బును (కరెంట్ బిల్లు రూపంలో) ఆదా చేస్తుంది.

Also Read: Washing Machine Tips: మీ ఇంట్లో వాషింగ్ మిషన్ ఉందా? ఈ తప్పులు చేయకండి.. చేశారో మర్నాడు షెడ్డుకే!

Related News

ఇన్వర్టర్ బ్యాటరీ త్వరగా అయిపోతోందా? ఈ 5 కారణాలే కావచ్చు!

గూగుల్ మైండ్ బ్లోయింగ్ అప్డేట్.. ఇంటర్నెట్ లేకున్నా లోకల్ PCలో ఏఐ ఫీచర్లు.. ఎలాగో తెలుసా?

ఇల్లంతా చల్లగా ఉండాలా.. సెంట్రలైజ్డ్ ఏసీ బెస్ట్ భయ్యా.. కాకపోతే!

అబ్బా ఏం ఆఫర్..శాంసంగ్ లేటెస్ట్ 5G ఫోన్ ధర భారీగా తగ్గింది.. ఇక మీదే ఆలస్యం!

సైలెంట్‌గా మొబైల్ మార్కెట్‌లో దిగిన Honor X7e.. ఫీచర్లు, ధర వివరాలపై ఓ లుక్కుయండి!

కదిలే ఏసీ కావాలా? 2026లో టాప్ ఇవే.. ఎక్కడకెళ్లినా మీ వెంటే!

యాడ్స్, బ్లోట్‌వేర్ లేని బెస్ట్ 5G ఫోన్.. రూ.12 వేల లోపే లాంచ్ చేసిన లావా!

Window vs Split vs Studio AC: రూమ్ చిన్నదా.. బడ్జెట్ తక్కువనా.. సామాన్యులకు వీటిలో ఏది పర్ఫెక్ట్ ఏసీ?

Big Stories

×